BigTV English

Satyabhama Today Episode : మహాదేవయ్య కుటుంబంలో సంధ్యకు అవమానం.. షాక్ లో విశ్వనాథ్..

Satyabhama Today Episode : మహాదేవయ్య కుటుంబంలో సంధ్యకు అవమానం.. షాక్ లో విశ్వనాథ్..

Satyabhama Today Episode February 1st :    నిన్నటి ఎపిసోడ్లో..  సత్య విశాలక్షి ఇద్దరు టెన్షన్ పడుతుండగా విశ్వనాథం లోపలికి వస్తాడు సంధ్యను తీసుకు రమ్మని చెప్తే మీరు ఇద్దరు లోపల ఏం చేస్తున్నారు అనేసి అంటాడు. లెటర్ చదివి విశ్వనాథం టెన్షన్ పడతాడు ఇలాంటి పని చేస్తే దాన్ని నేను అస్సలు ఊహించలేదు ఇంత దారుణానికి ఎంత దిగజారింది.. ఇక ఈ విషయం పెళ్లి వాళ్ళకు తెలిస్తే ఎంత అవమానం పరువు పోతుంది అని టెన్షన్ పడతాడు అప్పుడే హర్ష నందిని లోపలికి వస్తారు. మేము వెళ్లి ఎక్కడుందో వెతికి తీసుకొస్తామని అంటారు పెళ్లి వద్దనుకొని వెళ్లిపోయిన దాని గురించి ఆలోచించడం ఎందుకురా ఈ విషయాన్ని పెళ్లి వాళ్ళకి చెప్పాలి ఏదైతే అది అయింది కూతురు గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది ఆ బాధ కన్నా ఇదేమి పెద్ద బాధ కాదు అని విశ్వనాథం అనుకుంటారు. అటు గుడిలో సంధ్య కోసం సంజయ్ వెయిట్ చేస్తూ ఉంటాడు. సత్యను ఇబ్బంది పెట్టడానికే నేను సంధ్యను లైన్ లో పెడితే ఇదేంది నాకు ఇలా తగులుకునిందని ఆలోచిస్తూ ఉంటాడు.. అప్పుడే సంధ్య అక్కడికొస్తుంది. ఇంటికి పంపించాలని ప్రయత్నం చేస్తాడు. కానీ సంధ్య మాత్రం మన పెళ్లి ఇప్పుడే జరిగిపోవాలి లేదంటే చెప్పు నా చావును చూస్తావు ఇంకా ఎప్పటికీ నేను నీకు కనిపించను అనేసి బెదిరిస్తుంది. క్రిష్ అక్కడికి వస్తాడు.. సంజయ్ మగాడు వాడిని ఎవరు ఏమన్నారు నువ్వు ఆడపిల్లవి అది ఆలోచించవలసిన సంధ్య నీకు ఇంట్లో పెళ్లిచూపులు జరుగుతున్నాయి నీకు నచ్చకపోతే వద్దని చెప్పు ఇలా లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకోవడం చాలా తప్పు ఇంట్లో వాళ్ళు నువ్వు ఎంత బాధ పెడుతున్నావో ఆలోచించవా అనేసి క్రిష్ పెద్ద క్లాస్ పీకుతాడు. కానీ దానికి మాత్రం సంధ్య నాకు సంజయ్ అంటే ఇష్టం ఇంట్లో వాళ్ళు మా పెళ్లికి ఒప్పుకోవడం లేదు అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. మీరు మా పెళ్లి పెద్దగా మాకు పెళ్లి చేస్తారని ఆశిస్తున్నాను అని సంధ్య బాధపడుతుంది. ఇక కరిగిపోయిన క్రిష్ వాళ్ళిద్దరు పెళ్లిని దగ్గరుండి చేయాలని నిర్ణయించుకుంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పెళ్లిచూపులు వాళ్ళు కూతురు లేచిపోయిందని అవమానించి వెళ్ళిపోతారు. ఆ మాటలు తలుచుకొని విశ్వనాథం బాధపడతాడు.. ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతుంటే సంధి మాత్రం అక్కడ సంజయ్ నీ పెళ్లి చేసుకోవడానికి పెళ్లి పీటలు ఎక్కుతుంది. మొత్తానికి సంధ్య సంజయ్ పెళ్లి చేసుకుంటారు ఇక సత్య క్రిష్ కి ఫోన్ చేసి మనం సంధ్యను వెతకాలి వస్తావా అని అడుగుతుంది. సంధ్య అన్నంత పని చేసింది సంజయ్ సంధ్య నువ్వు కలుసుకోకుండా చేయాలని సత్య అడుగుతుంది. ఎక్కడ వెతకాల్సిన పనిలేదు సంధ్యా సంజయ్ ఇద్దరు నా దగ్గరే ఉన్నారు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని సత్యకు షాక్ ఇస్తాడు క్రిష్.. నువ్వు మా ఇంటికి వచ్చేసేయ్ మీ వాళ్ళందరిని తీసుకొని అని క్రిష్ చెప్తాడు. ఇక విశ్వనాథ కుటుంబం అందరూ షాక్ అవుతారు. పెళ్లి చేసుకోవడం ఏంటి అని అందరూ మహాదేవయ్య ఇంటికి పరుగులు పెడతారు.. మహదేవయ్యా సంజయ్ సంధ్యను చూసి షాక్ అవుతాడు.. ఇక అందరూ ఏమైందని బయటికి ఉరుక్కుంటూ వస్తారు. సంధ్య సంజయ్ ఇద్దరు పెళ్లి చేసుకుని రావడంతో బైరవి షాక్ అవుతుంది..

ఏంటన్నావ్ చేసింది ఆ ఇంటి నుంచి ఒకదాన్ని భరించలేకున్నా ఇప్పుడు ఇంకొక దాన్ని తీసుకొచ్చావా నువ్వు ముందు ఆ దండం తీసి పడేసి రా అనేసి అంటుంది. భైరవి కోపాన్ని చూసి క్రిష్ ఆపలేక పోతాడు. ఇక సంధ్య దండం తీసి పడేస్తే మరి ఇదేంటి అనేసి తాలింపు చూపిస్తుంది. మంచి మర్యాద లేకుండా కుటుంబంతో ఏమి సంబంధం లేకుండా నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు అసలు నీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? ఇలా చేస్తామని అస్సలు అనుకోలేదు మీ బిగ్ డాడీ చూడు ఎలా చిన్న మొహం వేసుకుని చూస్తున్నాడు నువ్వు ఇంత తప్పు చేస్తావా అసలు నేను ఇంట్లో ఉండనీయకూడదు రమ్మని మీ నాన్నని మీ నాన్న చూసుకుంటాడు అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. అటు జయమ్ము కూడా నువ్వు చేసింది తప్పే అని చెప్పేసి తిడుతుంది. వాళ్ళ ఇష్టపడ్డారు పెళ్లి చేసుకున్నారు ఇంకేమైంది వదిలేసేయండి అని క్రిష్ మధ్యలో అడ్డుపడతాడు.. ఇక హారతి ఇవ్వమని అడిగితే ఎవ్వరు ఇవ్వరు రేణుక నివ్వమని చెప్తే నా పెళ్ళాం ఇవ్వదు ఒకవేళ అదిస్తే దాన్ని కూడా బయటకు పంపించేస్తానని రుద్రా అంటాడు.


సరే హారతి వద్దు ఏమి వద్దు మీరు కుడి కాలు పెట్టి లోపలికి రండి అనేసి క్రిష్ అంటారులు పెట్టి లోపలికి రండి అనేసి క్రిష్ అంటారు.. ఇక రేణుక మళ్లిద్దరిని లోపలికి తీసుకెళ్తుంటే సత్య ఫ్యామిలీ అక్కడికి వస్తుంది. ఈ పెళ్లిని మేము ఎవరు ఒప్పుకోమని సంధ్య చెంప పగలగొడుతుంది సత్య. మాకు ఎవరికీ ఇష్టం లేకుండా చెప్పకుండా నువ్వు ఇలా పెళ్లి చేసుకున్నావ్ అది కూడా రాక్షసుడిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నీకేం వచ్చింది అని సంధ్యను దుమ్ము దులిపేస్తుంది సత్య. ఇంకా విశాలాక్షి సమ్మెను బయటకు లాక్కెళ్ళి పద ఇంటికి వెళ్దాం అనేసి అంటుంది. కానీ సంధ్య మాత్రం నేను మేజర్ ని నా ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకుంటాను మీరు మీకు అక్కంటేనే ఇష్టం అక్క ప్రేమించిందంటే పెళ్లి చేస్తారు అదే నేను ప్రేమించానంటే అతనికి దుర్మార్గుడు నీచూడని చెప్పేసి నన్ను సద్ది చెప్పాలని ఆలోచిస్తారు నేనంటే మీకు ఎందుకు అంత పడదు అని అడుగుతుంది. సంధ్య చేసిన పనికి ఇంట్లో వాళ్ళందరూ సంధ్య నువ్వు తిడతారు. ఇక నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు అని అందరూ అంటారు. విశ్వనాథం కూడా సంధ్యకు ఎంత నచ్చ చెప్పాలని చూసినా కూడా సంధ్య వినదు. అప్పుడే పోలీసులు మహదేవ ఇంటికి వస్తారు. భైరవి మీరు మీరెందుకు వచ్చారు ఎస్ఐ గారు అని అడుగుతుంది. నేనే కంప్లైంట్ ఇచ్చాను అత్తయ్య నేను మేజర్ ని మా అమ్మ నాన్నలనుంచి నన్ను కాపాడందని కంప్లైంట్ ఇచ్చాను. నేను ప్రేమించిన వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నాను కానీ వీళ్ళు నన్ను బలవంతంగా తీసుకెళ్లాలని చూస్తున్నారని పోలీసులు ముందు సంధ్య అంటుంది. సంధ్య చేసిన పనికి విశ్వనాథ కుటుంబం షాక్ అవుతుంది.. ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×