E-Paper
Advertisement

Satyabhama Today Episode : భైరవి ప్లాన్ బయటపడుతుందా? క్రిష్, సత్యల మధ్య చిచ్చు పెట్టిన సంజు..

Satyabhama Today Episode : భైరవి ప్లాన్ బయటపడుతుందా? క్రిష్, సత్యల మధ్య చిచ్చు పెట్టిన సంజు..
Advertisement

Satyabhama Today Episode November 9th : నిన్నటి ఎపిసోడ్ లో.. సత్య పిలవడంతో భైరవి కిందకు వస్తుంది.. అక్కడ అందరు భైరవిని చూసి నవ్వుతారు.. అందరిని సీరియస్ గా చూస్తుంది. ఇక సోకులకు పోయి నడ్డి విరగొట్టుకుందని భైరవిని చూసి మహదేవయ్యని నవ్వుతాడు. జయమ్మ వేసే కౌంటర్లకు భైరవి తినకుండా మిరే తినండి అని లేచి వెళ్లిపోతుంది.. భోజనం వద్దని వచ్చేశారు ఆకలికి తట్టుకోలేరు కదా ఏం చేస్తారని పంకజం అడిగుతుంది.. పైకి వెళ్లి లడ్డులు తింటుంది. సత్యపై రివేంజ్ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఇక సత్య చేసిన వంటలను తీసుకురమ్మని చెబుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఉదయం పని చేసుకుంటూ పంకజం కనిపిస్తుంది. భైరవి రావడం చూసి అలెర్ట్ అయి అడుగుతుంది. ఏమైంది అమ్మా మీరు రెస్ట్ తీసుకోకుండా ఇలా వచ్చారు ఏంటి? మీరు కిందకు వచ్చారు. మీకు ఏదైనా అయితే మళ్లీ నేనే చావాలి అంటుంది. నేను మంచానికి ఉంటానా ఆ సత్య కు దెబ్బకు దెబ్బ తీర్చుకుంటాను అని అంటుంది. ఏం ప్లాన్ వేస్తున్నారని అంటే రా బయటకు చూద్దువు గాని అని మోటార్ స్విచ్ తో దానికి షాక్ కొట్టేలా చేస్తాను.. ఈ భైరవితోని పెట్టుకుంటేవాలంటే ఇక ముందు వణికిపోవాలి అని వైర్ కట్ చేస్తారు. అయితే అప్పుడే కరెంట్ పోతుంది. భైరవి, పంకజం నవ్వుకుంటారు. కరెంట్ లేకపోవడంతో సత్య మోటర్ వేసినా షాక్ కొట్టదు.. అదేంటి అరుపులు వినపడలే అని అనుకుంటారు. సత్య లోపలికి వస్తుంది. పొంతన లేకుండా ప్రశ్నలు వేస్తుంది భైరవి.. మళ్లీ కవర్ చేస్తుంది. ఇక క్రిష్ ఏమైందని చూస్తే చూస్తే వంటింట్లో కరెంట్ ఉంటుంది తన గదిలో ఉండదు. ఏమైందని అనుకుంటాడు.. కిందకు రాగానే అక్కడ కరెంట్ ఉంటుంది. ఇక్కడ ఉంది నా రూమ్ లో లేదు ఫ్యూజ్ పోయిందని చూసి ఫ్యూజ్ వేస్తాడు. ఇక సత్య పై మోటారు నువ్వే పాడు చేశావని అంటుంది భైరవి . ఇక భైరవి  సత్యను మోటార్ పోగొట్టావని తిడుతుంది.. అయ్యో అత్తయ్య నేనేం పోగొట్టలేదు.. రండి మీ ముందే వేస్తాను అని అంటుంది. ఇక భైరవి సత్యతో మోటార్ దగ్గరకు వెళ్తుంది.

Advertisement

అక్కడికి వెళ్లి సత్య మళ్లీ మోటార్ స్విచ్ ఆన్ చేస్తుంది. కానీ మోటర్ ఆన్ అవదు కనీసం సత్యకు షాక్ కూడా కొట్టదు. ఏమైందబ్బా అసలు షాక్ కొట్టాలి అని భైరవి పంకజం ఆలోచిస్తుంటారు. నన్ను ఊరికే అనడం కాదు అత్తయ్య, మీ ముందర వేసాను కదా.. అయినా మోటర్ పనిచేయలేదు.. నన్ను ఊరికే అనొద్దు అని అనగానే, భైరవి నీకు ఎంత పొగరు నన్నే నాతోనే గొడవ పెట్టుకుంటావా అని అంటుంది. నీవల్లే నా కూతురు దూరమైంది. పెద్ద కొడుకు జైలు పాలు అయ్యాడు అని సత్య పై గొడవకు దిగుతుంది. అప్పుడు పంకజం ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా ముందు మోటర్ గురించి ఆలోచించండి అని హింట్ ఇస్తుంది. నేను వేశాను మోటర్ పని చేయలేదు నాకు తెలియదు కావాలంటే మీరే టెస్ట్ చేసుకోండి అని సత్య లోపలికి వెళ్తుంది.

ఎలాగో పవర్ లేదు కదా నేను ఒకసారి నొక్కి చూస్తాను అని అనుకుంటుంది భైరవి.. ఒకసారి చెక్ చేస్తానని ఆన్ చేస్తుంది. క్రిష్ ఫ్యూజ్ పెట్టడం వల్ల మోటర్ ఆన్ అవుతుంది. ఇక అంతే బైరవికి షాక్ కొడుతుంది. అమ్మగారికి షాక్ కొట్టింది ఎవరైనా రండి అని గట్టిగా కేకలు వేస్తుంది  పంకజం. అప్పుడే అందరూ అక్కడికి వస్తారు. ఆ కర్ర తీసుకొని కొట్టవే అని పంకజంతో జయ్యమ్మ అంటే లేదు నన్ను గుర్తు పెట్టుకొని కొడుతుంది అని అంటుంది. సత్యను ఆ కర్రతో కొట్టవే అని జయమ్మ అంటే అత్తయ్యను నేను ఎలా కొడతాను అని అంటుంది. ఇక ఎవరు కొట్టకుంటే అది షాక్ తో పొయ్యేలా ఉందని అంటుంది. అప్పుడు సత్య కర్రతో బాదుతుంది. భైరవి కింద పడుతుంది.. అందరు నవ్వుకుంటారు. అప్పుడే అక్కడకు క్రిష్ వస్తాడు. మరో కొత్త గెటప్ వేసావా అని పంచులు వేస్తాడు.. ఇక భైరవిని లోపలికి తీసుకొని వెళ్దాం అని జయమ్మ అందరిని అంటుంది.

Advertisement

మైత్రి ప్రయాణానికి డబ్బుల కోసం నగలు ఇవ్వలేదు. దానికి ఫీల్ అవుతుంది. హర్ష మాట్లాడట్లేదు అని వాళ్ల అమ్మా నాన్న మాట్లాడుకుంటారు. అప్పుడే కొరియర్ వస్తుంది. మైత్రి వీసా వస్తుంది. మైత్రి ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తుంది. హర్ష చదువే ఇంపార్టెంట్ తాను వెళ్తుంది అనగానే నందీని ఫుల్ ఖుషి అవుతుంది. ఇక భైరవిని డాక్టర్ చెక్ చేసి ఒక్కరోజు వాటర్, జ్యుస్ లు తాగాలని చెప్తుంది. ఇక భైరవికి బుద్ది రావాలని జయమ్మ బిరియాని తింటుంది. ఇక హర్షను వాళ్ళ అమ్మా నాన్న డబ్బులు ఎక్కడివి అని అడుగుతారు.. దానికి హర్ష హ్యాండ్ లోన్ తీసుకున్నానని అంటారు. ఇక మైత్రి ఈ ట్రిప్ ను ఎలా క్యాన్సిల్ చేసుకోవాలా అని చూస్తుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Telugu Serials : సీరియల్స్ కు పేమెంట్ ఎలా ఇస్తారు..? అర్రె ఇన్నాళ్లు ఇది మిస్ అయ్యామా..?

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×