Pawan Kalyan meeting MLAs: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతాయా? వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు వస్తారన్న సమాచారంతో కూటమి సర్కార్ అలర్ట్ అయ్యిందా? ఈ విషయంలో టీడీపీ కంటే జనసేన ఓ అడుగు ముందుకేసిందా? జనసేన టార్గెట్‌గా వైసీపీ ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉందా? ఈ నేపథ్యంలో జనసేన శాసనసభాపక్ష ఆదివారం సాయంత్రం భేటీ కానుంది.
సోమవారం నుంచి ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్నాయి. దీని కోసం ప్రభుత్వం కసరత్తు చేసింది. వైసీపీ వస్తుందన్న సమాచారంలో ప్రభుత్వం దృష్టి పెట్టింది. సమావేశాల రీత్యా అసెంబ్లీ ఆవరణలోకి ప్రవేశంపై ఫోకస్ చేసింది. బ్యానర్లు, ప్లకార్డులు నిషేధించాలని నిర్ణయించింది. శాసన సభ, మండలి పరిసరాల్లో సమావేశాలు, ప్రదర్శనలు, ధర్నాలు పూర్తిగా నిషేధించింది.
సభలో అనుసరించాల్సిన దానిపై ఆదివారం సాయంత్రం ఐదుగంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన శాసనసభాపక్ష సమావేశం కానుంది. పార్టీ ఆఫీసులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అధినేత భేటీ కానున్నారు. బడ్జెట్‌పై అవగాహన, అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి, బడ్జెట్ పై ఎలా చర్చించాలి అనే అంశాలపై పార్టీ నేతలను దిశా నిర్దేశం చేయనున్నారు పవన్ కళ్యాణ్.