BigTV English

Ex Minister Sailajanath: చక్రం తిప్పిన జగన్.. వైసీపీలోకి శైలజానాథ్..?

Ex Minister Sailajanath: చక్రం తిప్పిన జగన్.. వైసీపీలోకి శైలజానాథ్..?

ఉమ్మడి అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. ఇక్కడ ఎవరు గెలిస్తే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందని సెంటిమెంట్ ఉండేది. గత 30 ఏళ్లుగా అదే సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతూ వస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా శైలజనాథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత టిడిపి నుంచి శమంతకమణి, ఆమె కుమార్తె యామిని బాల మంత్రులుగా , ఎంఎల్ఏ లుగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2019 లో వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా గెలిచి 2024 ఎన్నికల్లో టికెట్ కూడా సాధించుకోలేకపోయారు.

టిడిపి నుంచి అప్పటికే ఒకసారి ఓడిపోయిన శ్రావణి 2024 ఎన్నికల్లో మంచి మెజార్టీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ తరపున జొన్నలగడ్డ పద్మావతి ప్లేస్ లో వీరంజానేయులు అనే టిప్పర్ డ్రైవర్‌ని పోటీలోకి దింపామని గొప్పగా చెప్పుకొంది వైసీపీ.. అసెంబ్లీ సమన్వయకర్తగా వీరాంజనేయులు నియమించింది వైసీపీ అధిష్టానం. కానీ పైకి మాత్రమే వీరాంజనేయులు పెట్టి.. పెత్తనం అంతా మాజీ మంత్రి జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివరెడ్డి ది కొనసాగేదని వైసీపీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఇక సీన్ కట్ చేస్తే ఎన్నికల్లో ఓటమి తర్వాత సాంబశివ రెడ్డి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఇంతవరకు కనీసం ఒక్క ప్రెస్ మీట్ కానీ లేదా ఒక్క సారి కూడా బయటకు రాకుండా పూర్తిగా వైసీపీ కి దూరంగా ఉంటున్నారు.


ఇక ఈ సెంటిమెంట్ సెగ్మెంట్ లో మార్పులకు వైసిపి సిద్ధమౌతోంది అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. వీరాంజనేయులు ఇన్చార్జి గా కొనసాగుతున్నా ఆయనకు పెద్దగా అక్కడ సపోర్ట్ లేకపోవడంతో ఉన్నా లేనట్టే అని వైసిపి అధిష్టానం భావిస్తూండడంతో ఇక వేరే వ్యక్తి కోసం వైసీపీ వెతుకులాట ప్రారంభించిందంట. అదిలా ఉంటే మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలోకి మారే అవకాశం ఉందని, ముఖ్యంగా అనంతపురం జిల్లా సింగనమలలో జరుగుతున్న మార్పులతో శైలజానాథ్ వైసీపీలోకి మారే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది.

Also Read: ఫ్యామిలీలో చిచ్చు మొదలైందా? జగన్ రుసరుసలు

గత ఎన్నికల్లో సింగనమల నాయకురాలిగా శ్రావణి గెలుపొందారు. 2019లో పద్మావతి అదే స్థానంలో గెలిచారు. పద్మావతిపై పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థిని టీడీపీ వెతుక్కునే క్రమంలో శైలజానాథ్ టీడీపీలో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. శైలజానాథ్‌ను టీడీపీలో చేర్చుకుని ఎన్నికల్లో పోటీ చేసేలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయంటారు. అయితే చంద్రబాబు చివరికి శ్రావణిని ఎంపిక చేశారు. వైసీపీ లో జొన్నలగడ్డ పద్మావతికి బదులు వీరాంజనేయులు అనే టిప్పర్ ట్రక్ డ్రైవర్‌ను పోటీకి పెట్టారు. కానీ అతను ఎన్నికల్లో ఓడిపోయారు.

ఇప్పుడు సింగనమలలో వైసీపీకి కొత్త నాయకుడు కావాలి కాబట్టి జగన్ కూడా శైలజానాథ్‌ పేరును పరిశీలిస్తున్నారంట. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించిన కారణంగానే సాకే శైలజానాథ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలిసారిగా 2004లో ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న ఆయన మొదటి సారి పోటీ చేసి గెలిచారు. 2009లో మళ్లీ గెలుపొందారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. విభజన తర్వాత నుంచి కూడా శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీతోనే అంటకాగుతున్నారు. ఆ క్రమంలో జగన్ ఆహ్వానం మేరకు శైలజానాథ్ త్వరలో వైసీపీలో చేరే అవకాశం ఉందంటున్నారు.

వైసీపీలో చేరిక పై శైలజానాథ్ కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. శైలజానాథ్ తన కుమారుడు కి కూడ మరో స్థానం అడుగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆమె భర్త ఆలూరు సాంబశివ రెడ్డి ఇరువురూ తమ వ్యాపారాలకు పరిమితం అవ్వడంతో వారు వైసీపీ కి దూరమైనట్లే అంటున్నారు. ఇక ఈ సారి నియోజకవర్గాలు పెంచే అవకాశం ఉండడంతో శైలజానాథ్ తన కుమారుడు రిత్విక్ కి ఒకస్థానం అడుగుతున్నారు అని టాక్ వినపడుతుంది. అందుకు తగ్గట్టు శైలజానాథ్ కుమారుడు కూడ వివిధ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ సారి శైలజానాథ్ తన కుమారుడిని కూడా ఎన్నికల రంగంలోకి దింపాలని ఫిక్స్ అయ్యారంట. చూడాలి మరి సెంటిమెంట్ సెగ్మెంట్ లో ఏం జరుగుతుందో.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×