E-Paper
Advertisement

Satyabhama Serial Today Episode September 23 : రుద్రను దారుణంగా కొట్టిన మహదేవయ్య.. అసలు నిజం తెలుసుకున్న సత్య…

Satyabhama Serial Today Episode September 23 : రుద్రను దారుణంగా కొట్టిన మహదేవయ్య.. అసలు నిజం తెలుసుకున్న సత్య…
Advertisement

Satyabhama Serial Today Episode September 23 : గత ఎపిసోడ్ లో మహాదేవయ్యను చంపడానికి ప్రయత్నించింది తన కొడుకే అన్న నిజంను నరసింహ ద్వారా తెలుసుకుంటాడు.. క్రిష్ మళ్లీ సత్యకు దగ్గర అవ్వడానికి చూస్తాడు.. ఇక సత్య కూడా క్రిష్ ను గొడవలకు దూరంగా ఉంచాలని అనుకుంటుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఈరోజు ఎపిసోడ్ విషయానికొస్తే.. నరసింహను పట్టుకొని నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తావా.. ఎంత దైర్యం ఉంది నీకు అని మహదేవయ్య అడుగుతాడు. దానికి నరసింహ నిన్ను చంపాలని నేను అనుకుంటానా.. నాకేం అవసరం ఉంది.. నిన్ను చంపాలని అనుకుంది నేను కాదు నీ కడుపున పుట్టినరోజు పెద్ద కొడుకు రుద్ర ప్రతాప్ అని చెబుతాడు.. దానికి షాక్ అయిన మహదేవయ్య బయటకు వచ్చి రుద్రతో కారు తీయు ఇంటికి వెళ్దాం. అని అంటాడు.. అలా ఇంటికి తీసుకోని వస్తాడు.. అయితే సత్య అది చూసి మామయ్య గారు భావగారిని ఎందుకు ఇలా లాక్కొని వెళ్తున్నాడని చూసి వెనకాల వెళ్తుంది.. ఇక మహదేవయ్య రూమ్ లోకి తీసుకొని వెళ్లి కొరడాతో కొడతాడు. నన్ను ఎందుకు చంపాలని అనుకుంటున్నావు అని అడుగుతాడు..

Satyabhama Serial Today Episode September 23
Satyabhama Serial Today Episode September 23
Advertisement

నన్ను ఎక్కడ గుర్తింపు లేకుండా చేస్తున్నావ్ బాపు.. ప్రతి దాంట్లో మహదేవయ్య పెద్ద కొడుకు ఎందుకు పనికిరాడు అని చేస్తున్నావు. ప్రతి దాంట్లో చిన్నా అని చూస్తున్నావ్. వాడికే ఎక్కువగా ప్రేమను చూపిస్తున్నావ్. పెద్ద కొడుకుగా ఏ రోజు నన్ను కొడుకుగా గుర్తించలేదు. ఏ అడుక్కొనే వాడికి పుట్టినా ప్రేమగా చూసుకుంటాడు. నువ్వు ప్రతిదీ చిన్నా అంటావు అని నీలాదీస్తాడు. దానికి మహదేవయ్య ఆస్తి పత్రాలను చూపిస్తాడు. అన్ని ఆస్తులలో నీపేరు ఉంది. అవును నా పేరు మీద ఆస్తి రాస్తే చిన్నా గాడు గొడవ చెయ్యడానికి వస్తాడుగా అని రుద్ర అడుగుతాడు. దానికి మహదేవయ్య ఆ చిన్నా రాడు. రక్తం పంచుకొని పుట్టిన కొడుకులకు ఆస్తి చెందుతుంది. కానీ కోర్టు ఒప్పుకోదు కదా అని అడుగుతాడు.

ఆస్తి నా మొహానా ఆస్తి కొట్టి రాజకీయంగా ఎదిగేలా చేస్తున్నావ్.. అందుకే యూత్ లీడర్ ను చెయ్యాలని అనుకున్నావా అని రుద్ర అడుగుతాడు. దానికి మహదేవయ్య వాడు నా కొడుకు కాదు. ఏంటి బాపు నువ్వు చెప్పేది.. అవును రా నా ప్రాణాలను కాపాడుకోవడానికి వాడిని కాపాడటానికి కుక్కలా ఉంచుకున్నాను. కేవలం నా వారసుడుగా నిన్ను కాపాడుకోవడానికి వాడిని అడ్డుపెట్టుకుంటున్న అని చెబుతాడు. అది కాదు బాబు వాడు ఎవడు ఎందుకు నువ్వు తెచ్చుకున్నావ్. ఆ చిన్నా గాడు ఎవడి కొడుకు అని రుద్ర అడుగుతాడు. అది ఇప్పుడు చెప్పలేను నువ్వు ఇప్పుడు సంతోషంగానే ఉన్నావా.. వాడి గురించి చెప్పు బాపు అంటాడు. అన్ని సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తాయి. నువ్వు ప్రాణాలతో ఉండటమే నాకు కావాలి ఇప్పటికైనా నీ బాపు మీద కోపం పోయిందా అని అడుగుతాడు. దానికి రుద్ర మహదేవయ్య కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతాడు.. ఆ సీన్ మొత్తాన్ని సత్య చూస్తుంది. అసలు ఏం జరుగుతుంది అని టెన్షన్ పడుతుంది.

Satyabhama Serial Today Episode September 23
Satyabhama Serial Today Episode September 23
Advertisement

ఇక కింద టిఫిన్ పెట్టేందుకు సత్య అని అందరు పిలుస్తారు. అప్పుడే సత్య వస్తుంది. రేణుక సత్య ఎక్కడికి పోయావు. నువ్వు లేవని మా మరిది ఎలా ఉన్నాడో చూడు అని చెబుతుంది. అదేం లేదు వాళ్ల నాయనా కోసం చూస్తున్నాడు అని భైరవి అంటుంది. దానికి క్రిష్ భామ్మ కూడా వాళ్ల నాయనా కూడా అంతే చిన్నా కూడా పెట్టకుండా తినడు అంటుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంట అని మహదేవయ్య అంటాడు. దానికి చిన్నా అది ఎలా బాపు ఎమ్మెల్యే అవ్వడం నీ కల దాన్ని నేను నెరవేరుస్తాను. వాడికి చెప్పారా చిన్నా లేకుంటే చంపెయ్ అని చెబుతాడు. దానికి చిన్నా వెళ్తాడు. అప్పుడే సత్య వచ్చి అడ్డుకుంటుంది. దానికి బాపు నువ్వు చెప్పిన మాటను ఎప్పుడైనా కాదాన్నానా అని చిన్నా అంటాడు. ఇక చిన్నా ఆవేశంలో బయటకు వెళ్తాడు. క్రిష్ ను ఎలాగైన బయటకు వెళ్ల నివ్వకూడదు అని సత్య బయటకు వెళ్లింది. క్రిష్ వెళ్తుంటే బయటకు వెళ్లి క్రిష్ వెళ్తున్న బైక్ ముందుకు వెళ్తుంది.. మరి క్రిష్ కు సత్య మహదేవయ్య కొడుకు కాదు అనే నిజాన్ని చెబుతుందా లేదా అక్కడకు వెళ్లోద్దని చెబుతుందా? ఏది ఏమైనా రేపటి ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి..చిన్నాకు సత్య అసలు నిజం చెబుతుందా లేదా అన్నది రేపటి ఎపిసోడ్ లో చూడాలి..

Related News

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

బిగ్ బాస్ షోలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఈమె!

Gundeninda Gudigantalu : సీరియల్లో యూట్యూబర్ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ మావా..

Intinti Ramayanam : పల్లవి అవుట్.. ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Big Stories

Advertisement
×