E-Paper
Advertisement

Satyabhama Serial Today Episode : మహాదేవయ్యకు సత్య మీద అనుమానం.. క్రిష్ గురించి చక్రవర్తి ఏం చెప్పాడంటే?

Satyabhama Serial Today Episode : మహాదేవయ్యకు సత్య మీద అనుమానం.. క్రిష్ గురించి చక్రవర్తి ఏం చెప్పాడంటే?
Advertisement

Satyabhama Serial Today Episode October 3rd : నిన్నటి ఎపిసోడ్ లో సత్య నందిని మైత్రి పెళ్లి చూపులు అని నందిని హడావిడి చేస్తుంది. మంచి సంబంధం అని అందరికీ చెబుతుంది. మైత్రి లైఫ్ సెటిల్ అయితే మనకే మంచిది కదా అని అందరితో సంతోషంగా అంటుంది. ఇక మైత్రి ని చూసి ఇలా రెడీ అయితే ఎవరు చూడరు నా దగ్గర మంచి చీరలు ఉన్నాయి. తీసుకొస్తాను అని వెళ్తుంది. హర్షను చూసి పెళ్లి చూపులు నీకు కాదు మైత్రికి అంటుంది. ఇక సత్య తన వయసు కనుక్కోమని చెప్పడానికి క్రిష్ ను తెలుగు మాస్టర్ దగ్గరకు పంపిస్తుంది. అక్కడ ఆయన దెబ్బకు క్రిష్ తర్జన భర్జన పడతాడు. క్రిష్ కోసం చక్రవర్తి ఫోన్ చేస్తాడు. చక్రవర్తిని ఇంటికి రమ్మని పిలుస్తుంది సత్య. నాకు క్రిష్ పుట్టుక గురించి ఏదైన తెలుస్తుందేమో అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. క్రిష్ సత్య వాళ్ల తెలుగు మాస్టర్ చేతిలో అడ్డంగా బుక్ అయ్యాడు. ఆయన నుంచి నిజం రాబట్టలేక ఇబ్బంది పడతాడు.. ఆయన చేష్టలకు కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ ఓపికగా ఉంటాడు. ఇకమాస్టర్ చెప్పిన పద్యం అర్థం కాక, చెప్పలేక బ్రతిమలాడుతాడు. ఆయన వయసు 56 సంవత్సరాలు అని చెబుతాడు. హమ్మయ్య అని క్రిష్ సత్య వయసు క్యాలుకులేట్ చేస్తాడు. సత్య పుట్టిన ఏడాదిని తెలుసుకొని సంబరపడి పోతాడు. ఈరోజు శోభనంకు రెడీగా ఉండు సంపంగి అంటూ మెలికలు తిరిగిపోతాడు.. ఇక మైత్రి పెళ్లి చూపులు విషయంలో అందరు టెన్షన్ పడుతుంటారు. అప్పుడే అబ్బాయి వాళ్లు వస్తారు. ఇంట్లోకి రావడానికి కూడా వాళ్లు ముహూర్తం చూస్తారు. దానికి అందరు షాక్ అవుతారు. ఈరోజుల్లో కూడా ఈ పట్టింపులు ఏంటి అంటే ఏదైన మేము శాస్త్రం ప్రకారం వెళ్తామని చెబుతారు.

Advertisement

ఇక హర్ష వాళ్ల మీద అరుస్తాడు. మీ పద్ధతులు మాకు నచ్చలేదు అని అడుగుతాడు. రేపు మైత్రి మీ ఇంటి కోడలు అయితే ఏదైన జరిగితే ఇలానే అంటారా అంటే, అంటాము బిడ్డ వచ్చినవేళ, గొడ్డు వచ్చిన వేళ అంటారుగా అంటాడు.. ఇదంతా కాదు టైం అయ్యింది అంటారు. అప్పుడే నందిని స్వీట్స్ ఇస్తుంది. వద్దమ్మా అతికితే గతకదు అంటారు. అమ్మాయిని తీసుకురండి అంటారు. అమ్మాయిని కూర్చోబెట్టగానే ఏదోకటి అంటారు.. దానికి షాక్ అయిన మైత్రి తన స్టయిల్లో ఇస్తుంది. అమ్మాయికి పొగరు మాకు ఈ సంబంధం అవసరం లేదు అని వెళ్ళిపోతారు.. ఇక మహదేవయ్య ఇంటికి చక్రవర్తి వస్తాడు. ఏంట్రా ప్లాన్ ప్రకారమే ఇక్కడకు వస్తున్నావా అని అడుగుతాడు. నేనే రమ్మని పిలిచానని అంటుంది సత్య. అందరు ముచ్చట్లు పెట్టుకుంటారు. అంతలోకే క్రిష్ అక్కడకు వస్తాడు. ఏంటి బాబాయ్ ఇలా వచ్చావు అంటే మహదేవయ్య నిజం చెబుతాడా అని టెన్షన్ పడుతుంటాడు.. బాబాయ్ కొడుకు అమెరికాలో ఉన్నాడు పెద్ద చదువులు చదువుతున్నాడని చెబుతుంది. దానికి సత్య ఎవరిని కడుపున పుడితే అలా ఉంటారు అని అంటుంది.

ఇక భోజనానికి అంతా సిద్ధం చేస్తుంది సత్య.. చక్రికి ఇష్టమైన వంటలే చేశావ్ అంటే అవును అమ్మమ్మ అంకుల్ ను అడిగి తెలుసుకొని చేసానని చెబుతుంది. అవును అంకుల్ మీరు ఎందుకు ఇక్కడ ఉండరు అని అడుగుతుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు అని మహదేవయ్య, భైరవి అంటారు. అదేం లేదమ్మా నాకు ఈ గొడవలు, చంపడం నరకడాలు నచ్చవు అందుకే దూరంగా ఉన్నాను అంటాడు. క్రిష్ పుట్టినప్పుడు వీడికి కొడుకు పుట్టాడు అని బామ్మ అంటుంది. మహదేవయ్య సత్యకు నిజం ఎక్కడ తెలిసిపోతుందో అని టెన్షన్ పడతాడు. ఇక మైత్రి సంబంధం చెడిపోతుంది అని అనుకోలేదు అని ఏడుస్తుంది. హర్ష తో బాధపడుతుంది. నాకు ఇక ఏ సంబంధం చూడొద్దు అంటుంది. ఇక సత్య ఆమెను ఓదారుస్తాడు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో సత్యతో శోభనం కోసం అంతా సిద్ధం చేస్తాడు క్రిష్.. కానీ సత్య ఇచ్చినా ట్విస్ట్ కు షాక్ అవుతాడు. తాను పుట్టిన నెల కనుక్కోవాలని హింట్ ఇస్తుంది.. ఇక నందిని మైత్రి పై ఎలా విరుచుకుపడుతుందో చూడాలి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×