BigTV English

Satyabhama Today Episode : సత్యకు పెరిగిన సపోర్ట్.. సపోర్ట్ గా రేణుక.. రుద్ర ప్లాన్ కు సత్య బలి..

Satyabhama Today Episode : సత్యకు పెరిగిన సపోర్ట్.. సపోర్ట్ గా రేణుక.. రుద్ర ప్లాన్ కు సత్య బలి..

Satyabhama Today Episode January 9th : నిన్నటి ఎపిసోడ్ లో.. నందిని,సత్యలు నామినేషన్ పత్రం పై సంతకం పెట్టించాలని ఊరంతా తిరుగుతారు. కానీ ఒక్కరు కూడా సంతకం చేయడానికి ముందుకు రారు మహదేవయ్య గురించి తెలిసి మేము ముందుకు రాము మా ప్రాణాలు మాకు ముఖ్యం అనేసి అంటారు. ఇక దాంతో నిరాశగా వెను తిరుగుతారు నందిని సత్య. వాళ్ళని చూసి నరసింహ అక్కడికి వస్తాడు. నీ మామ కి నువ్వు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నావంటే నువ్వు నాకు మిత్రువనే శత్రువు శత్రువు కలిస్తే మిత్రులే అవుతారు నీకు నేను సపోర్ట్ చేస్తాను పదిమంది కాదు వంద మందిని నీకు తీసుకొస్తాను. నాతో చేతులు కలుపుకొని నరసింహ బంపర్ ఆఫర్ ఇస్తాడు. కానీ దానికి సత్యం మాత్రం అస్సలు ఒప్పుకోదు. నరసింహ కు షాక్ ఇస్తుంది. సిద్ధాంతాలకు మాత్రమే నేను మా మామయ్య వ్యతిరేకం కానీ మా మామయ్య మీద నాకు ఎటువంటి కక్ష లేదు. నువ్వు మా ఇద్దరి మధ్య చీలికలు ఏర్పాటు చేయాలని అనుకోకు అనేసి గట్టి షాక్ ఇస్తుంది.. ఇక నరసింహ ఏం మాట్లాడుకున్నా ఉంటాడు. మార్చుకుంటే మళ్లీ నాకు చెప్పు నేను వచ్చి నీకు సపోర్ట్ చేస్తాను అని సత్యతో అంటాడు. నరసింహతో సత్య మాట్లాడిన మాటలు విని క్రిష్ ఫిదా అయిపోతాడు.. ఇక సత్య కృష్ణ ఇంటికి వెళ్తారు సత్యను బైరవి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. జయమ్మ సత్యకు సపోర్ట్ చేస్తానని ముందుకు వస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బైరవికి జయమ్మ షాక్ ఇస్తుంది ఆ షాక్ లోంచి తేరుకొక ముందే సత్యా కౌంటర్లు వేస్తుంది. సత్య మాటలు విన్న రుద్ర కోపంతో రగిలిపోతాడు. ఆ చేయిని వదిలిపెట్టదు మామయ్య వదిలిపెడితే మరోసారి జైలుకు వెళ్లాల్సి వస్తుందని రుద్రకు వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది సత్య. ఇక సత్య పడుకొని కలలు కంటుంది. నామినేషన్స్ కి అందరూ వచ్చి సంతకం పెట్టినట్లు సంతోష పడుతుంది. నిద్రలో లేచి చప్పట్లు కొడుతూ విజిల్స్ వేస్తుంది. క్రిష్ లేచి ఏమైంది సత్య అని అడుగుతాడు.. నాకు మంచి కల వచ్చింది క్రిష్. నా నామినేషన్ మీద నా పుట్టింటి వాళ్లతో పాటు అత్తయ్య కూడా సంతకం చేశారు. దానికి ఏంటి మా అమ్మనా అయితే కచ్చితంగా అది పీడ కలనే. డౌటే లేదు. నీ కల నిజం కావాలి అని సరదాగా అయినా అనొచ్చు కదా సంతోషపడతాను. నీ పుట్టింటి వాళ్లు అంటే ఓకే కానీ మా అమ్మ సంతకం చేయడం అంటే చిన్న ముచ్చటనా అని క్రిష్ ఎగతాళి చేస్తాడు. మీ పుట్టింటోళ్లు సంతకం చేసారంటే ఓకే కానీ మా అమ్మ సంతకం చేసింది అంటే మీడియా పాకిస్తాన్ కలిసిపోయినట్లే లెక్క అని అంటాడు. ఏమైనా కాసేపు సంతోష్ పడనివ్వవా అని సత్య అడుగుతుంది. నీ కలే ఏమోగాని నా కలను చెడగొట్టావు అని అంటాడు. నువ్వేం కలగన్నావ్ అనేసి అంటుంది సత్య. మంచి కళ అని చెప్పబోతుంటే అక్కడ కూడా చెడు కలలేనా అనేసి సత్య అంటుంది.

ఉదయం లేవగానే సత్య ఇంట్లో అన్ని పనులు చేసి పూజ చేస్తుంది. తన వైపు నిజాయితీ ఉంటే తనని గెలిపించమని కోరుకుంటుంది. నందిని, బామ్మ సపోర్ట్ చాలా గొప్పది అని కానీ అది సరిపోదు అని అనుకుంటుంది. ఇంతలో వృద్ధాశ్రమం కోసం సత్యని ఆశ్రయించిన పెద్దావిడ మరో ముగ్గురు మహిళలను తీసుకొని వస్తుంది. ఆశ్రమంలో ఉన్న 30 మందిలో ఆరుగురు అన్ని తెగించి నీకు అండగా ఉంటాం నామినేషన్ మీద సంతకం పెడతామని చెప్తారు. సత్య చాలా సంతోషపడుతుంది. సత్య మళ్లీ సంతోషంతో అమ్మవారికి దండం పెట్టుకుంటుంది.. నా యుద్ధానికి ఇక ఇద్దరు మాత్రమే కావాలి ఆ ఇద్దరు ఎలాగోలాగా వస్తే నేను దాదాపు విజయం సాధించినట్లే అని దేవుని ప్రార్థిస్తుంది.


అప్పుడే మహదేవయ్య వచ్చి అది అస్సలు సాధ్యం కాదు ఎంత పెట్టి ఆ ముసలాలను కొన్నావు అని అంటాడు. ఆ అలవాటు నీకుంది నాకు లేదు అని అంటుంది.. ఇవన్నీ కాకులు అని ఎగిరిపోతాయని సత్యని ఎగతాళి చేస్తాడు.. ధర్మం నా వైపు ఉంది కాబట్టే ఇంత వరకు రెండుగా ఉన్న నా బలం ఇప్పుడు 8కి పెరిగింది. అప్పుడే పైనుంచి రేణుక ఎనిమిది కాదు సత్య 9 అంటుంది. ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్ ఎంత వరకు చదువుకున్నావ్ రెండు ఆరు కలిపితే 8 కదా 9 అంటావ్ ఏంటి అంటాడు. నాతో కలిపితే తొమ్మిది మామయ్య. అక్కా నువ్వు చెప్పేది నిజమా నన్ను సపోర్ట్ చేస్తావా.. సపోర్ట్ చేయకపోతే అంత కంటే తప్పు లేదు సత్య. మీదకి చెప్పాలి అనుకున్నా భయంతో ఆగిపోయా. ఈ ఇంట్లో నాకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచింది నువ్వే అందుకే నేను ఇప్పుడు నీకే సపోర్ట్ చేస్తా. ఆ ముసలాలను చూసి నాకు నీకు సపోర్ట్ చేయాలనిపించింది అందుకే తెగించేసాను సత్య అని అంటుంది. రుద్ర వచ్చి నేను ఒప్పుకోను అంటాడు. నిన్న మీ నానమ్మ సపోర్ట్ చేస్తానంటే ఏం మాట్లాడలేదే అప్పుడు తప్పు లేదు కదా ఇప్పుడు నాదెలా తప్పు అవుతుంది అనేసి అడుగుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన క్రిష్ అస్సలు కాదు వదిన. హ్యాపీగా సపోర్ట్ చేయొచ్చు వెళ్లి పని చేసుకోండి పోండి. దానికి రుద్ర రేయ్ ఏంట్రా నువ్వు నా పెళ్లానికి చెప్పావ్ నీ పెళ్లానికి నువ్వు చెప్పుకోలేకపోయావ్. నీ వాలకం చూస్తుంటే నువ్వు నీ పెళ్లాం దిక్కే జంప్ అయ్యేలా ఉన్నావ్. క్రిష్ చూడు నా నిజాయితీ ఏంటో బాపుకి తెలుసు. అరిస్తే ఎవరూ ఎవరి మాట వినరు అన్నయ్య లౌఖ్యంతో పెరగాలి. సత్య తప్పు చేస్తుంది ఒకే. బయట ప్రపంచం తెలీకుండా పెరిగింది ఇప్పుడు తనకు ఎవరు సపోర్ట్ చేస్తారు. పది మందినే సంపాదించుకోలేకపోయింది ఇప్పుడు ఎలా గెలుస్తుంది అని అనగానే మహాదేవయ్య అంతేలేరా అంటాడు.

ఇక రుద్ర కోపంగా గదిలోకి వెళ్లిపోతాడు. రేణుక గదిలో బట్టలు మడతపెడుతుంటే.. వెళ్లి కొట్టడానికి చేయి ఎత్తుతాడు. దాంతో రేణుక చేయి పట్టుకొని రుద్రకి ఎదురుతిరుగుతుంది. నువ్వు నాలుగు కొడితే నేను తిరిగి రెండు అయినా కొడతాను అని భర్తకి ఎదురు తిరుగుతుంది. రుద్ర షాక్ అయిపోతాడు. రాత్రి మహదేవయ్య సిగరెట్ తాగుతూ రగిలిపోతూ ఉంటే రుద్ర వెళ్లి ఇద్దరూ కోడళ్లకు లోకువ అయిపోయావు అంటాడు.. అసలే కాలి ఉన్నాను ఇంకా కాల్చాలని చూడకు నామినేషన్ చేయడానికి ఆ ముసలోళ్ళు రాకుండా ఉండాలి ఎలా బెదిరించాలో అలా బెదిరించాలి అని అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో క్రిష్ ను అర్జెంటుగా రావాలని తీసుకెళ్తుంది. మరి సత్య ఎక్కడికి తీసుకెళ్తుందో ఎవరికి సీరియస్ ఉందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×