Brahmamudi serial today Episode: మెడలో హారం వేయనన్న రాజ్‌ను కావ్య బయటకు తీసుకెవెళ్లి తాను బొద్దింకలకు భయపడిని వీడియో చూపిస్తుంది. ఇప్పుడు మీరు నా మెడలో హారం వేయకపోతే ఈ వీడియో అందరికీ చూపించి మిమ్మల్నిచాలా ఫేమస్ చేస్తాను అంటూ కామెడీగా బ్లాక్ మెయిల్ చేస్తుంది. దీంతో రాజ్ నువ్వేమైనా చేసుకో కానీ నేను మాత్రం హారం వేయను అంటాడు. దీంతో కావ్య సరే అయితే అంటూ లోపలికి వెళ్తుంది. రాజ్ కంగారుగా దీని వాలకం చూస్తుంటే నిజంగానే అందరికి చూపించేలా ఉంది అనుకుని వెనకాలే పరుగెడతాడు. తల దించుకుని ఇంట్లోకి వచ్చిన కావ్యను చూసిన రుద్రాణి. వెటకారంగా మాట్లాడుతుంది.
ఏంటి ఏదో సాధిస్తానని రాజ్ ను బయటకు తీసుకెళ్లి చేతకాక తల వంచుకుని లోపలికి వస్తున్నావు అంటుంది అంటుంది. ఇంతల అపర్ణ కోపంగా ఏరా.. హారం వేయడానికి ఒప్పుకోలేదా..? పండగ రోజు కావ్యను బాధపెడతావా..? అంటూ నిలదీస్తుంది. రాజ్ మాత్రం పక్కకు తీసుకెళ్లి ఎంతో బతిమాలింది. నాలో మానవత్వం పాలు ఎక్కువ కాబట్టి ఒప్పేసుకున్నాను అంటాడు రాజ్. దీంతో కావ్య కొంటెగా చూస్తూ.. రాజ్‌ను అంతగా బతిమాలానా..? అంటుంది. దీంతో ఇప్పుడేంటి హారం నీ మెడలో వేయాలి.
వేస్తాను నాన్నమ్మ ఆ హారం ఇటువ్వు అని హారం తీసుకుని కావ్య మెడలో వేయడానికి వెళ్తాడు రాజ్. పక్కకు బాగానే జ్ఞానోదయం కలిగించినట్టు ఉన్నావు కావ్య. పక్కకు తీసుకెళ్లి ఏం చెప్పావు. అని అడుగుతుంది అపర్ణ. కావ్య సిగ్గుపడుతూ ఏదో చెప్పానులే అత్తయ్యా అంటుంది. ఇందిరాదేవి ముగ్గురిని ఒకేసారి హారం వేయమని చెప్తుంది. ముగ్గురు కలిసి హారం వేస్తారు. దీంతో చిన్నపాటి రొమాంటిక్ సన్నివేశం నడుస్తుంది.
ఇక కళ్యాణ్‌కు తనకు ఇష్టైమన రైటర్ పెన్ను గిఫ్టుగా ఇస్తుంది కావ్య. దీంతో అప్పు కళ్యాణ్ గురంచి చెప్తుంది. తన పేరుతో కాకుండా లక్ష్మీకాంత్ గారికి సినిమా పాటలు రాస్తున్నాడని.. అప్పు చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీలవుతారు. నువ్వు రాసిన ఒక పాట వినిపించమని అడుగుతారు. దీంతో కళ్యాణ్ అమ్మ పాట వినిపిస్తాడు. ఆ పాట విన్న ధాన్యలక్ష్మీ ఎమోషనల్ గా కళ్యాణ్ దగ్గరకు ఏడుస్తూ వెళ్లి పాట చాలా బాగుందని మెచ్చుకుంటుంది. ఇంతలో ప్రకాష్ తల్లి ప్రేమ ఎలా ఉంటుందో వాడికి బాగా తెలుసు. కానీ కొడుక్కి తల్లి మీద ఎంత ప్రేమ ఉంటుందో నువ్వు కూడా తెలుసుకుంటే బాగుంది ధాన్యం అని చెప్తాడు.
ప్రకాషం అంకుల్ టాఫిక్ డైవర్ట్ అవుతుంది. అందరం బయటకు వెళ్లి క్రాకర్స్ కాల్చుకుంటే బాగుంటుంది కదా.. అనగానే సరే అందరం వెళ్దాం పదండి అంటూ వెళ్లబోతుంటే రాజ్ నాకు భయం అంటూ అక్కడే నిలబడిపోతాడు. దీంతో కళ్యాణ్, రాహుల్ ఇద్దరు కలిసి రాజ్‌ను బయటకు లాక్కెళతారు. అందరూ కలిసి క్రాకర్స్ కాలుస్తుంటారు. వాటి శబ్దానికి రాజ్ భయపడుతుంటాడు. ఆ భయంతో కావ్యను గట్టిగా హగ్ చేసుకుంటాడు. వాళ్లిద్దరిని అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇంతలో ఇందిరాదేవి వచ్చి ఓరేయ్ అయిపోయిందిరా పేల్చడం కళ్లు తెరచి చూడు అంటుంది. రాజ్, కావ్య సిగ్గుగా తల దించుకుంటారు. ఇంతలో లోపల నుంచి రుద్రాణి వచ్చి బయట బాంబులేం కాలుస్తారు. లోపల టీవీలో ఇంకా పెద్ద బాంబు పేలుతుంది చూద్దురు కానీ రండి.. రండి చూడండి అంటూ అందరికీ టీవీలో కళ్యాణ్ ఆటో నడపడం గురించి అనామిక తయారు చేయించిన డాక్యుమెంటరీ వస్తుంది.
అది చూసి అందరూ షాక్ అవుతారు. ధాన్యలక్ష్మీ మాత్రం కోపంగా కళ్యాణ్ దగ్గరకు వెళ్లి కాలర్ పట్టుకుని తిడుతుంది. అరేయ్ ఇదా నువ్వు బతికే బతుకు. దీన్ని పోషించడానికి నువ్వు ఆటో నడుపుతున్నావా..? అంటూ నిలదీస్తుంది. కళ్యాణ్ మాత్రం కూల్ గా ఆవేశపడకు అమ్మ నేనేం తప్పు చేయడం లేదు. నిజాయితీగా బతుకుతున్నాను అని చెప్పగానే నిజాయితీ గురించి నాకు చెప్తున్నావా..? ఇంట్లో ఇన్ని కార్లు పెట్టుకుని వాటిని నడపడానికి డ్రైవర్లు పెట్టుకున్నాము. కానీ నువ్వు మాత్రం ఆటో నడుపుతున్నావా..? అంటూ
నీకేం గతి లేదు అనుకున్నావా..? నీ తరపున అడిగే దిక్కు లేదనుకున్నావా..? దీనికోసం దీన్ని మేమేదో అందలం ఎక్కించం అన్నట్టు అగ్గిపెట్టె లాంటి రూంలో ఎంత పేదరికం అనుభవిస్తున్నావో తెలుసా..? దరిద్రంలా పట్టుకుందేంటిరా నిన్ను ఇది అంటూ అప్పును కావ్యను స్వప్న తిడుతుంది ధాన్యలక్ష్మీ. దీంతో అందరి మధ్య పెద్ద గొడవ జరగుతుంది. అందరిని రాజ్ వారించి కళ్యాణ్‌ను అప్పుతో సహా ఇంటికి వచ్చేయమని అడుగుతాడు. అప్పును మా అమ్మ కోడలిగా అంగీకరించే వరకు రానని కళ్యాణ్ చెప్తాడు. దీంతో తాను చచ్చినా అప్పును కోడలిగా అంగీకరించననని.. ఇంతో అంతో డబ్బులు ఇచ్చి నువ్వే దాన్ని వదులుకోమని ధాన్యలక్ష్మీ చెప్పగానే కళ్యాన్ బాధగా నేను కూడా జీవితాంతం ఈ ఇంట్లో అడుగపెట్టను అంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.