E-Paper
Advertisement

Rashmi Guatham : పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ రష్మీ..అబ్బాయి ఎవరో తెలుసా..?

Rashmi Guatham : పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ రష్మీ..అబ్బాయి ఎవరో తెలుసా..?
Advertisement

Rashmi Guatham : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు యాంకర్ రష్మీ గౌతమ్.. బుల్లితెర నుంచి వెండితెరకు చాలామంది వెళ్తూ ఉంటారు.. ఇక్కడ క్రేజ్ ని సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటారు. కానీ యాంకర్ రష్మీ మాత్రం ముందుగా సినిమాలు చేసి ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతుంది. ఈమధ్య ఈమె ఒకవైపు సినిమాలు , మరోవైపు టెలివిజన్ షోలు చేస్తూ బిజీగా ఉంది. రష్మి గురించి నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా రష్మీ పెళ్లి గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. కానీ ఇప్పుడు మరోసారి ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇది హార్ట్ టాపిక్ గా మారింది.. అయితే ఆమె పెళ్లి చేసుకోబోతున్న వరుడు ఎవరో అన్నది ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం..

పెళ్లి చేసుకోబోతున్న యాంకర్ రష్మీ..

బుల్లితెరపై ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న టాప్ యాంకర్స్ లలో యాంకర్ రష్మి గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా ఆమెకు మంచి పాపులారిటీ దక్కింది. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉంది. అంతేకాదు సినిమా అవకాశాలను కూడా వదలకుండా వచ్చిన ప్రతి సినిమాని చేస్తూ వస్తుంది. అయితే ఈమె జబర్దస్త్ నటుడు సుడిగాలి సుదీర్ తో ప్రేమాయణం నడుపుతుందని గతంలో వార్తలు వినిపించాయి.. కానీ అందులో నిజం లేదని, కేవలం రేటింగ్ కోసమే ఆ జంటను లవర్స్ గా క్రియేట్ చేశారని ఒక క్లారిటీ వచ్చింది. అయినా కూడా వీరిద్దరి మధ్య రూమర్స్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా సోషల్ మీడియాలో మరో కొత్త రూమర్ ప్రచారంలో ఉంది. ఈమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అని నెట్టింట టాక్.. ఇందులో నిజం అయితే లేదు కానీ త్వరలోనే ఈ న్యూస్ కూడా వినే అవకాశం ఉందని రష్మీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఇంట్లో వాళ్లు చూసిన అబ్బాయినే చేసుకుంటుందని చెప్పింది. కొన్ని కారణాలవల్ల పేరెంట్స్ కి దూరంగా ఉన్న రష్మీ తన పెళ్లితో మళ్ళీ దగ్గర అయ్యే అవకాశం కూడా ఉంది.

యానిమల్ లవర్ రష్మీ.. 

Advertisement

రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటిగా యాంకర్ గా మాత్రమే కాదు అనిమల్ లవర్ గా కూడా ఆమె అందరికీ తెలుసు.. రష్మి గౌతమ్‌ పెట్‌ డాగ్స్ విషయంలో మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 15, ఇరవై ఏళ్లు ఎమోషనల్‌ బాండింగ్‌ అవసరం ఉందని చెప్పారు.. ఈమధ్య చిన్నారులపై జరుగుతున్న కుక్కల దాడులు గురించి ఆమె స్పందిస్తూ నిత్యం వార్తలో నిలుస్తూ వస్తుంది.. కొందరు ఆమె వ్యాఖ్యలకు సపోర్టుగా నిలిస్తే.. మరికొందరు నెటిజన్లు మాత్రం రష్మీ చేస్తుంది తప్పు అంటూ ఆమెను ట్రోల్ చేస్తూ ఉంటారు.. ఏది ఏమైనా కూడా రష్మీ మాత్రం మూగజీవులపై ప్రేమను కురిపిస్తూ వాటికి కావలసిన అవసరాలను తీరుస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు మతిపోగొట్టేలా చేస్తుంది.

Related News

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?

Karthika Deepam 2 Serial Today Episode September 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, కార్తీక్ లను వెనకేసుకొచ్చిన జ్యోత్స్న       

Illu illaalu Pillalu Prema : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ప్రేమను తొలగించారా?

Big Stories

Advertisement
×