E-Paper
Advertisement

Satyabhama Today Episode : సంధ్యకు పెళ్లి ఫిక్స్.. సత్యకు మహాదేవయ్య దిమ్మతిరిగే షాక్..

Satyabhama Today Episode : సంధ్యకు పెళ్లి ఫిక్స్.. సత్యకు మహాదేవయ్య దిమ్మతిరిగే షాక్..
Advertisement

Satyabhama Today Episode January 27th: నిన్నటి ఎపిసోడ్ లో… క్రిష్ ను తీసుకొని బయటకు వెళ్లడానికి రెడీ అవుతారు. క్రిష్ మాత్రం చాలా స్లోగా కార్ డ్రైవ్ చేస్తూ సరదాగా ఉంటాడు. సత్య నేను టెన్షన్ పడుతుంటే నువ్వు ఇంత సరదాగా ఎలా ఉన్నావు అని అంటుంది. దానికి క్రిష్ ఆ ఫోన్ చేసింది నేనే అలా చేస్తే నువ్వు బయటికి వచ్చి నీ ప్రచారం చేసుకోవచ్చు కదా అని చేశానని అంటాడు. మా అమ్మ నిన్ను బ్లాక్ చేసింది నాటకం ఆడి ప్రచారంకి పోనివ్వకుండా అక్కడే ఉంటే ప్రచారం ఎవరు చేస్తారని జరంత సాయం చేశాను నాకు అన్యాయం చేయడం నచ్చదు అని క్రిష్ అంటాడు. సత్యానందిని ఇద్దరు బయట ప్రచారం చేయడానికి మొదలు పెడతారు. ముందుగా ఒక జామకాయల వ్యక్తిని ఓటు వెయ్యమని అడుగుతారు. చదువుకున్న దానిలాగా ఉన్నావ్ నీకెందుకు అమ్మ ఎలక్షన్స్ ఎలక్షన్స్ ఒక చెత్త లాంటివి వీటిని అలానే వదిలేయాలి లేకుంటే మాత్రం మనల్ని పట్టుకుని పీడిస్తాయని ఆయన ఉచిత సలహాలు ఇస్తాడు. బస్టాప్ లో ఉన్న ఆడపిల్లలు నేర్పించడానికి ఇద్దరు రౌడీలు వస్తారు. వాళ్ళని ఏడిపిస్తుంటే సత్య ఊరుకోకుండా వాళ్ళని కొట్టడానికి వెళుతుంది. రౌడీలని చితకొట్టి ఆడపిల్లలను ఏడ్పిస్తే అసలు ఊరుకోను అన్యాయం జరిగిందంటే నేను ఎంతకైనా తెగిస్తానని చెప్పి చెప్పు తీసుకొని కొడుతుంది. సత్య కొడుతున్న వీడియోని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. ఆ వీడియో వైరల్ అవుతుంది అది చూసిన వాళ్ళందరూ ఇలాంటి అమ్మాయి ఎమ్మెల్యే అయితే మన ఊరికి మంచి జరుగుతుంది అమ్మాయిలకు న్యాయం జరుగుతుందని అందరూ అనుకుంటారు.. ప్రతి ఒక్కరూ సత్యకు సపోర్ట్ చేస్తూ ఓటు వేయాలని అనుకుంటారు. ఇక సత్యానందిని ప్రచారాన్ని మళ్లీ మొదలు పెడతారు. విశ్వనాథం ఇంట్లో ఆ వీడియోని చూసి విశ్వనాథం నాన్నమ్మ టెన్షన్ పడుతూ ఉంటారు. హర్ష ఈ విషయాన్ని నందిని కి చెప్తాడు నందిని వెళ్లి సత్యకి చెప్తుంది. సంతోషంగా ఉన్న సమయంలో సంధ్య సంజయ్ బైక్ పై కనిపించడంతో సత్య షాక్అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సంజయ్ బండిపై వెళుతున్న సంధ్యని చూస్తుంది సత్య.. కాల్ చేసి అడిగితే కంప్యూటర్ క్లాస్ కి వెళ్లాను ఇప్పుడే ఇంట్లోకి వెళుతున్నా అంటుంది. సంజయ్ బైక్ పై నిన్ను చూశాను అంటే తను లిఫ్ట్ ఇచ్చాడని అబద్ధం చెబుతుంది. తనకి దూరంగా ఉండు అని చెబుతుంది..సత్య ఇంట్లోకి అడిగి పెట్టడంతో మీడియా వాళ్ళు అక్కడికి వస్తారు. వరంగల్ లో ఇలాంటి ధైర్యం ఎవరూ చేయలేదు అంటారు. ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఇలా చేశారా అంటే.. దీనికి ఎన్నికలకు ముడిపెడతారని నాకు తెలుసు.. సమాజంలో సమస్యల పట్ల ఇలాగే రియాక్టవుతాను. ప్రచారం కోసం కాదు తోటి ఆడపిల్లల పట్ల బాధ్యత అనుకుని చేశానంటుంది. అది మీడియాలో టెలికాస్ట్ అవడంతో అటు క్రిష్ ఫుల్ ఖుషి అవుతాడు.. ఆ వీడియో టీవీ లో రావడంతో సత్య క్రేజ్ పెరుగుతుంది. అయితే మహాదేవయ్యకు మాత్రం ఒళ్ళు మండిపోతుంది. ఎక్కడ విన్నా సత్య అనే పేరు వినిపిస్తుందని కోపంగా ఉంటాడు. ఇక పార్టీ నుంచి మహాదేవయ్యకు ఫోన్ వస్తుంది. నీ కోడలు క్రేజ్ పెరుగుతుంది. చూసుకో నువ్వు ఓడిపోకుండా ఏం చేస్తావో అది చెయ్యి అని అంటాడు. మహాదేవయ్య సత్యను ఎలాగైన అడ్డు తప్పించాలని అనుకుంటాడు.

Advertisement

క్రిష్ మాత్రం బొమ్మను అడ్డుపెట్టుకొని బాగానే పబ్లిసిటీ పెంచుకున్నావ్ చిట్టీ నిన్ను రెచ్చగొట్టి తప్పు చేశాను. అని అంటాడు. దానికి సత్య నేను వీడియో తీసయించానా, టీవీ లో వచ్చేలా వీడియో తీయించనా అని అంటుంది. ఏ నేను ఊరికే అన్నాను అంటాడు. నీకు బాగా పేరు వచ్చింది మరి నాకేంటి అని అంటాడు. నోరు మూయిస్తాను.. తియ్యగా పెదాల పై ముద్దు ఇస్తుందేమో అని ఆశ పడతాడు. కానీ సత్య షాకిస్తుంది. అటు సంధ్యకు పెళ్లి సంబంధాలను విశ్వనాధం ఫ్యామిలీ చూస్తారు.. అబ్బాయి బాగున్నాడని అందరు అనుకుంటారు. సంధ్యకు ఈ విషయం చెబితే ఒప్పుకోదు. రేపు పెళ్లి చూపులకు వస్తారని చెప్తాడు. కానీ సంధ్య మాత్రం ఇంట్లో పెద్ద రచ్చే చేస్తుంది. అర్జెంట్ గా ఈ విషయాన్ని సంజయ్ కు చెప్పాలని ఫోన్ చేసి చెప్తుంది. ఇంట్లో చెప్పేద్దాం అని అంటాడు.

ఇక మహాదేవయ్య మాత్రం సంజయ్ ను ఇరికించి సత్యను పోటీ నుంచి తప్పించాలని ప్లాన్ చేస్తాడు.సంధ్య మాత్రం ఇంట్లో వాళ్లకి ఎక్కడ నిజం తెలిసిపోతుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్కకు ఒకవేళ అనుమానం వస్తే కచ్చితంగా ఇంట్లో చెప్పేస్తుంది ఆ తర్వాత నన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళనివ్వరు. ముఖ్యంగా నన్ను సంజయ్ ని కలుసుకొని ఇవ్వరు.. కనీసం ఫోన్ కూడా మాట్లాడనివ్వరని బాధపడుతూ ఉంటుంది. సత్యను అడ్డుతప్పించాలని మహదేవయ్య నీ చిలకను పోదాం రమ్మని చెప్పు అని సంజయ్ ను ఉసిగోలుపుతాడు. అలాగే బిడ్డని సంజయ్ సంధ్య కు ఫోన్ చేస్తాడు. సత్య ఏమనిందో అని తెలుసుకోవడానికి ఫోన్ చేశానని నువ్వు టెన్షన్ పడకు నీకు నేనున్నానని ధైర్యం చెప్పడానికి ఫోన్ చేస్తానని సంజయ్ సంధ్యతో అంటాడు. నాకు మాత్రం టెన్షన్ గా ఉంది సంజయ్ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు అక్క వచ్చి ఏదైనా చెప్తే నన్ను ఇంట్లోంచి బయటికి రానివ్వరు నిన్ను కలుసుకొని ఇవ్వరు నీతో మాట్లాడకుండా నేను చూడకుండా నేను ఉండలేను నా ప్రాణం పోయేటట్లు ఉందని సంధ్య బారీ డైలాగులు కొడుతుంది. ఇక మహదేవయ్య సత్య దగ్గరకు వచ్చి నేనే ఇదంతా చేయించాను నీ చెల్లిని కాపాడుకుంటావో ఎలక్షన్లలో నిలబడతావో అది నీ ఇష్టం అని బెదిరిస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో క్రిష్ నేరుగా రంగంలోకి దిగుతాడు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×