Gundeninda GudiGantalu Today episode December 2nd : నిన్నటి ఎపిసోడ్ లో.. డ్రైవర్ పని అని చెప్పి బాలు క్లినర్ గా పనిచెయ్యడం మీనాకు బాధగా అనిపించింది. అసలు నిజంగానే బాలు ఆ పని చేస్తున్నాడా అని అక్కడికి వెళ్లిన మీనాకు బాలును దొంగ అనడం చూసి షాక్ అవుతుంది. బాధ పడుతూ ఇంటికి వస్తుంది. రవిని ఇంటికి తీసుకురాకపోతే శృతి వాళ్ళ నాన్న రవిని ఇల్లారికం తీసుకెళ్లే ప్రమాదముందనీ, ఆ తర్వాత ఎలాంటి ప్లాన్ చేసిన వర్కౌట్ కాదని చెబుతోంది మీనాక్షి.. రవి, శృతి తమ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు. హనీమూన్ కు వెళ్దామని శృతి అడగటంతో వద్దంటూ రవి సర్ది చెప్తాడు.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శృతి హనీమూన్ గురించి రవితో మరోసారి డిస్కస్ చేస్తుంది. కానీ రవి మాత్రం ఇప్పటికే ఇరు ఫ్యామిలీలకు దూరంగా ఉంటున్నామని, ఇప్పుడు అవసరం లేదని చెప్తాడు. ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పటికే తప్పు చేసామని, ఇక ముందు అలాంటి తప్పులు చెయ్యొద్దని, కనీసం ఇరు ఫ్యామిలీలో ఒప్పుకున్న తర్వాతే శోభనం చేసుకుందామని చెబుతాడు. దీంతో శృతి డిసప్పాయింట్ అవుతుంది. తన ముందు ఫ్యామిలీ గురించి మాట్లాడవద్దని, తాను కూడా ఫ్యామిలీని విడిచి వచ్చానని, స్వార్థంగా ఆలోచిస్తున్నారని అనుకున్న పర్వాలేదని అంటుంది. మనకు ఇక ఏమి ఉండవు అని శృతి ఫీల్ అవుతుంది. పోయి ఒక మొద్దును చేసుకున్నానే అని ఏడుస్తుంది..
ఇక రోహిణి, మనోజ్ మధ్య జాబ్ డిస్కషన్ జరుగుతుంది. లేని జాబ్ గురించి మనోజ్ గొప్పలు చెప్పుకుంటాడు. తాను ఈ నెల 15 కార్లు అమ్మాననీ, తనకు ఏసీ క్యాబిన్ ,పడకడానికి బ్రెడ్ ఇచ్చారని, ఆఫీసులో తనకు తానే బాస్ అంటూ గొప్పలు చెప్పుకుంటాడు.అయితే.. జీతం పెంచమని అడగడని చెబుతోంది రోహిణీ. దీంతో ఇరకాటంలో పడుతాడు మనోజ్.. కిందకు రాగానే సత్యం జాబ్ లో ఏవైనా టెన్షన్స్ ఉన్నాయా? అయితే వేరేది చేసుకోరా అని సలహా ఇస్తాడు. కానీ రోహిణి మాత్రం ఏమీ టెన్షన్స్ లేవు మామయ్య తను బాగా చేస్తున్నాడని గొప్పగా చెబుతుంది. రోహిణికి తోడు ప్రభావతి కూడా గొప్పలు చెబుతుంది. ఈ క్రమంలో ఆఫీస్ లో మనోజ్ ఎలా ఉంటాడు అని చెప్తారు. ఈరోజే ఆ లోన్ గురించి మాట్లాడమని మనోజ్ కు చెబుతుంది. ప్రభావతి .. మనోజ్ ను ఇరికించే ప్రయత్నం చేస్తుంది. మనోజ్ ఆఫీస్ లో లోన్ అడగడానికి మొహమాట పడుతున్నాడని, నువ్వే వెళ్లి వాళ్ళ ఆఫీస్ లో లోన్ గురించి అడగమని చెబుతుంది. ఏం అవసరం లేదు.. తానే లోన్ గురించి అడుగుతానని మనోజ్ చెప్తాడు. అంతలోనే ఆటో రావడంతో తనకు టైం అవుతుందని రోహిణి షాప్ కు వెళ్తుంది. ప్రభావతి తాను కూడా పార్లర్ కు వస్తానని, షాప్ చూడక చాలా రోజులవుతుందని చెబుతుంది.. ఇక రోహిణి నేను వేరే క్లయింట్ ను కలవడానికి వెళ్తున్న అని చెప్పి వెళ్తుంది.
తర్వాత మనోజ్ జాబ్ కోసం వెళ్తున్నానని బయటకు వస్తాడు. ఏదైనా ఒక జాబ్ చూసుకోమని, బాజ్ లేదనే విషయం బాలుకు తెలిస్తే.. ఇల్లు పీకి పందిరి వేస్తాడని, ఇద్దరిని ఇంట్లో నుంచి వెళ్ల గొడుతాడని వార్నింగ్ ఇస్తుంది. ఆ విషయాన్ని సత్యం వింటాడు. వాడిని ఏదో పని చూసుకోమని అంటున్నావు ఏంటి ప్రభా వాడు జాబ్ చేయడం లేదని ప్రభావతిని అడుగుతాడు. అదేం లేదు ఈరోజు సెలవు అంటున్నాడు వేరే పని చేసేకుని రమ్మని చెబుతున్నానని అంటుంది.. కానీ అమే మాటల ను సత్యం నమ్మలేక పోతాడు. మీనా వంటచేసి తాను బయటకు వెళ్తున్నానని తన మామయ్యకు చెప్పి వెళ్తుంది. మీనాక్షి ఇంటికి వస్తోంది. వచ్చి రాగానే రవి గురించి మాట్లాడి సత్యంను బాధపెడుతుంది. తాను ఇంటి దగ్గర తినకుండా వచ్చానని, బాగా ఆకలి అవుతుందని అంటుంది. దీంతో ప్రభావతి తిందాం అని పిలుస్తోంది. కానీ తిన్న తర్వాత సాంబార్ పై ప్లేటు పెట్టడంతో అందులో బల్లి పడుతుంది. మరోవైపు.. బాలుకు తెలియకుండా మీనా ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్తుంది. సేటు కలవడు.. కలిసేవరకు వెళ్లనని అక్కడే కూర్చుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. మీనాకు సేటు కార్ ఇవ్వడాని కి ఒప్పుకుంటాడా లేదా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది మీనా విషయం బాలుకు తెలుస్తుందా అనేది రేపటి ఎపిసోడ్లో చూడాలి… రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..