BigTV English

Satyabhama Today Episode : క్రిష్ కు షాకిచ్చిన మహాదేవయ్య.. చక్రవర్తి ఇంటికి క్రిష్..?

Satyabhama Today Episode : క్రిష్ కు షాకిచ్చిన మహాదేవయ్య.. చక్రవర్తి ఇంటికి క్రిష్..?

Satyabhama Today Episode February 23rd :  నిన్నటి ఎపిసోడ్లో.. ఉదయం హర్ష ఇంటికి వస్తాడు. నేను మోసం చేశాను నందిని మోహం చూడాలంటే నాకు భయమేస్తుంది అని మళ్లీ బయటకు వెళ్లాలని అనుకుంటాడు.. హర్ష వెళ్ళిపోతుంటే వాళ్ళ నాన్నమ్మ చూసి హర్షను తిడుతుంది. హర్ష లోపలికి వెళ్ళగానే నందిని హర్ష తో మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోతుంది. అటు క్రిష్ బైరవి అన్నమాటను తలుచుకొని కోపంగా ఉంటాడు. అమ్మంటే ఇలా మాట్లాడుతుందా? అమ్మన్న మాటలకి నేను ఎంత బాధ పడుతున్నానో తెలుసా అని ఆలోచిస్తూ ఉంటాడు. క్రిష్ ఛాలా కోపంగా ఉన్నాడు దీన్ని ఎలాగైనా కూల్ చేయాలి అని సంజయ్ ప్లాన్ వేస్తాడు. ఏమైంది బ్రో అంత టెన్షన్ పడుతున్నావ్ అంటే అమ్మ ఇలా అంటే బాధగా ఉంటది బ్రో అనేసి అంటాడు బిగ్ మామ్ తో నేను మాట్లాడుతాను అసలు ఏమైందో కనుక్కుంటానని అంటాడు. సంజయ్ మాట నమ్మి తాగడానికి కూర్చుంటాడు క్రిష్. భైరవి అన్న మాటలు గుర్తు చేసుకుంటూ మొత్తం బాటిల్ ని తాగేస్తాడు. ఇలా మత్తులో చేరుకోవడమే నాకు కావాలి అక్కడ నేను సత్యతో చేయబోయేది నువ్వు చూడకూడదు కదా అనేసి అనుకొని వెళ్ళిపోతూ ఉంటాడు కానీ క్రిష్ మాత్రం ఎక్కడికి వెళ్తున్నావ్ బ్రో అంటే కళా పోషణ కాస్త అలా వెళ్లి వస్తానని అంటాడు. సత్య దగ్గరికి సంజయ్ వస్తాడు. సత్యను చక్కని చూసి కసితో రగిలిపోతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. క్రిష్ బైరవి అన్నమాటలని తలచుకుంటూ ఫుల్ బాటిల్ మందు తాగేస్తాడు. ఇక సంజయ్ సత్యను ఎలాగైనా ఈ రోజు అనుభవించాలని లోపలికి వస్తాడు.. సత్యతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. సత్య ఎంతగా వద్దని వాదిస్తున్న కూడా సత్యను పట్టుకుని ఈరోజు నువ్వు నా నుంచి తప్పించుకోలేవు ఈరోజు మన రొమాన్స్ జరగాల్సిందే అని సంజయ్ కసితో సత్యను పట్టుకుంటాడు.. సత్య ఒకవైపు క్రిష్ అని అరుస్తూ ఉంటుంది. వాడు రాడు రాలేడు ఫుల్ బాటిల్ తాగేసి పడిపోయాడు మత్తులోకి జారుకున్న తర్వాతే నీ దగ్గరికి వచ్చాను ఈరోజు నన్నెవరూ ఆపలేరు ఈరోజు మనిద్దరిది జరిగిపోవాల్సిందే నేను నిన్ను కసితీరా అనుభవించాల్సిందే అని అంటాడు. సంజయ్ నుంచి సత్య తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడే క్రిష్ లోపలికి వస్తాడు.

సత్యను సంజయ్ పట్టుకోవడం చూసి షాక్ అయిపోతాడు. అతనిపై కోపంతో రగిలిపోతూ సంజయ్ అంటూ గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా రూమ్ లోకి వచ్చేస్తాడు. సత్యను వదలరా అనేసి గట్టిగా అరుస్తాడు.. నేను ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా సంజయ్ అలాంటివాడు కాదు నువ్వే ఆ తప్పుగా ఆలోచిస్తున్నావా అని నన్ను అన్నావు ఇప్పుడేంది అతను నా మీద కన్నేసాడు నేను ఎన్నిసార్లు నీకు చెప్పినా నువ్వేనట్లేదు చూసావా ఇప్పుడు అతని బాగోతం ఏంటో ఇప్పుడు నువ్వు ఏం చేస్తావ్ క్రిష్ అని గట్టిగా అరుస్తుంది సత్య. సంజయ్ ను కొట్టుకుంటూ కిందకు తీసుకొస్తాడు క్రిష్..


అటు హర్ష నందినికి ద్రోహం చేశానంటూ బాధపడిపోతున్నాడు. నీ దగ్గరికి నేను ఎలా వెళ్లాలి నందిని మోహం చూడలేకపోతున్నానని తనలో తానే కుమిలిపోతాడు. నందిని కోపాన్ని చూసి తట్టుకోలేక పోయి స్నానం చేయాలని లోపలికి వెళ్తాడు. నేను నా నందినీకి ద్రోహం చేశాను మైత్రివల్ల మోసపోయాను ఇన్ని రోజులు అమాయకురాలు అనుకున్నాను కానీ నామీద ఇంత కక్ష పెంచుకొని నన్ను ఇలా వాడుకోవాలని అనుకుంటుందా నందిని దూరమైతే నేను బ్రతకలేను అంటూ బాత్రూంలో గోడకేసి కొట్టుకుంటాడు. నందిని వచ్చి ఏమైనా హర్ష కాల్ జారి కింద పడ్డావా అని కంగారు పడుతుంది. ఆ దెబ్బలు ఏందీ ఏమైందని తగలబోతుంటే నందిని తగల ఎవడు. ఆఫీస్ నుంచి ఎందుకు లేట్ వచ్చావని అడుగుతానని అనుకున్నావా అడగనులే జస్ట్ బామ్మ ముందు జలక్ ఇచ్చానని నందిని అంటుంది. ఆ తర్వాత మైత్రి దగ్గరికి వెళ్తాను అన్నావ్ కదా వెళ్లొచ్చావని అడుగుతుంది. అవన్నీ ఎందుకు నాకు ఆకలిస్తుంది టిఫిన్ పెట్టవా అని నందిని అడుగుతాడు.

క్రిష్ సత్యపై చెయ్యేసినందుకు సంజయ్ ని చితగ్గొట్టేస్తాడు. రక్తం వచ్చేలా కొడతాడు ఎవరు ఆపినా కూడా ఆగడు. సంజయ్ ని నా సత్య మీద చేయిస్తావని చంపబోతాడు. ముందు మీద కాలు పెట్టి నీకు ఇక భూమి మీద నూకలు చెల్లాయి ఇన్ని రోజులు సంధ్య మొహం చూస్తే నిన్ను వదిలాను ఇక నువ్వు చేసే మోసం గురించి అందరికీ తెలిస్తే అందరు నిన్నే ఛీ అంటారు అంటూ సంజయ్ ని చంపబోతాడు.. అప్పుడే మహదేవయ్య వచ్చి రేయ్ చిన్న అంటూ క్రిష్ ను కాలుతో తన్నెస్తాడు.. ఎందుకురా నువ్వు నా కొడుకుని చెప్పాలి అనుకుంటున్నావు నీకేం అధికారం ఉందంట నువ్వు చంపుతావు అనేసి మహాదేవయ్యా కృష్ణ అంటాడు. బాపు వీడు సత్యతో అసభ్యంగా ప్రవర్తించాడు. నా సత్య మీద చేయిస్తే నేను ఎలా ఊరుకుంటాను బాపు వీన్ని ఎలాగైనా చంపేస్తాను అనేసి క్రిష్ అంటాడు. సంజయ్ ఎవరనుకుంటున్నావు నా కన్న కొడుకు రుద్రా సంజీయులు నా కన్న కొడుకులు నువ్వు వాళ్ళ మీద చేయి చేసుకుంటుంటే నేను చేతకాని వాళ్ళ లాగా చూస్తూ కూర్చోవాలి అనుకుంటున్నావా అనేసి అనగానే క్రిష్ షాక్ అయి కింద పడతాడు . ఇక అప్పుడే ఇంట్లోకి చక్రవర్తి ఎంట్రీ ఇస్తాడు. ఇది నిజం కోసమే నేను ఇన్నాళ్లు వెయిట్ చేశాను నా కొడుకుని నేను తీసుకెళ్లి పోతాను అని చక్రవర్తి అంటాడు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×