BigTV English

Satyabhama Today Episode : మహాదేవయ్యను అడ్డంగా ఇరికించిన సత్య.. క్రిష్ కోపాన్ని చూసి అందరు షాక్..

Satyabhama Today Episode : మహాదేవయ్యను అడ్డంగా ఇరికించిన సత్య.. క్రిష్ కోపాన్ని చూసి అందరు షాక్..

Satyabhama Today Episode December 2nd : నిన్నటి ఎపిసోడ్ లో..  గంగను ఇంట్లో నుంచి పంపించాలని ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు.భైరవి ఆ గంగాకి ఎంతో కొంత ఇచ్చేసి పంపించేయ్ నాకు టెన్షన్ అవుతుంది అనేసి మహాదేవయ్యను అడుగుతుంది. ఆస్తిస్తే పోతుందా అనేసి సత్య అడుగుతుంది. ఇదంతా కాదు టెస్ట్ చేయిస్తే సరిపోతుంది అని సత్య అందరిని నమ్మిస్తుంది. ఇక అప్పుడే గంగా ఎంట్రీ ఇస్తుంది. చిన్న నేను పోను అంటూ డైలాగ్ తో అందరికీ షాక్ ఇస్తుంది. ఆయనకి నేను రెండో భార్యని అంటే నాకు కూడా ఇంట్లో హక్కుంది అక్కకి ఎంత హక్కుందో నాకు అంతే అక్కుంది అనేసి నాకు ఇంట్లో సగం వాటా కావాలి అని అడుగుతుంది. లేదంటే డిఎన్ఎ టెస్ట్ చేయించుకుని అసలు నిజమేంటో బయటపడాలి అనేసి డిమాండ్ చేస్తుంది. ఇంకొక ప్లాన్ ఉంది అనగానే సత్య ఏంటి అని అడుగుతుంది. నువ్వు క్రిష్ నాతోటి వచ్చేసేయండి మన ఇంట్లో ఉందామనేసి అడుగుతుంది. దానికి క్రిష్ సచ్చినా నేను పోను అని అంటాడు. మరి రేపు డిఎన్ఎ టెస్ట్ చేయించుకోవడానికి నేను రెడీ ఆ టెస్ట్ లో నేను కాదని తెలిస్తే ప్రాణత్యాగం కూడా చేస్తానని గంగా సవాల్ చేసి వెళ్తుంది. ఇక భైరవి జయమ్మ టెన్షన్ పడుతుంటారు. మహదేవయ్య దానికి నాకు ఎటువంటి సంబంధం లేదని గట్టిగా చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. మైత్రిని ఇక పట్టించుకోను అని నందినితో చెప్పడంతో వాళ్ళ మధ్య దూరం మాయం అయ్యింది. మహదేవయ్య ఇంటికి డాక్టర్స్ వస్తారు.  మహదేవయ్యకు చెమటలు పట్టిస్తుంది. గంగా డిఎన్ఎ టెస్ట్ కి రెడీ అని చెప్తుంది. టెస్ట్ కి శాంపిల్స్ ఇస్తారు కానీ మహదేవయ్యా ఆలోచిస్తూ ఉంటాడు సత్య మహదేవయ్యకు ఇదే లాస్ట్ అవకాశం మీరు కన్న తండ్రి కాదని ఒప్పేసుకోండి లేదంటే మాత్రం అడ్డంగా ఇరుక్కుంటారు అనేసి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్య మహాదేవయ్యకు తన మాటలతో చెమటలు పట్టిస్తుంది. ఇక ఇప్పటికైనా మీరు తప్పించుకోలేరు. మీకు ఒక అవకాశం ఇచ్చాను కానీ మీరు వాడుకోలేదు. ఇక నిజం తెలియక మానదు. పాతికెళ్ళు నుంచి మీరు బయట పెట్టలేని నిజం రేపటితో బయటకు వచ్చేస్తుంది. మీకు ఒక అవకాశం ఇచ్చాను కానీ మీరు వాడుకోలేదు. ఇన్ని రోజులు మీరు ఏదైతే దాచారో ఆ నిజం రేపటితో విస్పోటనంలా బయటపడుతుంది అనేసి సత్య మహదేవయ్యకు చుక్కలు చూపిస్తుంది. గుండె మీద పచ్చబొట్టు పొడిపించుకునేంత మాత్రాన అది నిజమైన ప్రేమ కాదు ఆ గుండెల మీద రేపు క్రిష్ మిమ్మల్ని కత్తితో పొడవు పోతున్నాడు ఆ విషయం గుర్తు పెట్టుకోండి మహదేవయ్య గారు అనేసి వెళ్ళిపోతుంది. ఇక సంధ్య ఈరోజు బయటికి రావద్దు అని అనుకుంటుంటే నాన్న ఇలా ఇరికించేసాడు ఏంటి? అన్నయ్య చెప్పకుండా అంటే నేను అసలు వెళ్ళలేదనే కాదు ఇప్పుడు ఆ సంజయ్ ని కలవకుండా ఉంటే చాలు అనేసి అనుకుంటుంది. సంధ్యా మెడికల్ షాప్ కి వెళ్లే లోగా సంజయ్ ఎక్కడ ఉంటాడు. మీరేంటి ఇక్కడ అంటే ఈ మెడికల్ షాప్ అతను మా ఫ్రెండే కలుద్దామను వచ్చాను కానీ వాడు లేడు అనేసి అంటాడు. ఒక్కసారి కలిస్తే వీధి మరి ఎన్నిసార్లు కలుస్తూనే ఉన్నామంటే మీరే ఆలోచించాలి అని సంజయ్ అంటాడు..

ఇక నిజమే అని ఆలోచిస్తున్నారు.. మీ గురించి నేను తెలుసుకోవాలంటే ముందు మనం ఫ్రెండ్స్ అయిపోవాలి లెట్ మీ ఫ్రెండ్స్ అనేసి సంజయ్ పులిహోర కలుపుతాడు. మనం ఫ్రెండ్ కాబట్టి ఫోన్ నెంబర్ నా దగ్గర ఉండాలి అని ఫోన్ తీసుకుంటాడు. ఆ తర్వాత కావాలనే ఫోన్ ను కింద పడేస్తాడు. ఇక మన ఫ్రెండ్ షిప్ స్టార్టింగ్ రోజే ఫోన్ పోవడం నాకు నచ్చలేదు. ఇప్పుడే వస్తాను అని వెళ్లి ఐఫోన్ తెచ్చి ఇస్తాడు.. దానికి సంధ్య మొదట వద్దని అంటుంది. ఆ తర్వాత ఫోన్ ను ఎలా దాయ్యాలి అని ఆలోచిస్తుంది. ఇక సంజయ్ మాత్రం నెక్స్ట్ స్టేజ్ కు తీసుకొని వెళ్తాను అని ఆలోచిస్తాడు. ఇక భైరవి మహాదేవయ్య అనుకోని మహాదేవయ్య గెటప్ లో కూర్చున్న బంటిని చూసి షాక్ అవుతుంది. కేకలు వేస్తుంది.. ఇంట్లోంచి అందరు వస్తారు. బంటిని చూసి షాక్ అవుతారు. మహాదేవయ్య చొక్కాను వేసుకుంటావా అని కోపంతో బంటిని తన్నుతాడు. ఎవరు ఆపమని చెప్పినా కూడా వినకుండా కొడతాడు. డ్రెస్ తీసేయ్యమని గన్ పెడతాడు. దాన్ని తీసేసి క్రిష్ కు ఇస్తాడు. వాటిని తీసుకెళ్లి కాల్చేస్తాడు క్రిష్.. అది చూసి మహాదేవయ్య సంబరపడిపోతాడు. దానికి గంగ మహాదేవయ్యకు కౌంటర్ ఇస్తుంది.


ఇన్నాళ్లకు తనకి నాన్న దొరికాడు ఆ సంబరంలోనే నాన్న బట్టలేసుకున్నాడు నాన్న కూర్చొన్నాడు అంత తప్పేంటి అనేసి కృష్ణ మహదేవయ్యను నిలదీస్తుంది గంగ.. ఎవరికి మొగుడు అనేసి అంటుంది. నా కొడుకు తప్పు చేశాడని బట్టలు ఇప్పించావు రేపు మీ నాన్నకు తప్పు చేశాడని బయటపడితే ఏం చేస్తావో చెప్పు అనేసి గంగ క్రిష్ నిలదీస్తుంది. ఇక వాళ్ళని వెళ్లిపొమ్మని క్రిష్ బయటికి గెంటేస్తాడు. నిన్ను అలా పెంచారు మూర్ఖుడిలాగా పెంచారు అనేసి క్రిష్ ను, ఇంట్లో వాళ్ళను తిడుతుంది గంగ.. ఇక క్రిష్ ను సత్య వద్దని చెప్తుంది. రోడ్డుమీద పడితే మళ్లీ ధర్నా చేస్తుంది మీడియా వాళ్ళు వస్తారు ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా అనేసి క్రిష్ భయపెడుతుంది సత్య.. గంగా అరుస్తుంది మహదేవయ్య మాట్లాడకుండా మౌనంగా ఇంట్లోకి వెళ్లిపోతాడు.. రేపు రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అనగానే అందరూ ఇంట్లోకి వెళ్లిపోతారు. ఇంట్లోకి వెళ్లిన మహదేవయ్యా గంగ చెప్పిన మాటలు విని భయపడుతూ ఉంటాడు. అప్పుడే క్రిష్ లోపలికి వస్తాడు. నా మీద నమ్మకలేదా అని అడుగుతుంది. నీ మీద నమ్మకం పోగొట్టుకుంటే నా మీద నేను నమ్మకం పోగొట్టుకున్నట్టే రా.. ఇక అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×