BigTV English

Satyabhama Today Episode : సత్య ఫ్యామిలీకి క్రిష్ సాయం.. మహాదేవయ్య నిజ స్వరూపం బయటపడిందా..?

Satyabhama Today Episode : సత్య ఫ్యామిలీకి క్రిష్ సాయం.. మహాదేవయ్య నిజ స్వరూపం బయటపడిందా..?

Satyabhama Today Episode December 13th : నిన్నటి ఎపిసోడ్ లో.. భైరవి తో చిన్న కోడలపై పెత్తనం సాగించాలని అనుకుంటుంది. పంకజం భైరవిని రెచ్చ గొడుతుంది.. దానికి సాయంత్రం లోపల దాన్ని రప్పిస్తాను చూడు అనేసి భైరవి అంటుంది. కానీ పంకజం దానికి కౌంటర్లు వేస్తుంది. ఒక్క పూట నేను పోతే చేసుకోలేరా పెద్ద కోడలు ఉంది కదా అనేసి అంటే దానికి ఒక ప్లాన్ ఉందని భైరవి అంటుంది. పెద్ద కోడలు బామ్మ సడన్గా చచ్చిపోయిందని ఫోన్ వస్తుంది.. సత్యకు ఫోన్ చేసి రమ్మని చెప్పినా సత్య రాకపోగా, క్యారెజీ ని పంపిస్తుంది. తర్వాత రోజు భైరవి సత్య పుట్టింటికి వెళ్లి లొల్లి చేస్తుంది. వెంటనే సత్తెను పంపించమని అడుగుతుంది. భైరవి మాట విని విశాలాక్షి విశ్వనాథంలు సత్యను ఇంటికి పంపించడానికి రెడీ అవుతారు కానీ సత్య మాత్రం నేను వెళ్ళను ఇక్కడ సమస్యలు ఉన్నాయని చెప్తుంది. అప్పుడే వచ్చిన క్రిష్ సత్య నేను తోలుకొని వస్తాను కాని నువ్వు వెళ్ళు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అనేసి బైరివిని అక్కడి నుంచి పంపిస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. సత్య క్రిష్ ఇద్దరి కలిసి కరెంట్ ఆఫీస్ కి వెళ్లి విశ్వనాథం ఇంటి గురించి మాట్లాడతారు. ఆ నెంబర్ పైన రెండు లక్షలు అప్పు ఉంది అని చెప్పగానే క్రిష్ గట్టిగా నిలదీసి అడుగుతాడు. సత్య కూడా మేము వెయిట్ చేస్తాం ఎక్కడ బాకీలు ఉన్నారో అవి కొంచెం క్లియర్ గా చెప్పగలరా అనేసి అంటుంది. కానీ కరెంట్ ఆఫీస్ లో అతను నానుస్తాడు. నువ్వు రెచ్చిపోయిన సత్య అతనికి వార్నింగ్ ఇస్తుంది. ఇక క్రిష్ కూడా అతనికి చేయూకాలం లేకుండా చూసుకోవాలని వార్నింగ్ ఇస్తాడు. దాంతో కరెంటు వదులుతామని చెప్తారు. ఇక అతను మహదేవయ్యకి ఫోన్ చేసి క్రిష్ చేసిన హంగామాను చెప్తాడు. ఇక మహాదేవయ్యా ఇంటి కరెంట్ వస్తానే సరిపోదు ఇంకొక సమస్య వస్తుంది. ఇంటికి వెళ్ళండి మీకే తెలుస్తుందని అనుకుంటాడు. మహదేవయ్యా తనలో తానే మాట్లాడుకోవడం భైరవి చూస్తుంది. ఏందయ్యా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అంటే వెర్రి మొదటి స్టేజ్ అంట నీకు తెలుసా అనేసి పరాచకాలు ఆడతాడు. అవును గాని నీ చిన్న కోడలు ఎంత పని చేసిందో తెలుసా పుట్టింటికి వెళ్ళింది అక్కడే ఉండిపోయింది అనేసి అంటుంది భైరవి.. సత్య పుట్టింట్లోనే కొన్ని దినాలు ఉన్న నీదే ఇప్పుడు నీకేమైంది అనగానే, ఇంట్లో పనిచేయదా నేను ఒక్కదాని ఎలా చేసుకోవాలి అనేసి భైరవి ఉంటుంది. ఆవిడను తీసుకురమ్మంటావా అనేసి మహాదేవయ్య అంటాడు. ఎవరు ఆవిడ అని భైరవి అడిగితే అదే ఆ గంగను తీసుకురమ్మంటావా నీకు మంచి ఉంటది అనేసి మహాదేవయ్య అంటాడు.

గంగ మాట వినగానే సర్రున లేచిన భైరవి నాకు మంచి ఉంటదా నీకు మంచిగ ఉంటదా దాని పేరు ఇంకొకసారి తీసుకొస్తే నీకు మంచిగా ఉండదు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సత్యాక్రిష్యులు ఇంట్లోకి వెళ్తారు. క్రిష్ ఆనందంతో కరెంటు వచ్చింది చూసావా అనేసి అందరికీ చెప్తాడు. ఆ సంతోషం కాసేపు కూడా ఉండలేదు. వెంటనే పాతిక లక్షలు ఇవ్వాలని మరో బ్యాచ్ వచ్చి ఇంట్లో కూర్చుంటుంది. విశ్వనాథంతో మర్యాద లేకుండా మాట్లాడటంతో క్రిష్ రెచ్చిపోతాడు.. మర్యాద లేకుండా మాట్లాడొద్దు మంచిగా చెప్పండి నీకు డబ్బులు అడిగారు కదా టైం ఇచ్చావు కదా ఆ టైం కి వాళ్ళు ఇస్తారు అనేసి క్రిష్ వాళ్ళతో గొడవకు దిగుతాడు. వాళ్లని నాలుగు పీకుతాడు విశ్వనాథం ఆపగానే ఆగుతాడు. నేను పైసలు తీసుకొచ్చేస్తాను అడ్డమైన వాళ్ళ చేత మాటలు పడాల్సిన అవసరం మనకు లేదు అనేసి పౌరుషంతో క్రిష్ డబ్బులు కోసం మహదేవయ్య దగ్గరికి వెళ్తాడు. భైరవి మహదేవయ్య మాట్లాడుకుంటుండగా క్రిష్ వెళ్లి 25 లక్షలు నా బామ్మర్దికి కావాలని అడుగుతాడు.


భైరవి అంత పైసలు వాళ్లకి ఇచ్చుడేంది అనేసి అడుగుతుంది. ఇక జయమ్మ కూడా క్రిష్ కి సపోర్ట్ చేస్తుంది.. నువ్వు నాకోసం నా ఎలక్షన్స్ కి అడ్డు రాకుండా ఉండడం కోసమే చేసావా అని నాకు అర్థమైంది రా.. నీకు ఎంత కావాలంటే అంత తీసుకో ఇదిగో అని చెప్పేసి పాతిక లక్షలు తెచ్చి ఇస్తాడు. ఇక క్రిష్ వెళ్తే హర్ష మౌనంగా బయటకు వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు. నందిని హర్షి దగ్గరికి వచ్చి వాళ్ళు ఇలా నెట్ ఇంట్లో కూర్చుని ఉన్నారు ఇదంతా నీ వల్లే కదా ఆ మహాతల్లి కోసం నువ్వు చేసిన అప్పు వల్లే కదా అనేసి హర్షను తిడుతుంది. అప్పుడే మైత్రి ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన నందిని మైత్రి కి క్లాస్ పీకుతుంది. నువ్వు ఫారిన్ పోతావని నా మొగుడు లక్షల ఖర్చు చేశాడు. ఫారిన్ పోకుండా సంతోషంగా అయితే ఉన్నావ్ మాకు ఇంట్లో కష్టాలు వచ్చి పడ్డాయి ఇదంతా నీ వల్లే ఇంకొకసారి నా మొగుడికి కాల్ చేస్తే బాగోదని మార్నింగ్ ఇస్తుంది. సత్య ఫోన్ లాక్కొని ఏదో కోపంలో మాట్లాడింది నువ్వేం పట్టించుకోకు మైత్రి నేను తర్వాత కాల్ చేస్తానని ఫోన్ పెట్టేస్తాడు. మైత్రి తో అలా అనడంతో నందిని పై కోపంతో రగిలిపోతాడు హర్ష. ఒక మూర్ఖురాలు లాగా ప్రవర్తిస్తున్నావు అవును నిజమే నువ్వొక మూర్ఖురాలివే అనేసి హర్ష అనగానే నందిని సీరియస్ అవుతుంది. వెంటనే సత్య ఎంట్రీ ఇచ్చి హర్షనే తిడుతుంది. అన్నయ్య ఏదో కోపంలో మాట్లాడాడు నువ్వేం పట్టించుకోవద్దు వదినా అనేసి సత్య నందిని తంటుంది. ఇక క్రిష్ డబ్బులు తీసుకొచ్చి వాళ్లకు ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఇంటిని కలవడానికి కొందరు మనుషులు వస్తారు. ఇక క్రిష్ కు మహదేవయ్య గురించి నిజం తెలిసిపోతుందా లేదా అనేది చూడాలి..

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×