BigTV English

Bad boys: ఈ కాలం అమ్మాయిలకు మంచి అబ్బాయిల కన్నా బ్యాడ్ బాయ్స్ ఎందుకు నచ్చుతారు?

Bad boys: ఈ కాలం అమ్మాయిలకు మంచి అబ్బాయిల కన్నా బ్యాడ్ బాయ్స్ ఎందుకు నచ్చుతారు?

Bad boys: అమ్మాయిలకు చెడ్డ అబ్బాయిలు ఎక్కువగా నచ్చుతారనే టాక్ వినిపిస్తూ ఉంటుంది. మంచి అబ్బాయిలను ఆడపిల్లలు ఎందుకు ఇష్టపడరు? రఫ్‌గా ఉండే అబ్బాయిల వైపే ఎందుకు ఆకర్షితులవుతారు? ఇలాంటి సందేహాలు ఎక్కువమందిలోనే ఉంటాయి. నిజమే చెడు అబ్బాయిలు అమ్మాయిల్ని ఎక్కువగానే ఆకర్షిస్తారు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.


రఫ్‌గా ఉండే అబ్బాయి తన మనసులోని మాటను చెప్పడానికి భయపడడు. ఏం చెప్పలనుకున్న తన పద్ధతిలో చెప్పేస్తాడు. దాన్ని హీరొయిజంగా భావిస్తారు అమ్మాయిలు. కానీ మంచి అబ్బాయిలు అమ్మాయిని నొప్పించకుండా ఏ పనైనా చేయాలనుకుంటారు. ఆమెను చూస్తూ గడిపేయాలనుకుంటారు. ఆమె ఇష్టపడితేనే మాట్లాడాలనుకుంటారు. కానీ అమ్మాయిలు అలా కోరుకోరు… తమకు ఇష్టం ఉన్న లేకపోయినా నేరుగా ధైర్యంగా వచ్చి మాట్లాడే అబ్బాయిల్ని ఇష్టపడతారు. అలా చేసేది మంచి లక్షణాలున్న అబ్బాయిలు కాదని అర్థం చేసుకోరు.

ముఖ్యంగా వారి వయసు కూడా హీరోయిజం చూపించే అబ్బాయిల్ని కోరుకుంటుంది. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకి ఏది మంచో, ఏది చెడో సరిగ్గా అంచనా వేసే శక్తి తక్కువగా ఉంటుంది. దాని వల్లనే వారు చెడు అబ్బాయిల వైపు ఆకర్షితులవాతారని చెప్పుకుంటారు.


సాధారణంగా అమ్మాయిలను సమాజం పద్ధతిగా ఉండాలని చెబుతుంది. తమలో లేని గుణం ఎదుటి అబ్బాయిలో కనిపించగానే ఆకర్షితులవుతారు. అమ్మాయిలు చేయలేని పనులు చెడు అబ్బాయిలు త్వరగా చేసేస్తారు. అలాంటి అబ్బాయిలతో డేటింగ్ చేసినప్పుడు అమ్మాయిల్లో అడ్రినలిన్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఆ హార్మోన్ కారణంగా కూడా అమ్మాయిలు చెడు అబ్బాయిల వైపు ఆకర్షితులవుతూ ఉంటారు.

సాహసోపేతంగా ఉండే అబ్బాయిలతోనే జీవితం బాగుంటుందని, ఎంజాయ్ మెంట్ ఎక్కువగా ఉంటుందని అమ్మాయిల్లో ఒక అభిప్రాయం ఉంది. అదే బ్యాడ్ బాయ్స్ ప్రేమలో అమ్మాయిలను పడేస్తుంది.

మంచి అబ్బాయిలు గొడవలకు, వాగ్వాదాలకు దూరంగా ఉంటారు. తమ పని తాము చేసుకుంటారు. కానీ బ్యాడ్ బాయ్స్ అలా కాదు, గొడవల్లో దూరడానికి ఆసక్తి చూపిస్తారు. తమ వాయిస్ ను గట్టిగా వినిపిస్తారు. ఇవన్నీ కూడా అమ్మాయిలకు హీరో లక్షణాల్లా కనిపిస్తాయి. ముఖ్యంగా వారు తమ స్నేహితులను, ప్రేయసిని కాపాడేందుకు ముందుంటారు. ఎవరైనా తమ ప్రేయసి వైపు చూస్తున్నట్టు కనిపెడితే చాలు వెళ్లి వారితో గొడవ పడతారు. ఇలాంటి పనులన్నీ మంచి అబ్బాయిలు చేయలేరు. అందుకే చెడు అబ్బాయిలు చేసే ఈ పనులను అమ్మాయిలకు ఆకర్షణగా ఉంటాయి.

మ్యాన్లీ నెస్ అంటే మగతనం. అమ్మాయిలు రఫ్‌గా, ఆధిపత్యం చెలాయిస్తూ, గొడవలు పడుతూ ఉండే అబ్బాయిల్ని మగవారిగా చూస్తూ ఉంటారు. అవి పురుష లక్షణాలుగా భావిస్తారు. ఎప్పుడైతే ఈ పురుష లక్షణాలను అమ్మాయిలు గుర్తిస్తారు. అవి లైంగిక ఆకర్షణగా మారిపోతాయి. దీనివల్లే అమ్మాయిలు వారికి ఆకర్షితులు అవుతూ ఉంటారు.

ముఖ్యంగా అమ్మాయిలు తమ ఋతుచక్రం సమయంలో ఎక్కువగా చెడు అబ్బాయిల వైపు ఆకర్షితులు అవుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ సమయంలో హార్మోన్ల మార్పులు కారణంగా చెడు అబ్బాయిల్లోని సాహసోపేతమైన లక్షణాలు వారికి నచ్చేస్తూ ఉంటాయి.

‘నువ్వు బయట బాగున్నావు.. కానీ ఫోటోల్లో మాత్రం బాగుండవ’, ‘మీ డైట్ గురించి చెప్తారా మేము కూడా ఇలా అందంగా తయారవుతాం’ ఇలాంటి ఫ్యాన్సీ డైలాగులను వేయడంలో బ్యాడ్ బాయ్స్ ముందుంటారు. అదే మంచి అబ్బాయిలు ఇలా మాట్లాడలేరు. వారు చాలా పద్ధతిగా అమ్మాయిలను చూస్తూ వారి వెనక అలా నడుస్తూ ఆనందపడిపోతూ ఉంటారు. కానీ బ్యాడ్ బాయ్స్ మాత్రం దూసుకెళ్లి అమ్మాయిలతో మాట్లాడతారు. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకి ఇలా దూకుడు స్వభావం ఉన్న అబ్బాయిలే నచ్చుతారు.

ఒక మంచి అబ్బాయి, ఒక అమ్మాయిని నిశ్శబ్దంగా ఆరాధిస్తాడు. తరగతి గదిలో ఒక మూల కూర్చొని ఆమెనే చూస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అవుతూ ఉంటాడు. ఆమె స్నేహితులను తన స్నేహితులుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయిని తప్ప మరొక అమ్మాయిని కలలో కూడా ఊహించుకోడు. కానీ అతడు చేసిన పనులేవీ అమ్మాయికి తెలియదు. కానీ బ్యాడ్ బాయ్స్ చేసిన పనులన్నీ అమ్మాయిల ముందే చేస్తారు. నేరుగా అమ్మాయిలతోనే మాట్లాడతారు. ఆ అమ్మాయి తమ కోసమే పుట్టినట్టు ప్రవర్తిస్తారు. ఇవన్నీ కూడా అమ్మాయిల మనసులో బలమైన ముద్రను వేస్తాయి. వారు నిద్రపోతున్నప్పుడు కూడా వారు చేసే పనులు మాటలే గుర్తొస్తాయి. ఇక ఆ అమ్మాయిని ప్రేమలో పడకుండా ఆపడం ఎవరి తరం కాదు.

Also Read: జిమ్‌లో ఆంటీతో ప్రేమ.. ఆమె భర్త కిల్లర్ అని తెలిస్తే? మరి.. ఆ రిలేషన్ నుంచి అతడు ఎలా భయటపడ్డాడు?

విచిత్రమైన విషయం ఏంటంటే ప్రేమించేటప్పుడు బ్యాడ్ బాయ్స్ ను కోరుకునే అమ్మాయిలు పెళ్లి అయ్యాక మాత్రం ఆ బ్యాడ్ బాయ్ మంచి వ్యక్తిగా మారిపోవాలని కోరుకుంటారు. పెళ్లికి ముందు చెడు పనులు చేసిన వ్యక్తి… పెళ్లయ్యాక మంత్రం మంచి పనులు చేయడం ఎలా చేస్తాడని మాత్రం ఆలోచించరు.

బ్యాడ్ బాయ్స్ చేసే పనులు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తాయి. వారి ప్రవర్తన బలంగా, దృఢంగా ఉంటుంది. ఇవి కూడా వారిని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది. బ్యాడ్ బాయ్స్ తిరుగుబాటు స్వభావం అమ్మాయిలకు సెక్సీ గా కనిపిస్తుంది. ఇది కూడా ఆడవాళ్లకు తెగ నచ్చేస్తుంది. అందుకే బ్యాడ్ బాయ్స్ కి అమ్మాయిలు త్వరగా పడిపోతారు.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×