E-Paper
Advertisement

Kissik Talks: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. కానీ – సంజన ఎమోషనల్!

Kissik Talks: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. కానీ – సంజన ఎమోషనల్!
Advertisement

Kissik Talks:ప్రముఖ సినీ నటి సంజన గల్రాణి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన నటనతో ప్రేక్షకులను అబ్బురపరిచింది. ముఖ్యంగా ‘బుజ్జిగాడు’ సినిమాలో ప్రభాస్ మరదలి పాత్రలో చాలా అద్భుతంగా ఒదిగిపోయింది. అలా ఈ సినిమాతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది సంజన. ముఖ్యంగా తెలుగులో ‘సోగ్గాడు’ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.. తెలుగు సినిమాలలో నటిస్తుండగానే అటు తమిళ్ ,మలయాళం, కన్నడ భాషా చిత్రాలలో కూడా అవకాశాలు లభించడంతో అక్కడ కూడా తనదైన ముద్ర వేసింది సంజన. ఇక ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ సీజన్ 9లో కూడా సందడి చేసిన ఈమె తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేసింది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను చెప్పుకుంటూనే.. తాను జైలుకు వెళ్లిన విషయంపై కూడా ఎమోషనల్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా ఆ సమయంలో తాను చనిపోవాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చింది.

ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా – సంజన

జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు ఇతరులను నమ్మడం. ముఖ్యంగా నేను సెలబ్రిటీని కావడం వల్ల నేను చేయని తప్పుకు కూడా నన్ను ఇరికించారు. ముఖ్యంగా డ్రగ్స్ కేసులో నా పేరు రావడం నేను తట్టుకోలేకపోయాను. దీనికి తోడు నన్ను జైలుకు కూడా పంపించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా నేను తప్పు చేశానని నాపై కొంతమంది కావాలని తప్పుడు వార్తలు సృష్టించి, నన్ను జైలుకు పంపించారు. అందుకే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కానీ ఆ సమయంలో నాకు నా ఫ్యామిలీ గుర్తొచ్చింది. నేను చెయ్యని తప్పుకు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి. నా వాళ్ళని ఎందుకు నేను ఒంటరిని చేయాలి అని అనుకున్నాను. అందుకే నాపై పడిన నిందను చెరిపేసి ఆ తర్వాత నేను చనిపోయినా పర్వాలేదు అనిపించింది.

మా ఎదుగుదలను ఓర్వలేకపోయారు..

Advertisement

ముఖ్యంగా నా ఎదుగుదలను చాలామంది ఓర్వలేకపోయారు. ఎలాగైనా సరే నన్ను నా కుటుంబాన్ని తొక్కేయాలని తెగ ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే ఇలా డ్రగ్స్ మాఫియాలో నన్ను ఇరికించి, నా కుటుంబాన్ని కూడా ఇబ్బందులకు గురి చేశారు. ముఖ్యంగా నేను ఎవరినైతే నమ్మానో.. వారు మొదట నాతో చాలా మంచిగా మూవ్ అయ్యారు . కానీ వారి వల్లే నేను ఈ ఇబ్బందులు ఎదుర్కొంటాను అని అప్పుడు తెలుసుకోలేకపోయాను. ఇక ఇప్పుడైతే నేను ఎవరిని నమ్మను. నా ఫ్యామిలీని తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరిపైన అంత నమ్మకం లేదు.. అంటూ కుండబద్దలు కొట్టేసింది సంజన. ఇక ఎవరైనా ఎప్పుడైనా ఎలాగైనా మారొచ్చు అని ఈ సమాజం నాకు నేర్పించింది అంటూ తెలిపింది..

also read:ఎంగేజ్మెంట్ వీడియో షేర్ చేసిన అషు రెడ్డి.. అసలైన ట్విస్ట్ ఇదేకదా!

బిగ్ బాస్ కి వెళ్ళింది అందుకే..

Advertisement

ఇంట్లో 5 నెలల పాపను విడిచి నేను బిగ్ బాస్ కి వెళ్లడానికి కారణం కూడా ఇదే.. డబ్బు అవసరం ఉండి వెళ్లడం ఒక ఎత్తైతే.. నాపై పడిన నిందన చెరిపేయడానికి నేను ప్రధానంగా బిగ్ బాస్ ని ఎంచుకున్నాను.. ఇక నేను ఏ తప్పు చేయలేదు అని అందరికీ తెలిసింది అంటూ తనపై పడ్డ మార్కును చెరిపి వేసుకోవడానికి తానుపడ్డ ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది సంజన.

Related News

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

సింగర్ కనకవ్వ పాటలకు అంత క్రేజ్ ఎందుకు?

మాట నిలబెట్టుకున్న వైవా హర్ష.. జబర్దస్త్ బాబుకి కళ్ళు చెదిరే గిఫ్ట్!

Big Stories

Advertisement
×