E-Paper
Advertisement

Best Small EV Cars 2026: రెనాల్ట్ To మారుతి.. బెస్ట్ స్మాల్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Best Small EV Cars 2026: రెనాల్ట్ To మారుతి.. బెస్ట్ స్మాల్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
Advertisement

Best Electric Cars 2026: దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లపై వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని  తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ అందించే కార్లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి ఆటో మోబైల్ కంపెనీలు. అందులో భాగంగానే ప్రస్తుతం పలు చిన్న ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని ఈ ఏడాదిలో విడుదల కాబోతున్నాయి. ఇంతకీ ఆ కార్లు ఏవి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

2026లో పాపులర్ స్మాల్ ఎలక్ట్రిక్ కార్లు

Advertisement

⦿ MG రామెట్ EV: ప్రస్తుతం అందుబాటులో ఉన్న చిన్న MG Comet..ఈ ఏడాదిలో అప్ డేటెడ్ వెర్షన లో అందుబాటులోకి రానుంది. మెరుగైన బ్యాటరీ రేంజ్ తో రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కారు ఒకే ఛార్జ్ తో 230 కిమీ రేంజ్ అందిస్తుంది. సరికొత్త ఫీచర్లతో సుమారు రూ. 6-8 లక్షలతో అత్యంత సరసమైన ఈవీగా గుర్తింపు తెచ్చుకోనుంది.  ప్రస్తుతం 17.3 – 17.4 kWh బ్యాటరీని కలిగి ఉంది. చాలా చిన్న పరిమాణం కావడంతో  నగరంలో పార్కింగ్‌కు, ప్రయాణానికి సులభంగా ఉంటుంది.

⦿ టాటా టియాగో EV: ఇండియన్ ఎలక్ట్రిక్ కార్లలో చిన్న కారుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీని ధర సుమారు రూ.7.99 లక్షల నుంచి రూ. 11.14 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు 19.2 kWh బ్యాటరీతో 250 కి.మీ, 24 kWh బ్యాటరీతో 315 కి.మీ రేంజ్ ను అందించనుంది. ఫాస్ట్ ఛార్జింగ్, మంచి ఫీచర్లు, మంచి పనితీరుతో ఆకట్టుకుంటుంది.

Advertisement

⦿ టాటా పంచ్ EV: ఈ కారు SUV లుక్ లో ఉంటుంది. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, మెరుగైన స్థలాన్ని కలిగి ఉంటుంది. దీని ధర సుమారు రూ.9.99 లక్షల నుంచి రూ. 14.44 లక్షలు ఉంటుంది. ఒకే ఛార్జ్ తో ఈ కారు 315-421 కిమీ రేంజ్ ను అందిస్తుంది.

Read Also: పెట్రోల్ vs డీజిల్ కార్లలో ఏది బెస్ట్? ఎందుకు?

⦿  PMV EASE:ఇది 2 సీటర్ స్మార్ట్ మైక్రో కారు. పట్టణ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

⦿ రెనాల్ట్ 5: ఈ కారు రెట్రో డిజైన్‌, 52 kWh బ్యాటరీతో సుమారు 400 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తోంది. ఇది 2026లో బెస్ట్ స్మాల్ ఈవీగా గుర్తింపు తెచ్చుకోనుంది.

⦿ వోక్స్‌ వ్యాగన్ ఐడి పోలో: ఇది 37 kWh, 52 kWh బ్యాటరీ ఆప్షన్లతో రాబోతున్నది. సుమారు 450 కిమీ రేంజ్, 435 లీటర్ల బూట్ స్పేస్‌తో రానుంది. దీని ధర సుమారు సుమారు రూ.22-23 లక్షల లోపు ఉండే అవకాశం ఉంది.

⦿ మారుతి e Vitara: భారత మార్కెట్లో, మారుతి సుజుకి e Vitara 2026 లో చిన్న, సరసమైన విభాగంలో ముఖ్యమైన ఛాయిస్ గా మారనుంది.

⦿ ఆడి E3:  ఆడి నుంచి రాబోతున్న కొత్త ఎంట్రీ లెవల్ హ్యాచ్‌ బ్యాక్ ఇది. వోక్స్ వ్యాగన్ MEB+ ప్లాట్‌ ఫారమ్‌ ను ఉపయోగించి, ప్రీమియం ఫీచర్లతో చిన్న విభాగంలో పోటీపడుతుంది. 11 kW AC, 80-130 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో రానుంది. చిన్న పరిమాణం, ఉన్నా ఎక్కువ ఇంటీరియర్ స్పేస్ ఉంటుంది.

Read Also: కళ్లు చెదిరేలా టయోటా హైలాండర్ EV 2027, ఈ కారు ప్రత్యేకతలు ఏంటో తెలుసా భయ్యా!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×