Sister in Law Murder| నలుగురిలో మరిదితో ఒక యవతి తరుచూ సరసాలాడేది. అందరిముందు అతడిని అపహాస్యం చేస్తూ మాట్లాడేది. దీంతో నలుగురిలో అతనికి అవమానంగా అనిపించేది. అతని తల్లి కూడా వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందేమోనని అనుమానించేది. ఈ వేధింపులు భరించలేక ఆ యువకుడు తన వదినను హత్య చేశాడు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని నరైనీ పట్టణ సమీపంలోని పడమయి గ్రామానికి చెందిన శారదా ప్రసాద్(39) అనే యువకుడి భార్య ఆశా దేవి (33)ని కొన్ని రోజుల క్రితం ఎవరో దారుణంగా హత్య చేసి చంపేశారు. శారదా ప్రసాద్ ఉద్యోగ రీత్యా ముంబైలో ఉండేవాడు. దీంతో ఆశా దేవి తన ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఇంట్లో ఉండేది. ఆమె పక్కింట్లోనే శారద ప్రసాద్ పిన్ని కూడా ఉంటోంది. ఆ పిన్ని కొడుకు సునీల్ ప్రసాద్ (32) .. ఆశా దేవికి మరిది వరుస.
సునీల్ ప్రసాద్‌కు ఇంకా పెళ్లి కాలేదు. ఇంటి వద్దే వ్యవసాయం చేసుకునేవాడు. శ్యామ్ ప్రసాద్ ఉద్యోగ రీత్యా గ్రామంలో లేకపోవడంతో అతని కుటుంబానికి సునీల్, అతని తల్లి ఏ అవసరమున్నా సాయం చేసేవారు. దీంతో సునీల్ తో తరుచూ ఆశా దేవి మాట్లాడుతూ ఉండేది. భర్త తనకు దూరంగా ఉండడంతో ఆమె సునీల్ తో అక్రమ సంబంధం పెట్టుకోవాలని చూసింది. కానీ సునీల్ ఆమెకు దూరంగా ఉండేవాడు. అయినా ఆమె ఒక రోజు సునీల్ కు తాను ప్రేమిస్తున్నట్లు చెప్పింది. కానీ సునీల్ ఆమె మాటలను పట్టించుకోలేదు.
Also Read: దేశముదుర్లు.. 5 స్టార్ హోటళ్లలో పట్టపగలు దోపిడి.. టికెట్ లేకుండా విమాన ప్రయాణం
దీంతో ఆశాదేవి తరుచూ సునీల్ ని పెళ్లి చేసుకుంటానని నలుగురిలో హాస్యమాడుతూ చెప్పేది. కానీ ఆమె నిజంగానే ఇదంతా చెబుతోందని సునీల్ తెలుసుకున్నాడు. అయినా ఆమెకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో సునీల్ తల్లి ఒకరోజు ఒంటరిగా ఉండడంతో అశా దేవి వెళ్లి ఆమెను పలకరించింది. తాను సునీల్ ను పెళ్లి చేసుకునేందుకు అనుమతి అడిగింది. ఎందుకంటే ఆశాదేవికి పుట్టిన మగబిడ్డకు సునీల్ తండ్రి అని ఆమె చెప్పింది. ఇది విని సునీల్ తల్లి ఎంతో ఆందోళన చెందింది. ఈ విషయం శ్యామ్ ప్రసాద్ కు తెలిస్తే తమ పరువు పోతుందని సునీల్, ఆశా దేవిని మందలించింది. ఇంట్లో తన కొడుకు సునీల్ ని అతడి తల్లి బాగా కొట్టింది. వదినతో సంబంధమేంటని ఆగ్రహం చెందింది.
దీంతో సునీల్ తన వదిన పెట్టే చిత్రహింసలు భరించలేక. నెల రోజుల క్రితం గోడపై నుంచి దూకి ఆశాదేవి ఇంట్లోకి దొంగతనం ప్రవేశించాడు. ఆ సమయంలో ఆశాదేవి తన ఇద్దరు పిల్లలో తన గదిలో నిద్రపోతోంది. ఇంటి లోపలికి సునీల్ వెళ్లగానే ఒక బలమైన కర్రతో తన వదిన ఆశా దేవి తలపై కొట్టాడు. ఆమె స్పృహ కోల్పోయిన తరువాత ఆశాదేవిని పశువుల పాకల వద్దకు తీసుకెళ్లి.. అక్కడ ఒక పెద్ద ఇటుకతో ఆశాదేవి తలపై పదే పదే కొట్టాడు.
ఆమెను హత్య చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తన చొక్కా కు ఆశాదేవి రక్తం అంటుకోవడంతో ఆ చొక్కాని కాల్చేశాడు. ఆ తరువాత ప్రశాంతంగా తన ఇంటి మిద్దె పైకి వెళ్లి నిద్రపోయాడు. ఆశాదేవి హత్యకేసులో పోలీసులు ఇదంతా ఎవరో దొంగలు చేశారని భావించారు. ఆశా దేవి భర్త ముంబై నుంచి తిరిగి వచ్చి తన ఇంట్లో ఏమీ దొంగతనం కాలేదని తెలిపాడు. చివరికి గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం.. ఆశాదేవి ఎక్కువగా సునీల్ తోనే సమయం గడిపేది. అందుకే పోలీసులకు సునీల్ పై అనుమానం వచ్చింది.
సునీల్ ను అదుపులోకి తీసుకొని గట్టిగా ప్రశ్నించగా.. అతను జరిగిన విషయంతా చెప్పాడు. తన వదిన నలుగురిలో తన గురించి నీచంగా మాట్లాడుతుంటే సహించలేక హత్యచేశానని సునీల్ అంగీకరించాడు.