Philadelphia Plane Crash: అమెరికాలో మరో ఘోర విమాన ప్రమాదం జరిగింది. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో చిన్న విమానం నివాసాలపై కూలింది. కూలిన వెంటనే భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. మృతి చెందిన వారిలో ఇద్దరు పైలట్లు, నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కాగా విమానం, హెలికాప్టర్ ఢీకొని రెండురోజులు గడవక ముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిన విమానాన్ని లీఆర్ జెట్ 55 గా గుర్తించారు. ఈ ఘటనపై గవర్నర్ జోష్ శాప్రియా స్పందించారు. వెంటనే ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మృతిచెందిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా విమానం మిస్సోరి వెళ్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన కారణంగా చుట్టుప్రక్కల రోడ్లన్ని మూసివేసి సహాయక చర్యలు చేపడుతున్నారు. సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. రెండు రోజుల క్రితం అమెరికాలో జరిగిన ఘోర విమాన ప్రమాదం ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో బుధవారం రాత్రి ఆర్మీ హెలికాప్టర్‌ను.. 64 మందితో ప్రయాణిస్తున్న విమానం గాల్లోనే ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక్కరూ కూడా బతకలేదని అధికారులు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన దురదృష్టకరమని.. మృతుల కుటుంబాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రగాఢ సానుభూతి తెలిపారు.
🚨BREAKING: A small plane fell out of the sky in Northeast Philadelphia.
Wow, less than 2 weeks in trump's America, egg prices through the roof, tariffs making other prices skyrocket, and planes falling out of the sky.
MAGA: Making America Gross Againpic.twitter.com/yiLjKYyaAB
— BrooklynDad_Defiant!☮️ (@mmpadellan) February 1, 2025
ఏవియేషన్ అథారిటీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. గాలిలో విమానం ఉందని హెలికాప్టర్‌ను అలర్ట్ చేయడంతో పాటు.. ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో హెలికాప్టర్ పైలట్‌కు కంట్రోల్ టవర్ అధికారులు ఎందుకు చెప్పలేదని ఏవియేషన్ అధికారులను ట్రంప్ ప్రశ్నించారు.
Also Read: భారీగా లాభాలున్నా వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు.. ఎందుకంటే
ఇప్పటి వరకు 27 మృతదేహాలను గుర్తించామన్నారు అధికారులు. ఒకరి మృతదేహాన్ని హెలికాప్టర్‌లో గుర్తించినట్టు వాషింగ్టన్ డీసీ ఫైర్ డిపార్ట్మెంట్ చీఫ్ జాన్ ఎ.డొనెల్లీ వెల్లడించారు. ఈ ప్రమాదంలో రష్యాకు చెందిన ఎవజెనియా సిస్కోవా, వాదిమ్ నౌమువ్ అనే ఇద్దరు స్కేటింగ్ ఛాంపియన్స్ ఉన్నట్లు సమాచారం. విమానం కాన్సాన్ లోని విచిత నుంచి వాషింగ్టన్ వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
First hand video of what happened in northeast Philadelphia pic.twitter.com/LJt912Tw6l
— Darren Minto (@FB_Darren) February 1, 2025