BB Telugu 8 : బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ (Bigg Boss). ఇప్పటికే హిందీలో 18వ సీజన్ ప్రారంభమవగా.. తెలుగులో ఎనిమిదవ సీజన్ మొదలైంది. సెప్టెంబర్ ఒకటవ తేదీన చాలా అట్టహాసంగా ప్రారంభమైన ఈ షో.. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఎవరికి వారు తమ స్ట్రాటజీని ఉపయోగించి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ఎవరు ఊహించని విధంగా బిగ్ బాస్ సీజన్ 8 ఆరవ వారంలో మొత్తం 8 మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ ను.. అందులోనూ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి తీసుకొచ్చి, షో టిఆర్పి రేటింగ్ పెంచే ప్రయత్నం చేశారు. కానీ ఇది కాస్త బెడిసి కొట్టిందని చెప్పవచ్చు.
ముఖ్యంగా సీజన్ వన్ లో హరితేజ తన అద్భుతమైన ఆటతీరుతో, మంచి మనసుతో అందరిని ఆకట్టుకుంది. తోటి కంటెస్టెంట్స్ మన్ననలు కూడా పొందింది. కానీ ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. స్వార్ధ పూరితంగా ప్రవర్తించడం ఆమె అభిమానులకి కూడా నచ్చడం లేదు. కావాలనే తోటి కంటెస్టెంట్ యష్మీ ను టార్గెట్ చేస్తూ.. పగ తీర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు చూసే ఆడియన్స్ కి అనిపిస్తోంది. ఇక కాసేపు ఆమెను పక్కన పెడితే మరొకవైపు యష్మీ.. టాస్క్ విషయంలో తన స్ట్రాటజీ మొత్తం చూపించినా.. నామినేషన్స్ వచ్చేసరికి చంద్రముఖిలా మారిపోయి, తన గ్యాంగ్ ను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది అనే కామెంట్లు కూడా వినిపిస్తూ ఉంటాయి.
ఇక అలాగే పృథ్వి.. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదట్లో సోనియా ఆకులతో చాలా క్లోజ్ గా మూవ్ అయిన పృథ్వీ తో విష్ణు ప్రియ చాలా క్లోజ్ గా మూవ్ అవుతోంది. ఒప్పుకుంటే అతడిని ఇప్పుడే వివాహం చేసుకునేలా కనిపిస్తోంది ఆమె తీరు. అంతలా ప్రేమిస్తున్నా అతడు మాత్రం ఆమెను పట్టించుకోలేదు. దీనికి తోడు ఇద్దరి మధ్య టాస్క్ నిర్వహించినప్పుడు తన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టే విష్ణు ప్రియ.. పృథ్వి కోసం ఓడిపోయి, తోటి కంటెస్టెంట్స్ ఆగ్రహానికి గురైంది. విష్ణు ప్రియను వాడుకుంటున్నాడని, ఆమె ప్రేమను అతడు అంగీకరించలేకపోతున్నాడు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు టాస్క్ విషయంలో కూడా గౌతమ్ , నబీల్ తో ఆయన పడే గొడవలు చూస్తూ ఉంటే చూసేవారికి ఇలాంటి వాళ్ళు హౌస్ లో అవసరమా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక అందుకే ఈ ముగ్గురిని ఇప్పుడే ఎలిమినేట్ చేయాలనే డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఒకే వారం ముగ్గురిని ఎలిమినేట్ చేయడం కుదరదు. దీనికి తోడు టైటిల్ ఫేవర్ గా బరిలోకి దిగిన యష్మీ, పృథ్వి ని కూడా ఎలిమినేట్ చేయడం కుదరదు. ఇక మరొకవైపు హరితేజ తన ఆటతో అందరినీ మెప్పిస్తున్నప్పటికీ, ఆమె కన్నింగ్ ఆలోచనలు నెటిజన్స్ కి నచ్చడం లేదు అని సమాచారం. అలాగే ఈ వారం ఓటింగ్ లిస్ట్ చూసుకున్నట్లయితే లీస్ట్ లో హరితేజ ఉంది. దీంతో ఈవారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే పృథ్వీ , యష్మీ ,హరితేజ నెటిజన్స్ కి ఇరిటేషన్ తెప్పిస్తున్నారని, వీరి ముగ్గురిని ఎలిమినేట్ చేస్తే మిగతావారు తమ ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు మంచి టిఆర్పి రేటింగ్ ను షో సొంతం చేసుకుంటుంది అంటూ కామెంట్స్ వినిపిస్తాయి.