Satyabhama Today Episode November 8th : నిన్నటి ఎపిసోడ్ లో.. సత్య భైరవికి భోజనం పైకి తీసుకొని రమ్మంటారా అని అడుగుతుంది. కానీ నాకేం కాలేదు నేను వస్తాను అని చెప్తాను. సత్య పిలవడంతో భైరవి కిందకు వస్తుంది.. అక్కడ అందరు భైరవిని చూసి నవ్వుతారు.. అందరిని సీరియస్ చూస్తుంది. ఇక సోకులకు పోయి నడ్డి విరగొట్టుకుందని భైరవిని మహదేవయ్యని నవ్వుతాడు. అందరూ నవ్వుతారు. భైరవి తినకుండా మిరే తినండి అని లేచి వెళ్లిపోతుంది.. నన్ను చూసి భయపడే వాళ్లు సత్య వల్ల నవ్వారు సత్యని వదలను అని భైరవి పంకజంతో చెప్తుంది. ఇక భోజనం వద్దని వచ్చేశారు ఆకలికి తట్టుకోలేరు కదా ఏం చేస్తారని పంకజం అడిగుతుంది.. పైకి వెళ్లి లడ్డులు తింటుంది. సత్యపై రివేంజ్ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్య క్రిష్ని నిద్ర లేపితే ముద్దు పెడితేనే లేస్తానని క్రిష్ అంటాడు. బాగా చెడిపోయావ్ అని క్రిష్ని అని సత్య మోటర్ వేయడానికి వెళ్తుంది. అయితే అప్పుడే కరెంట్ పోతుంది. భైరవి, పంకజం నవ్వుకుంటారు. కరెంట్ లేకపోవడంతో సత్య మోటర్ వేసినా షాక్ కొట్టదు.. అదేంటి అరుపులు వినపడలే అని అనుకుంటారు. సత్య లోపలికి వస్తుంది. పొంతన లేకుండా ప్రశ్నలు వేస్తుంది భైరవి.. మళ్లీ కవర్ చేస్తుంది. ఇక క్రిష్ ఏమైందని చూస్తే చూస్తే వంటింట్లో కరెంట్ ఉంటుంది తన గదిలో ఉండదు. ఏమైందని అనుకుంటాడు.. కిందకు రాగానే అక్కడ కరెంట్ లేదు. ఫ్యూజ్ పోయిందని చూసి ఫ్యూజ్ వేస్తాడు. ఇక సత్య పై మోటారు నువ్వే పాడు చేశావని అంటుంది. ఇక భైరవి సత్యను మోటార్ పోగొట్టావని తిడుతుంది.. అయ్యో అత్తయ్య నేనేం పోగొట్టలేదు.. రండి మీ ముందే వేస్తాను అని అంటుంది. ఇక భైరవి సత్యతో మోటార్ దగ్గరకు వెళ్తుంది.
అక్కడికి వెళ్లి సత్య మళ్లీ మోటార్ స్విచ్ ఆన్ చేస్తుంది. కానీ మోటర్ ఆన్ అవదు కనీసం సత్య కు షాక్ కూడా కొట్టదు. ఏమైందబ్బా అసలు షాక్ కొట్టాలి అని భైరవి పంకజం ఆలోచిస్తుంటారు. నన్ను ఊరికే అనడం కాదు అత్తయ్య, మీ ముందర వేసాను కదా మోటర్ పనిచేయలేదు అనేసి సత్య వాదిస్తుంది. దానికి భైరవి నీకు ఎంత పొగరు నన్నే నాతోనే గొడవ పెట్టుకుంటావా అని అంటుంది. నీవల్లే నా కూతురు దూరమైంది. పెద్ద కొడుకు జైలు పాలు అయ్యాడు అని సత్య పై గొడవకు దిగుతుంది. అప్పుడు పంకజం ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా ముందు మోటర్ గురించి ఆలోచించండి అని హింట్ ఇస్తుంది. నేను వేశాను మోటర్ పని చేయలేదు నాకు తెలియదు కావాలంటే మీరే టెస్ట్ చేసుకోండి అని సత్య లోపలికి వెళ్తుంది.
ఇక భైరవి మోటార్ స్విచ్ పనిచేయట్లేదు గా నేను ఒకసారి చెక్ చేస్తానని ఆన్ చేస్తుంది. క్రిష్ ఫ్యూజ్ పెట్టడం వల్ల మోటర్ ఆన్ అవుతుంది. ఇక అంతే బైరవికి షాక్ కొడుతుంది. అమ్మగారికి షాక్ కొట్టింది ఎవరైనా రండి అని గట్టిగా కేకలు వేస్తుంది పంకజం. అప్పుడే అందరూ అక్కడికి వస్తారు. ఆ కర్ర తీసుకొని కొట్టవే అని పంకజంతో జయ్యమ్మ అంటే లేదు నన్ను గుర్తు పెట్టుకొని కొడుతుంది అని అంటుంది. సత్యను ఆ కర్ర తో కొట్టవే అని జయమ్మ అంటే అత్తయ్యను నేను ఎలా కొడతాను అని అంటుంది. ఇక ఎవరు కొట్టకుంటే అది షాక్ తో పొయ్యేలా ఉందని అంటుంది. అప్పుడు సత్య కర్రతో బాదుతుంది. భైరవి కింద పడుతుంది.. అందరు నవ్వుకుంటారు. అప్పుడే అక్కడకు క్రిష్ వస్తాడు. మరో కొత్త గెటప్ వేసావా అని పంచులు వేస్తాడు.
ఇక హర్ష మాట్లాడట్లేదు అని వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడుకుంటారు. అప్పుడే కొరియర్ వస్తుంది. మైత్రి వీసా వస్తుంది. మైత్రి ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తుంది. హర్ష చదువే ఇంపార్టెంట్ తాను వెళ్తుంది అనగానే నందీని ఫుల్ ఖుషి అవుతుంది. ఇక భైరవిని డాక్టర్ చెక్ చేసి ఒక్కరోజు వాటర్, జ్యుస్ లు తాగాలని చెప్తుంది. ఇక భైరవికి బుద్ది రావాలని జయమ్మ బిరియాని తింటుంది. ఇక హర్షను వాళ్ళ అమ్మా నాన్న డబ్బులు ఎక్కడి వి అని అడుగుతారు. అక్కడి తో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..