E-Paper
Advertisement

Flipkart Sale 2024 : సేల్లో అదిరిపోయే బంపర్ ఆఫర్.. రూ.10,999కే ఒప్పో 5G స్మార్ట్ ఫోన్

Flipkart Sale 2024 : సేల్లో అదిరిపోయే బంపర్ ఆఫర్.. రూ.10,999కే ఒప్పో 5G స్మార్ట్ ఫోన్
Advertisement

Flipkart Sale 2024 : ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024లో స్మార్ట్ ఫోన్స్ పై అదిరిపోయే ఆఫర్స్ నడుస్తున్నాయి. ఆపిల్, సామ్ సాంగ్, వివో, రియల్ మీ, ఒప్పో ఫోన్స్ పై భారీ తగ్గింపును అందిస్తుంది. ఇక ఒప్పోలో పలు సిరీస్లపై ఆఫర్స్ తీసుకొచ్చిన ఫ్లిప్ కార్ట్… సేల్ లో భాగంగా Oppo K12x 5G ఫోన్ పై భారీ ఆఫర్ ను ప్రకటించింది. దీంతో రూ.16.999 ఫోన్ను కేవలం రూ.10,999కే కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తుంది.

ఒప్పో K12x 5Gపై ఫ్లిప్కార్ట్ లో బంపర్ సేల్ కొనసాగుతుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Color OS 14 ఆపరేటింగ్ సిస్టమ్,  120Hz రిఫ్రెష్ రేట్‌, 6.67 అంగుళాల HD+(720×1,604 పిక్సెల్‌లు) LCD స్క్రీన్‌ కలిగి ఉంది. 6nm మీడియా టెక్ డైమెన్సిటీ, 6300 చిప్‌సెట్‌తో 8GBRAM, 256GB UFS 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజీ కలిగి ఉంది.

Advertisement

ట్రినిటీ ఇంజిన్ సపోర్ట్‌తో హై క్వాలిటీ ఫాస్ట్ లోడ్ బ్యాటరీను అందిస్తుంది. 5100mAh బ్యాటరీ 45W Super VOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. 32 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరాను కలిగి ఉంది. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్‌, MIL STD 810H సర్టిఫైడ్ మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ కలిగి ఉంది. వాటర్ డస్ట్ రెసిస్టెంట్ తో ఈ ఫోన్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ జాబితాలో ఉంది.

ఇక ఈ ఫోన్ పై స్పెషల్ బ్యాంక్ ఆఫర్స్ సైతం ఫ్లిప్కార్ట్ అందిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేస్తే 5% డిస్కౌంట్ లభిస్తుంది. ఇక hdfc క్రెడిట్ కార్డుపై 10% రాయితీతో పాటూ.. ఈ కార్డుపై ఈఎమ్ఐ సదుపాయంతో కొనుగోలు చేస్తే రూ.1250వరకూ తగ్గింపు లభిస్తుంది. కొనుగోలు సమయంలో క్యాష్ బ్యాక్, కూపన్స్ వర్తిస్తే రూ.4000వరకూ తగ్గింపు పొందే అవకాశం ఉంది. నో కాస్ట్ ఈఎమ్ఐ సదుపాయం కూడా కలదు. Oppo K12x 5Gపై ఎక్స్ ఛేంజ్ సదుపాయం సైతం కలదు. ఈ ఆఫర్ తో ఫోన్ ను రూ.7950కే దక్కించుకునే అవకాశం ఉంది. ఏడాది పాటూ డివైజ్ వారెంటీ, 6నెలల పాటూ మ్యాన్ ఫ్యాక్చర్ వారెంటీను అందిస్తుంది.

Advertisement

AlSO READ : తేలికపాటి స్పేస్ సూట్ తయారు చేసిన చైనా.. ఎలాన్ మస్క్ ఎలా రియాక్ట్ అయ్యాడంటే?..

అయితే సెప్టెంబర్ 30న ప్రారంభమైన బిగ్ బిలియన్ డేల్ 2024లో ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తుంది. కస్టమర్స్ ను అట్రాక్ట్ చేసేందుకు ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్స్, హోమ్ యాక్సెసరీస్ పై భారీ తగ్గింపును అందిస్తుంది. ఎలక్ట్రానిక్స్ పై 50% నుంచి 80% తగ్గింపులు అందిస్తోంది. గృహ ఉపకరణాల మీద 80 శాతం వరకు తగ్గింపును ప్రకటించిన ఫ్లిప్కార్ట్… రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్, 4K స్మార్ట్ టీవీలు, ఎయిర్ కండీషనర్స్ పై గరిష్టంగా 75% తగ్గింపును అందిస్తుంది.

కస్టమర్ సదుపాయం కోసం బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ డీల్స్, ఈఎమ్ఐ ఆప్షన్స్, క్యాష్ బ్యాక్ కూపన్స్, డిస్కౌంట్స్, నో కాస్ట్ ఈఎమ్ఐ వంటి సదుపాయాలను సైతం అందిస్తుంది. ఇక లిమిటెడ్ డీల్స్ లో బెస్ట్ ఆఫర్స్ అందిస్తున్న ఈ సేల్.. బడ్జెట్ ఫ్రెండ్లీ అనే చెప్పొచ్చు.

 

 

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×