BigTV English

Kangana Ranaut: మళ్లీ చిక్కుల్లో పడ్డ కంగనా.. నోటిదూల ఎక్కువే సుమీ..?

Kangana Ranaut: మళ్లీ చిక్కుల్లో పడ్డ కంగనా.. నోటిదూల ఎక్కువే సుమీ..?

Kangana Ranaut.. మండీ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచి.. ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ , కాంట్రవర్సీ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన బ్యూటీ కంగనా రనౌత్ (Kangana Ranaut) వివాదాలలో చిక్కుకుంటోందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈమె నోటి దూలే ఈమెను చిక్కుల్లో పడేలా చేస్తోందని చెప్పడంలో సందేహం లేదు. గతంలో రైతుల విషయంలో నోరు జారి మహిళా కానిస్టేబుల్ చేత చంప దెబ్బ తిన్న కంగనా రనౌత్.. నిన్న గాంధీ జయంతి సందర్భంగా చేసిన పోస్ట్ ఒకటి చాలామందిలో ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. అంతేకాదు సొంత పార్టీ లోనే వ్యతిరేకత లు ఏర్పడేలా చేసింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


మహాత్మా గాంధీని తక్కువ చేస్తూ కంగనా పోస్ట్..

బుధవారం మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గురించి సోషల్ మీడియాలో కంగనా రనౌత్ చేసిన పోస్ట్ కొత్త వివాదానికి దారితీస్తోంది. అంతకు ముందు రైతుల ఉద్యమం, అలాగే ఉప సంహరించబడిన వ్యవసాయ చట్టాలపై ఈమె చేసిన వ్యాఖ్యలకు విమర్శలు ఎదుర్కొన్న ఈమె, ఇప్పుడు తాజా పోస్ట్ తో మరోసారి చిక్కుల్లో ఇరుక్కుంది. తాజాగా కంగనా చేసిన పోస్టులో ఏముంది అనే విషయానికొస్తే దేశానికి అసలు జాతి పితలు ఎవరూ లేరు. కేవలం కుమారులు మాత్రమే ఉన్నారు. ముఖ్యంగా భారత మాతకు లాల్ బహదూర్ శాస్త్రి లాంటి కుమారులు ఉండడం నిజంగా అదృష్టం అంటూ వ్యాఖ్యానించింది కంగనా. దీంతో మహాత్మా గాంధీని ఉద్దేశపూర్వకంగానే తక్కువ చేశారని కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతోంది.


కంగనా పై మండిపడ్డ కాంగ్రెస్ నాయకురాలు..

కంగనా ఇక్కడితో ఆగకుండా మరో పోస్ట్ పెట్టింది. దేశంలో పరిశుభ్రతపై గాంధీజీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లినందుకు ప్రధాని నరేంద్ర మోడీ పై ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్ పెట్టింది. దీంతో కాంగ్రెస్ నాయకురాలు సుప్రియ శ్రీనాథ్ తీవ్రంగా కంగనా రనౌత్ పోస్టు పై
మండిపడ్డారు. గాంధీ జయంతి సందర్భంగా బిజెపి ఎంపీ కంగనా ఇలా వ్యంగంగా కామెంట్ చేసింది. అసలు గాడ్సే ఆరాధకులే బాపు – శాస్త్రి మధ్య అసలైన తేడాను చూపుతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు నరేంద్ర మోడీ తన పార్టీ కొత్త గాడ్సే భక్తుడిని మనస్ఫూర్తిగా క్షమిస్తారా అంటూ కూడా ఆమె ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

సొంత పార్టీ నేతలే కంగనాకు వ్యతిరేకం..

మరొకవైపు గాంధీజీ 155 వ జయంతి సందర్భంగా కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలను తాను కూడా ఖండిస్తున్నాను అంటూ పంజాబ్ బిజెపి సీనియర్ నేత మనోరంజన్ కాలియా పోస్ట్ చేశారు. తన రాజకీయ జీవితంలో వివాదాస్పద ప్రకటనలు చేయడం ఆమెకు అలవాటయింది. రాజకీయం ఆమె రంగం కాదు కానీ రాజకీయం అనేది తీవ్రమైన అంశం. మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించాలి. ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి కూడా ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఇకనైనా ఆమె తన నోటి దూలను అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అంటూ కూడా కాలియా మండిపడ్డారు. మొత్తానికైతే తన పార్టీ వ్యక్తులే తనకు వ్యతిరేకంగా మారుతున్నారని నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం..

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×