Railway Whatsapp Service: ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు సరికొత్త సర్వీసులను ప్రారంభిస్తున్నది. అందులో భాగంగానే ఇప్పుడు వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకే ఒక్క క్లిక్ తో బోలెడు సదుపాయాలను కల్పిస్తున్నది. PNR స్టేటస్, ట్రైన్ లైవ్ ట్రాకింగ్, ఫుడ్ ఆర్డర్, రైలు టికెట్ బుకింగ్, రైలు షెడ్యూల్, కోచ్ ప్లేస్ తో పాటు ప్రయాణ సమయంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పిస్తున్నది.
వాట్సాప్ ద్వారా ఈ సేవలను ఎలా పొందాలంటే?
రైల్వే వాట్సాప్ సర్వీసులను పొందేందుకు ప్రయాణీకులు ఈ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది.
⦿ రైల్వే వాట్సాప్ సర్వీస్ ను యాక్సెస్ చేయడానికి ప్రయాణీకులు ముందుగా తమ ఫోన్ లో 98811-93322 నంబర్ ను సేవ్ చేసుకోవాలి,
⦿ ఆ తర్వాత వాట్సాప్ ను ఓపెన్ చేయాలి. మెసేజ్ బాక్స్ లోకి వెళ్లి HI అని పంపించాలి.
⦿ కాసేపటి తర్వాత మీ వాట్సాప్ కు ఓ మెసేజ్ వస్తుంది.
⦿ ఈ మెసేజ్ లో PNR స్టేటస్, ఫుడ్ ఆర్డర్, రైలు కరెంట్ స్టేటస్ , రైలు షెడ్యూల్, కోచ్ ప్లేస్, రైల్వే ప్రయాణంలో ఫిర్యాదులు సహా రైల్వే అందించే పలు సర్వీసు వివరాలు డిస్ ప్లే అవుతాయి.
⦿ ప్రయాణీకులు కావాల్సిన సర్వీసును సెలక్ట్ చేసుకోవాలి.
⦿ ఆ తర్వాత లింక్ మీద క్లిక్ చేయడం వల్ల మీకు కావాల్సిన సర్వీసును పొందే అవకాశం ఉంటుంది.
Read Also:ఓడియమ్మ.. ఈ ఒక్క రైలు సంపాదనే అన్నికోట్లా? ఇది ఏ రూట్‌లో వెళ్తుందంటే…?
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు నడుపుతున్న సౌత్ సెంట్రల్ రైల్వే
ఇక ఉభయ రాష్ట్రాల్లో ప్రజలు అట్టహాసంగా జరుపుకునే సంక్రాంతి పండుగకు తెలుగు లోగిళ్లు ముస్తబవుతున్నాయి. ఉద్యోగాలు, ఉపాధి, వ్యాపార పనులలో భాగంగా హైదరాబాద్ సహా పలు నగరాల్లో పని చేస్తున్న వారంతా తమ సొంతూళ్లకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే సంస్థ సొంతూళ్లకు వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నది. పండుగ రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను షెడ్యూల్ చేయనున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్, చర్లపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి కాకినాడ, తిరుపతి, శ్రీకాకుళం, విజయవాడ, విశాఖపట్నం వరకు ఈ రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. సంక్రాంతి పండుగ కోసం మొత్తంగా 170కి పైగా రైలు సర్వీసులను అందుబాటులో ఉంచినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. సంక్రాంతి స్పెషల్ రైళ్లలో అడ్వాన్స్ డ్ రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు.
పొగ మంచు కారణంగా పలు రైళ్లు ఆలస్యం
పొగ మంచు కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని రైళ్లు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తీవ్రమైన పొగ మంచు కారణంగా రైళ్లు ముందుకు కదలలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Also: చర్లపల్లి రైల్వే స్టేషన్లో స్లీపింగ్ పాడ్స్.. ఇంతకీ వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?