Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. జనవరి 27న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి: ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఇతరుల నుండి సమస్యలు తప్పవు. నూతన రుణాలు చేస్తారు. వృధా ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి. దైవ చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి.
వృషభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. అన్ని రంగాల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది. విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్న నాటి మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
మిధున రాశి: ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృథా ఖర్చులు చేస్తారు. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు పరుస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ఇంటా బయట నూతన పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. వ్యాపార, విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. స్నేహితులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి.
సింహ రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఇంట్లో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగస్తులకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో శుభ కార్యాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి.
కన్యా రాశి: ఈ రాశి వారు ఈరోజు బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సోదరులతో ఒక వ్యవహారంలో సఖ్యత లోపిస్తుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్
తులా రాశి: ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు నిరుత్సాహం తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన కార్యక్రమాలు నిరాశ కలిగిస్తాయి. పనులలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈరోజు అందరిలోనూ గుర్తింపు పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో సఖ్యత కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది.
ధనస్సు రాశి: ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సానుకూలమవుతాయి. అందరిలోనూ పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి.
మకర రాశి: ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు స్థానచలన సూచనలున్నవి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. స్నేహితులతో విభేదాలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాలలో ఆటుపోట్లు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృధా ఖర్చులు విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది.
కుంభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. నూతన వాహనయోగం ఉన్నది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.
మీన రాశి: ఈ రాశి వారికి ఈరోజు సంతానం వివాహ ప్రయత్నాలు అనుకూలించవు. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగులకు ఊహించని మార్పులు తప్పవు. బంధువులతో విభేదాలు కొంత బాధిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు – ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?