BigTV English

TikTok Bans skinny Influencer: వెయిట్ లాస్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని బ్యాన్ చేసిన టిక్ టాక్.. ఆమెను చూస్తే ఆశ్చర్యపోకతప్పదు!

TikTok Bans skinny Influencer: వెయిట్ లాస్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని బ్యాన్ చేసిన టిక్ టాక్.. ఆమెను చూస్తే ఆశ్చర్యపోకతప్పదు!

TikTok Bans skinny Influencer| సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది వ్యూస్ రావాలని.. త్వరగా గుర్తింపు తెచ్చుకోవాలని చాలా మంది ఇన్‌ఫ్లున్సర్లుగా మారుతున్నారు. తమకు తోచిన ఏవో విషయాలు చెప్పి నెజినెన్లను ఆకర్షిస్తున్నారు. దీని కోసం కొందరు బైక్ స్టంట్లు, కార్ స్టంట్లు చేస్తే.. మరి కొందరు విపరీతంగా తినడం లేదా త్వరగా బరువు తగ్గే వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ కోవలోనే అమెరికాకు చెందిన ఒక యువతి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారింది. ఆమె టిక్ టాక్ లో తరుచూ వీడియోలు చేస్తోంది. కానీ ఆమె వీడియోల్లో తప్పుడు సమాచారం ఉందని.. ప్రజలకు దాని వల్ల హాని కలుగుతుందని విమర్శులు రావడంతో టిక్ టాక్ ప్లాట్ ఫామ్ ఆమె అకౌంట్ ను బ్లాక్ చేయడంతో పాటు ఆమెపై ఏకంగా నిషేధం విధించింది.


వివరాల్లోకి వెళ్తే.. అమెరికా వార్తా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం ప్రకారం.. లివ్ షిమిడ్ అనే యువతికి టిక్ టాక్ భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఛానెల్ కు 7 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇటీవల ఆమె వీడియోల్లో ప్రజలకు హాని కలిగించే సమాచారం ఉందని నిపుణులు విమర్శించడంతో టిక్ టాక్ ఆమె అకౌంట్ ను బ్లాక్ చేసింది.

Also Read: నిద్ర తక్కువైతే లివర్ డ్యామేజ్!.. ఇవే లక్షణాలు..


22 ఏళ్ల వయసు గల లివ్ షిమిడ్ ఒక కార్పొరేట్ జాబ్ చేస్తోంది. అయితే ఆమె బరువు పెరగకుండా ఉండేందుకు, త్వరగా బరువు తగ్గేందుకు తన టిక్ టాక్ లో వీడియోలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె ‘వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే’ అనే శీర్షికతో వీడియోలు చేస్తుంది. ఇందులో ఆమె సన్నగా ఉంటేనే ఆరోగ్యవంతులని తన ప్రేక్షకులకు సూచిస్తుంది. అందుకోసం తనే బరువు తగ్గి బక్క చిక్కిపోయి అందమంటే ఇది.. ఆరోగ్య మంటే ఇదే అని సూచనలు చేస్తుంది. ఈ వీడియోలన్నీ స్కీన్నీ గ్రూప్ కమ్యూనిటీ లో ట్యాగ్ చేసి వీడియోలు చూడడానికి 9.99 డాలర్లు సబ్స్‌క్రిప్షన్ చార్జ్ చేస్తుంది. దీంతో ఈ వీడియోలు ద్వారా ఆమెకు మంచి సంపాదన వస్తోంది.

పైగా ఆహారం ఏ సమయంలోనైనా తినొచ్చు కానీ చాలా తక్కువగా తినాలి.. అని చెబుతూ.. ప్రొటీన్ పౌడర్లు, డైటరీ సప్లిమెంట్స్, యాంకిల్ వెయిట్స్ ఉపయోగిస్తే.. ఆరోగ్యానికి చాలా లాభాలని యాడ్స్ చేస్తూ ఉంటుంది. ఆమె చెప్పే సూచనలు ఆరోగ్యానికి హానికరమని చాలా వైద్య నిపుణులు, న్యూట్రిషనిస్టులు ఆమెపై కేసులు వేశారు. అయినా ఆమె పట్టించకోకుండా ఆ వీడియోలు చేస్తూనే ఉంది. దీంతో టిక్ టాక్ ఆమె అకౌంట్ ని తొలగించింది. పైగా లివ్ షిమిడ్ ను మరే ఇతర అకౌంట్ల ద్వారా వీడియోలు చేయకూడదని నిషేధం విధించింది.

Also Read:  టెటనస్ వ్యాక్సిన్ తీసుకోగానే సీరియస్ రియాక్షన్.. చావుబతుకుల్లో యువతి

అయితే దీనిపై లివ్ షిమిడ్ వెంటనే స్పందించింది. ”అమెరికా పెరిగిపోతున్న ఊబకాయానికి నేను పరిష్కారం చూపిచాలనుకున్నాను. చాలామంది మనుషులు బరువు తగ్గడం ఎలా? అని ఆలోచిస్తూ ఉంటారు. వారికి నేను సాయం చేయాలనే ఉద్దేశంతోనే వీడియోలు చేశాను. నా ప్రేక్షకులు కూడా అదే కోరుకుంటున్నారు. నేను స్కీన్నీగా ఉంటూ.. ఇతరులను కూడా అలాగే ఉండాలని చెబుతున్నాను. ఇందులో తప్పేముంది?” అని ప్రశ్నించింది.

మరోవైపు లివ్ అకౌంట్ ని బ్లాక్ చేయాలని ఆమెపై విమర్శలు చేసిన వైద్య నిపుణుల స్పందిస్తూ.. టిక్ టాక్ పై చాలా మంది అమ్మాయిలు ముఖ్యంగా టీనేజర్లు ఆమె వీడియోలు చూస్తున్నారు. వారంతా అమాయకంగా ఆమె చెప్పేది నమ్మి.. అనారోగ్యం కొని తెచ్చుకునే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు.

Related News

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Big Stories

×