BigTV English

Satyabhama Today Episode : సత్య కోసం టెన్షన్ పడుతున్న విశ్వనాథం.. సత్యకు నిద్రలేకుండా చేస్తున్న క్రిష్..

Satyabhama Today Episode : సత్య కోసం టెన్షన్ పడుతున్న విశ్వనాథం.. సత్యకు నిద్రలేకుండా చేస్తున్న క్రిష్..

Satyabhama Today Episode December 18 th : నిన్నటి ఎపిసోడ్ లో.. సత్య కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. విశ్వనాథం అక్కడికి వచ్చి ఎందుకమ్మా నీకి తండ్రి అంటే అంత ఇష్టం అనేసి అంటాడు. దానికి సత్య తండ్రి అంటే ఇష్టం కాదు నాన్న ప్రాణం. మీరు ఇంటిని దూరం చేసుకోలేక ఎంత నరకాన్ని అనుభవించారు నేను అర్థం చేసుకోగలను నాన్న. మీ గుండె ముక్కలు అయిపోయిందని నాకు అర్థమైంది అందుకే నేను మీకు తోడుగా ఉన్నాను ఎవరేమన్నా కూడా నేను మీ వెనకాలే ఉంటాను అనేసి అంటుంది. ఇక విశ్వనాథం నా ఇంటికి కష్టాలు వస్తున్నాయి ఏంటి అది మీ మామయ్య వల్లే అని నేను అర్థం చేసుకోగలను అమ్మ. నిజం చెప్పలేక నువ్వు ఏదో దాస్తున్నావు నాకు అర్థం అయిపోయింది. నువ్వు పులితో సవారీ చేస్తున్నామన్న విషయం అర్థం చేసుకో కొంచెం జాగ్రత్తగా ఉండు అనేసి విశ్వనాథం సత్యకు సలహా ఇస్తాడు.. అత్తింటికి సత్య వెళ్తుంది. వచ్చి రాకముందే భైరవి తన మాట నెగ్గలేదని చిందులు వేస్తుంది. భైరవి కోపంతో రగిలిపోతూ సత్యను మాటలతో బాధపెడుతుంది. క్రిష్ గానే అడ్డుపెట్టుకొని బెదిరించడం ఏంది అనేసి భైరవి అడుగుతుంది.ఇంకోసారి నా జోలికొస్తే నీకు ఇక ఏం చేస్తాను అది చేస్తాను ఆఖరికి నువ్వు అడ్రస్ లేకుండా పోతావు అనేసి సత్యకు వార్నింగ్ ఇస్తాడు. కానీ సత్య మాత్రం అస్సలు తగ్గకుండా మహదేవయ్యను ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.. నువ్వు నన్ను ఏం చేయలేవు ఇప్పుడు మహదేవయ్య గానే నీకు తెలుసు రేపు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక రాజకీయ నాయకుడిగా నన్ను చూస్తావు అనగానే నువ్వు ఏ రాజకీయాన్ని అయితే చూసుకుంటున్నావో అదే రాజకీయాన్ని నీకు దూరం చేస్తాను అనేసి సత్య ఛాలెంజ్ చేస్తుంది. ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను నీపై గెలుస్తాను అనేసి సత్య మహదేవయ్యకు వార్నింగ్ ఇస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.


ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మహదేవయ్య మీద సత్య ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చాలెంజ్ చేస్తుంది.. ఇక మహదేవయ్య టెన్షన్ పడుతూ ఉంటాడు. సత్య వాళ్ళింట్లో అన్ని సమస్యలు తీరిపోయాయని సంతోషంగా ఉంటారు. నందిని వాళ్ళ నాన్న చేసిన పనికి అందరూ నందిని పొగిడేస్తుంటారు. సమస్యలు ఏదో భయంకరంగా వచ్చాయి ఎవరో తీసేసినట్టు వెంటనే వెళ్లిపోయాయని సంధ్య బామ్మ అందరూ సంతోషంగా ఉంటారు. కానీ విశ్వనాథం మాత్రం దిగులుగా ఉంటాడు. ఇక హర్ష సంవత్సరం నుంచి నన్ను పిక్కు తింటున్నావ్? మీ బాబు కూడా నీలాగే కదా అనేసి సరదాగా అంటాడు. విశ్వనాథం మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటాడు.. అది గమనించిన విశాలాక్షి విశ్వనాథం దగ్గరికి వెళ్లి ఏమైందండీ మీకు సంతోషంగా లేదా అనేసి అడుగుతుంది. మనకు కష్టాలు తెచ్చి పెట్టిన మహాదేవయ్యే ఇప్పుడు కష్టాలు తీర్చారంటే నువ్వు నమ్ముతున్నావా విశాలాక్షి అని విశ్వనాథం అడుగుతాడు. నేను నమ్మలేకున్నా కానీ అలా చేశాడంటే ఎక్కడో ఏదో జరుగుతుందని అర్థమవుతుందని అనేసి విశాలాక్షి టెన్షన్ పడుతుంది. మామయ్య వచ్చి ఇంత గొప్ప పని చేస్తే సత్య ఎందుకు సంతోషించకుండా ఉంటుంది ఎందుకు టెన్షన్ పడుతూ కనిపిస్తుంది నువ్వు ఆలోచించవా అని విశ్వనాథం అడుగుతాడు. అవును నిజమే అండి అయితే ఇప్పుడు సత్య వాళ్ళ మామయ్య వల్ల ఇబ్బందుల్లో పడుతుందా అనేసి అడుగుతుంది. అది నేను చెప్పలేని విషయాలు కానీ సత్యం మాత్రం ఇబ్బందుల్లో ఉందని అర్థం అవుతుంది. చిన్నప్పటినుంచి సత్య మనకు ఏది చెప్పకుండా చేసేది ఇప్పుడు తన మీదకొచ్చిన ఇబ్బందిని కూడా తన చెప్పలేకపోతుందనేసి బాధపడతారు.

మావయ్య చెప్పింది నిజమే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ముందు క్రిష్ కి ఈ విషయం చెప్పాలని సత్య ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే క్రిష్ వచ్చి సత్యను పట్టుకుంటాడు. సత్య ఉలిక్కిపడుతుంది. ఇక ఇద్దరూ కాసేపు గుద్దులాడుకుంటారు.. సమస్యలను తీరిపోయాయి కదా ఇక నువ్వు ఆలోచించాల్సిన పనిలేదు ఇక మన గురించి నువ్వు ఆలోచించాల్సిందే అనే సత్యకు హితబోధ చేస్తారు.. తాతయ్య ఏం చెప్పాడు అనేసి ఒక రొమాంటిక్ స్టోరీని అల్లుతాడు. ఇక సత్య నేను ఎమ్మెల్యే అవ్వాలని అనుకుంటున్నాను అని సరదాగా చెప్తుంది. క్రిష్ లేడు అదంతా కలలోనే కదా కలలో అయితే నా భార్య ఎమ్మెల్యే అవుతుందంటే నేను మస్తు హుషారు అవుతాను అనేసి అంటాడు. ఇక ఇదంతా కాదు మా తాత చెప్పిన పని చేయాల్సిందే అనేసి ఇద్దరు రొమాన్స్ చేసుకుంటారు. ఆ రాత్రి గడిచిపోతుంది.


ఉదయం లేవగానే క్రిష్ పుట్టినరోజు కోసం సత్య అంత సిద్ధం చేస్తుంది.. ఇక కృష్ణను లేపాలని బెడ్ రూమ్ కి వెళ్తుంది. అది గమనించిన క్రిష్ సత్య ను లాక్కుంటాడు. రాత్రంతా ఇదే పని పొద్దున కూడా ఇదే పనా ఇక లేస్తారా బుజ్జి బాబు అనేసి సత్య కాస్త రొమాంటిక్గా మాట్లాడుతుంది. మా చంటి అబ్బాయ్ పుట్టినరోజు కాబట్టి ఇక లేపుదామని వచ్చాను లేవండి బాబు అనేసి బతిమలాడుతుంది. రోజైతే రాత్రి శుభాకాంక్షలు చెప్తారు నీలాగా కోడి కూసిన తర్వాత తెల్లారిన తర్వాత ఎవరు చెప్పరు అని అడుగుతాడు. దానికి సత్య అత్రంతా నన్ను నిద్ర పోనిస్తే కదా మీకు చెప్పడానికి అనంటే, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి నీకు టైం లేదా అనేసి అడుగుతాడు. చెప్పేంత ఆలోచన నాకు ఇస్తున్నారా చెప్పనిస్తున్నారా అనేసి సత్య తిరిగి కౌంటర్లు వేస్తుంది. అలా ఇద్దరు రాత్రి జరిగిన ముచ్చట్ల గురించి మరోసారి ముచ్చట పెట్టుకొని సరదాగా గడుపుతారు.

ఈరోజు మీ పుట్టినరోజు కాబట్టి హ్యాపీ బర్త్డే క్రిష్ అని సత్య విషెస్ చెబుతుంది. నువ్వు త్వరగా లేచి వస్తే నీకు నలుగు పెట్టి స్నానం చేయించి రెడీ చేయించాలి అనేసి సత్య అంటుంది. దానికి క్రిష్ ఈరోజు నా జుట్టు పట్టుకొని నా భర్త పట్టాలని సత్య ఫిక్స్ అయినట్టుంది నేను అస్సలు దొరకకూడదని అనుకుంటాడు. అనుకున్నట్లే సత్య నలుగుకి అంత సిద్ధం చేస్తుంది. లోపలి నుంచి సత్యకు దొరక్కుండా బయటకు వచ్చేస్తాడు. బయట సెటప్ ని చూసి ఆల్రెడీ సెట్ అప్ చేసి పెట్టావా అనేసి షాక్ అవుతాడు. ఎలాగైనా దొరక్కకూడదని దాక్కుంటాడు. అది గమనించిన సత్య తన మాటలతో కవ్వించి మురిపించి బయటికి రప్పిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Big Stories

×