Brahmamudi serial today Episode: కృష్ణుడి విగ్రమం దగ్గరకు వెళ్లి తన బాధ చెప్పుకుంటుంది కావ్య. నా నెత్తిన ఇంత బరువు పెట్టి మోయమంటే నేను ఎలా మోయగలను కృష్ణా అంటూ వేడుకుంటుంది. ఇంతలో ఇందిరాదేవి వచ్చి ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది. నిందాస్తుతి చేస్తున్నాను అని కావ్య చెప్పగానే.. ఆ జగద్ గురువే నీకు మార్గం చూసిస్తాడు. ఈనాడు ఈ ఆస్థి ఐశ్వర్యం నీ చేతికి వచ్చిందంటే అది ఆ స్వామి ఘటన కాకుంటే.. మరింకేంటి..? సంశయాలన్నీ పక్కన పెట్టు ఇదే నీకు సముచితమైన స్థానం. కాదనకుండా బాధ్యతలు తీసుకో అని చెప్తుంది. ఇంతలో సుభాష్, అపర్ణ వస్తారు. చాలా సంతోషంగా ఉంది అమ్మా.. ఆస్థి అపాత్రదానం కాకుండా ఆ భగవంతుడే అడ్డుపడ్డాడు. సమయానికి ఈ వీలునామా మన చేతికి వచ్చేలా చేశాడు.
ఆస్థి నా పేరున రాసినా రాజ్ పేరున రాసిన ఈ దుర్మార్గులు ఆటాడుకునే వారు. మా నాన గారు దూరదృష్టితో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్తాడు సుభాస్. దీంతో కావ్య భయంతో మామయ్యగారు ఇది పరిష్కారం అని మీకనిపిస్తుంది. కానీ చిన్నత్తయ్యా కోర్టుకు వెళ్తానంటున్నారు. రుద్రాణి ఎగదోస్తుంది. వాళ్లను కంట్రోల్ చేయడం నావల్ల అవుతుందా..? అని అడగ్గానే.. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మా నాన్న పకడ్బందీగా వీలునామా రాశారు. ఎవరు కుప్పి గంతులు వేయలేరు. అని భరోసా ఇస్తాడు. అపర్ణ కూడా కావ్యను ధైర్యంగా బాధ్యతలు తీసుకోమని నీకు నీ అత్తా మామల సపోర్టు ఉంది.
మా అత్తామామల సపోర్టు కూడా ఉందని చెప్తుంది అపర్ణ. ఎంత ఈజీగా బరువు బాధ్యతలు దించేసుకున్నారు మీరు అని కావ్య అడగ్గానే ఇది మామయ్యగారి నిర్ణయం దాన్ని కాదనే హక్కు నీకు లేదు.. మాకు లేదు అని అపర్ణ చెప్తుంది. ఈ ఆస్థి పత్రాల వెనక బావ మనసులో ఉన్న పరమార్థం ఒక్కటే కావ్య. ఈ ఇల్లు ముక్కలు కాకూడదని.. ఇది ముళ్ల దారే కానీ ఏరిపారేస్తూ నడవాల్సిందే.. అని చెప్పి వెళ్లిపోతారు. వీళ్లు ఇలాగే మాట్లాడారు. ఆయనకు చెప్పి ఎలాగైనా ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలి అని మనసులో అనుకుంటుంది కావ్య.
ఆస్థి పత్రాలు, తాళాలు తీసుకుని రాజ్ దగ్గరకు వెళ్తుంది కావ్య. ఏంటని అడగ్గానే సుభాష్, అపర్ణ, ఇందిరాదేవి వచ్చి చెప్పిన మాటలు చెప్పి.. అవన్నీ నాకు అర్తం కాలేదని చెప్తుంది. దీంతో కామెడీ చేస్తున్నావా..? తాతయ్య వీలునామాలో క్లియర్‌గా రాస్తే నువ్వు ఇలా తప్పించుకుని వెళ్లిపోతే ఎలా..? ఈ ఇంట్లో అందరికంటే నువ్వే తెలివైన దానివి అని బాధ్యతలు నీ మీద పెట్టారు తాతయ్యగారు అని చెప్తాడు రాజ్. ఏమోనండి నాకివేవీ అర్థం కావు. ఇప్పుడైతే మీరు తీసుకోండి.. తాతయ్యగారు వచ్చాక నేను చెప్తాను అని కావ్య అనగానే..
నేనేమీ ఊరికే తీసుకోను అది దానదర్మంగా అంటాడు రాజ్. పేపర్స్ తీసుకుని కావ్య వెళ్లిపోతుంటే.. కావ్యను ఆపిన రాజ్.. ఈ బాధ్యతలు చూసుకోవడానికి నువ్వే కరెక్టు.. ఆ తాళాలు నీ చేతుల్లో ఉంటేనే సేఫ్‌గా ఉంటాయి. తాతయ్య పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు నిలబెడతావనుకుంటున్నాను అని రాజ్ చెప్పి వెళ్లిపోతాడు. రుద్రాణి కోపంగా ఆలోచిస్తుంది. పక్కనే రాహుల్ తల పట్టుకుని కూర్చుని ఉంటాడు. ఎన్ని కుట్రలు, ఎన్ని మోసాలు, ఎన్ని పథకాలు అన్ని బూదిదలో పోసిన పన్నీరులా అయపోయాయిరా.. అంటుంది రుద్రాణి. అవును మమ్మీ కావ్య క్యారెక్టర్ ఇంతటితో క్లోజ్ అయిపోతుందనుకున్న ప్రతిసారి ఎంట్రీ ఇచ్చి మనకు షాక్ ఇస్తుంది అంటాడు రాహుల్.
తలుచుకుంటేనే భయమేస్తుంది అని రుద్రాణి బాధపడుతుంది. ఇంతలో స్వప్న అనుకున్నదొక్కటి అయినదొక్కటి అనే సాంగ్ ప్లే చేసుకుంటూ లోపలికి వస్తుంది. రుద్రాణి కోపంగా నేను ఉరేసుకుని చనిపోయి దానికి కారణం నువ్వేనని సూసైడ్ లెటర్ రాస్తాను అని బెదిరించాలని చూస్తే.. నాకు అంత అదృష్టమా అంటుంది స్వప్న. దీంతో రుద్రాణి రేపటి నుంచి సొంత చెల్లెలు తోనే చేయి చాచి అడుక్కోవాల్సి వస్తుందని చెప్తుంది. అడుక్కుంటాను అని స్వప్న చెప్పగానే.. అయితే దాన్నుంచి ఆస్తి ఎలా లాక్కోవాలో నాకు తెలుసు అని చెప్తుంది రుద్రాణి. ఆస్థి మీరు లాక్కోవడం కోసం ఖర్చుల కోసం మా కావ్య కాళ్లు పట్టుకునేటట్టు చేస్తాను అంటుంది స్వప్న.
ధాన్యలక్ష్మీ లాయర్‌కు ఫోన్ చేసి ఆస్థి విషయంలో తన కొడుక్కి అన్యాయం జరిగిందని ఫోన్‌లో మాట్లాడుతుంది. ఇంతలో ప్రకాష్ వచ్చి ధాన్యలక్ష్మీని తిడతాడు. నీకు ఏ హక్కు ఉందని కేసు వేస్తున్నావు అని అడగ్గానే కళ్యాణ్ చేత వేయిస్తాను అని చెప్తుంది. వాడెలా వేస్తాడని.. ముందు వాడి మనసు ఎలా గెలుచుకోవాలో అది ఆలోచించు అని తిట్టి వెళ్లిపోతాడు ప్రకాష్. అందరూ హాల్లో కూర్చుని ఉంటే కనకం వస్తుంది. కనకాన్ని ఘోరంగా అవమానిస్తుంది రుద్రాణి. దీంతో రుద్రాణిని అందరూ తిడతారు. కనకం మాత్రం ఇందిరాదేవిని ఓదారుస్తుంది.
ఈ సమయంలోనే ధైర్యంగా ఉండాలని చెప్తుంది. ఇంతలో రుద్రాణి పలకరించడానికి వచ్చావో లేక పగ్గాలు నీ కూతురి చేతిలోనే ఉన్నాయి కదా అని ఏదైనా ఆస్థి రాయించుకోవడానికి వచ్చావో అని కనకాన్ని తిడుతుంది. దీంతో కావ్య, స్వప్న రుద్రాణిని తిడతారు. మధ్యలో అడ్డు వచ్చిన ధాన్యలక్ష్మీ అందరినీ తిట్టి వెళ్లిపోతుంది. నీ కూతురితో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయించి ఆస్థి మొత్తం కొట్టేశారు అంటుంది రుద్రాణి. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?