BigTV English

Bangalore Mahalakshmi Murder case: బెంగుళూరు మహాలక్ష్మి హత్య, 30 ముక్కలు చేసి, ఆపై..

Bangalore Mahalakshmi Murder case: బెంగుళూరు మహాలక్ష్మి హత్య, 30 ముక్కలు చేసి, ఆపై..

Bangalore Mahalakshmi Murder case: సంచలనం రేపుతోంది బెంగుళూరు మహాలక్ష్మి హత్య కేసు. ఆమె దారుణంగా హత్య చేసి బాడీని 30 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టారు నిందితులు. వారం కిందట జరిగిన ఈ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహాలక్ష్మి మర్డర్ కేసు బెంగుళూరు పోలీసులు పెద్ద ఛాలెంజ్‌గా మారింది.


బెంగుళూరు సిటీలోని వయ్యాలికావల్ ప్రాంతంలో జరిగిన మహాలక్ష్మి హత్య కేసు సంచలనం రేపుతోంది. ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది 29 ఏళ్ల మహాలక్ష్మి. ఉత్తరాది ప్రాంతానికి చెందిన ఈమెకు మ్యారేజ్ అయ్యింది. ఫ్యామిలీ సమస్యల కారణంగా భర్తకు దూరంగా ఒంటరిగా ఉంటోంది.

మహాలక్ష్మి సోదరుడు హుకుంసింగ్ భార్య దీపికతో కలిసి 15 రోజులపాటు ఇంట్లో ఉంది. మరి ఏమైందో తెలీదుగానీ గొడవ పెట్టుకుని అన్నయ్య ఫ్యామిలీకి దూరంగా ఉంటోంది. మహాలక్ష్మి బెంగుళూరు సిటీలోని ఓ బ్యూటీ పార్లర్‌లో పని చేస్తోంది. అప్పుడప్పుడు తల్లి వచ్చిన తన కూతురు యోగక్షేమాలు చూసేది.


వర్క్  నేపథ్యంలో అక్కడ పని చేస్తున్న ఓ వ్యక్తితో మహాలక్ష్మికి పరిచయం ఏర్పడింది. ఫ్యామిలీ సమస్యలు మరిచిపోయి హాయిగా ఉంటోంది. వీరిద్దరి మధ్య సేహ్నానికి దారి తీసింది. చివరకు వీరిద్ధరి మధ్య విభేదాలు పొడచూపినట్టు తెలుస్తోంది. ఏం జరిగిందో తెలీదు.

ALSO READ: బర్త్‌డే పార్టీకి వెళ్లిన యువతి.. ఆమెను జ్యూస్ తాపించి మరో యువతి ఏం చేసిందంటే

ఈనెల 20 సాయంత్రం సమయంలో మహాలక్ష్మి సోదరుడికి పక్క ఫ్లాట్ వ్యక్తి ఫోన్ చేశాడు. మీ చెల్లి ఇంట్లో నుంచి ఏదో దుర్వాసన వస్తోందని తెలిపాడు. ఇదే విషయాన్ని హుకుంసింగ్ తన తల్లికి చెప్పాడు. శనివారం వెళ్లి చూద్దామని తల్లి చెప్పడంతో సరేన్నాడు.

శనివారం ఉదయం మహాలక్ష్మి ఇంటికి తల్లి, సోదరుడు వచ్చారు. ఇంటికి తాళం వేసింది. పక్కనే ఉన్న ఫ్లాట్ వ్యక్తి తాళం బద్దలుకొట్టాడు. లోపలికి తల్లి మీనారాణి, సోదరుడు హుకుంసింగ్ వెళ్లారు. బట్టలు ఎక్కడిపడితే అక్కడ ఉన్నాయి. రూమ్‌లో నుండి దారుణమైన వాసన వస్తోంది.

ఇంట్లోని ఫ్రిజ్ సమీపంలో రక్తపు మరకలు కనిపించాయి. ఓపెన్ చేసి చూడగా మహాలక్ష్మి శరీరానికి సంబంధించి 30 ముక్కలు అందులో కనిపించాయి. దీంతో బాధిత కుటుంబసభ్యులు షాకయ్యారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రంగంలోకి దిగిన పోలీసులకు ఈ కేసు మిస్టర్ బిగ్ ఛాలెంజ్‌గా మారింది. పోలీసులు వచ్చి ఇంట్లో అంతా తిరిగారు. మహాలక్ష్మి శరీరానికి కెమికల్స్ ఉన్నట్లు గుర్తించారు. దాని వల్లే అవి కుళ్లిపోలేదని అంటున్నారు. కరెంట్ పోయిన తర్వాత ఫ్రిజ్ నుంచి నుంచి దుర్వాసన వచ్చినట్టు అంచనాకు వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

మహాలక్ష్మి పని చేసిన బ్యూటీ పార్లర్‌కి వెళ్లి విచారణ మొదలుపెట్టారు పోలీసులు. మృతురాలి కుటుంబసభ్యులు నలుగురు వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. వీరంతా బ్యూటీ పార్లర్‌లోని సహ ఉద్యోగులు. వీరిలో ఇద్దరు ఉత్తరాఖండ్‌కు చెందినవారిగా గుర్తించారు. మరో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈనెల 18న ఇద్దరు వ్యక్తులు ఆ ఫ్లాట్‌కు వచ్చినట్టు తెలుస్తోంది. వారం కిందట హత్య జరగ్గా, రెండురోజుల కిందట వెళ్లిందెవరు? అనేదానిపై సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు పోలీసులు. ఎలాంటి ఆధారాలు లేవు. నిందితులు మరో రాష్ట్రానికి పరారైనట్టు భావిస్తున్నారు. నిందితుల కోసం ఆరు పోలీసు టీమ్‌లు గాలిస్తున్నాయి.

అన్నట్లు రెండేళ్ల కిందట అంటే 2022 మే 18న ఢిల్లీలో శ్రద్ధా‌వాకర్‌ను ఆమె లవర్ పూనావాలా దారుణంగా హత్య చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నిందితుడు పూనావాలా కూడా వాకర్‌ను చంపి, ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేశాడు. మృతురాలి శరీరం ముక్కలను మూడు వారాలపాటు ఫ్రిజ్‌లో ఉంచి వాటిని ఢిల్లీ సిటీలోని వివిధ ప్రాంతాల్లో విసిరి వేసిన సంగతి తెల్సిందే.

Related News

Kondapur News: హైదరాబాద్‌లో దారుణం.. బౌన్సర్లను చితికబాదిన కస్టమర్లు.. వీడియో వైరల్

Cyber Crime: సైబర్ నేరగాళ్ల కొత్త రకం మోసం.. పహల్గాం ఘటనను వాడుకుంటూ

Visakhapatnam News: విషాదం.. గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి

Medak District: రెచ్చిపోతున్న కామాంధులు.. ఛీ ఛీ గేదెపై అత్యాచారం, ఎక్కడో కాదు..!

Doctor Negligence: ఫుల్‌గా తాగి నిద్రపోయిన డాక్టర్.. నవజాత శిశువు మృతి

Vijayawada News: ఏపీ పోలీసులకు చెమటలు.. చెర నుంచి తప్పించుకున్న బత్తుల, తెలంగాణ పోలీసుల ఫోకస్

Bengaluru News: బెంగుళూరులో దారుణం.. 12 ఏళ్ల కూతురి కళ్ల ముందు.. భార్యని చంపిన భర్త

Robbery In Khammam: దొంగల బీభత్సం.. ఒకే రాత్రి ఆరు ఇళ్లల్లో చోరీ

Big Stories

×