Vimala Raman: సినీ పరిశ్రమలో పనిచేసే హీరోయిన్స్‌కు తరచుగా చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. కానీ చాలామంది వాటిని బయటకు చెప్పుకోరు. గత కొన్నేళ్లలో చాలా మారింది. చాలామంది హీరోయిన్స్ వారు ఎదుర్కున్న చేదు అనుభవాల గురించి ఓపెన్‌గా చెప్పేస్తున్నారు. అందులో విమలా రామన్ కూడా ఒకరు. హీరోయిన్‌గా పరిచయం అయినప్పటి నుండి పలు సినిమాల్లో నటించినా ఇప్పటికీ తనకు సరైన బ్రేక్ రాలేదు. అయినా కూడా అప్పుడప్పుడు బోల్డ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది ఈ బ్యూటీ. తాజాగా మాలీవుడ్‌లోకి ఎంటర్ అయినప్పుడు తనకు ఎదురైన అనుభవం గురించి బయటపెట్టింది విమలా రామన్.
మాలీవుడ్‌లో క్రేజ్
ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన విమలా రామన్.. యాక్టింగ్‌పై ప్యాషన్‌తో ఇండియా వచ్చేసింది. అంతకు ముందు పలు బ్యూటీ పోటీల్లో నటించిన అనుభవంతో ఇక్కడ సినిమా అవకాశాల కోసం ట్రై చేయడం మొదలుపెట్టింది. ఫైనల్‌గా 2006లో ‘పొయ్’ అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా మారింది విమలా రామన్. తమిళంలో చేసింది ఒక్క సినిమానే అయినా వెంటనే తనకు మలయాళంలో అవకాశాలు రావడం మొదలయ్యింది. ఒకేసారి దాదాపు అరడజనుకు పైగా మలయాళ సినిమాలు సైన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది విమలా రామన్. అయితే అప్పుడే హీరోయిన్‌గా ఎంటర్ అయిన తనకు మాలీవుడ్ వల్ల ఎదురైన అనుభవాల గురించి విమలా తాజాగా బయటపెట్టింది.
దానికోసం కష్టపడ్డాను
‘‘నేను ముందుగా ఆస్ట్రేలియా నుండి ఇండియా వచ్చినప్పుడు కల్చర్‌లో మార్పులు చూసి షాకయ్యాను. తమిళ సినిమాతో పరిచయం అయ్యాను కాబట్టి అప్పట్లో పెద్దగా మలయాళ సినిమాలు చూడలేదు. చెప్పాలంటే మలయాళ పరిశ్రమ గురించి నాకేమీ తెలియదు. కానీ అందులో అవకాశం వచ్చినప్పుడు అది నాకు గొప్ప అవకాశం అనుకొని వెంటనే యాక్సెప్ట్ చేశాను. మలయాళ పరిశ్రమలో మనుషుల ప్రవర్తన నాకు చాలా నచ్చింది. కానీ భాష రాకపోవడం వల్ల చాలా కష్టపడ్డాను. అసలు ఇంకొక్క మలయాళ సినిమాలో కూడా నటించకూడదు అనుకున్నాను. కానీ ఆడియన్స్ దగ్గర నుండి వచ్చిన సపోర్టే నన్ను ముందుకు నడిపింది’’ అని గుర్తుచేసుకుంది విమలా రామన్ (Vimala Raman).
Also Read: ల్యాండ్ కబ్జా కేసులో బుక్కయిన బో** బ్యూటీ..ఇక జైలుకేనా..?
యాక్సెప్ట్ చేశారు
‘‘అసలు మలయాళ ప్రేక్షకులు నన్ను అంతగా ఆదరిస్తారని నేను అనుకోలేదు. థియేటర్లలో నా ఇంట్రో రాగానే ఆడియన్స్ దానిని చాలా బాగా యాక్సెప్ట్ చేశారు. నాకు చాలా సంతోషంగా అనిపించి థియేటర్‌లో ఏడ్చేశాను’’ అని చెప్పుకొచ్చింది విమలా రామన్. అలా కెరీర్ మొదట్లోనే మాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత కొంతకాలానికే మళ్లీ తమిళ పరిశ్రమ నుండి తనకు పిలుపు వచ్చింది. అంతే కాకుండా వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ‘ఎవరైనా ఎపుడైనా’ అనే సినిమాతో తెలుగులో కూడా డెబ్యూ చేసింది విమలా రామన్. ఆ తర్వాత కూడా పలు తెలుగు చిత్రాల్లో నటించినా ఇక్కడ తనకు అంతగా గుర్తింపు దక్కలేదు. ఇప్పటికీ అప్పుడప్పుడు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ ప్రేక్షకులను పలకరిస్తోంది విమలా రామన్.