Keerthi Bhat: తెలుగు బుల్లితెర నటి కీర్తి భట్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె మనసిచ్చి చూడు అనే సీరియల్ ద్వారా ఆమె ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఈ సీరియల్ కీర్తికి మంచి గుర్తింపును తీసుకొచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుస సీరియల్లలో నటిస్తూ క్రేజ్ ని సంపాదించుకుంది. అంతే క్రేజ్ తో బిగ్ బాస్ లోకీ అడుగుపెట్టింది.. అక్కడ తన ఆట తీరు మాటతీరుతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. చివరి వరకు విన్నర్ అవ్వాలని పోరాడింది. కానీ టాప్ ఫైవ్ లో నిలిచి ఎలిమినేట్ అయింది. ప్రస్తుతం ఈమె వరసగా సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉంది.. అంతేకాదు అటు పలు యూట్యూబ్ ఛానల్స్ లోకి ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఓ బుల్లితెర షో గురించి సంచలన నిజాలను బయటపెట్టింది. నిజంగానే ఆ షోలో ఇంత జరుగుతుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఆమె ఏం చెప్పిందో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..
బిబి అవార్డ్స్ లో ఇదే జరిగేది..?
బిగ్ బాస్లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కంటెస్టెంట్లు ఆ తర్వాత స్టార్ మా లో ప్రసారమవుతున్న పలు ఈవెంట్లలో కనిపిస్తూ ఉంటారు. బీబీ జోడీ, బీబీ అవార్డ్స్ అంటూ పలు కార్యక్రమాలలో సందడి చేస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు కీర్తి ఈ షోలు గురించి సంచలన విషయాలను షేర్ చేసుకుంది. బిగ్‌బాస్ ఆరో సీజన్ ఫైనలిస్టుగా నిలిచింది. తాజాగా ఆమె టీవీ ఇండస్ట్రీలోని పరిస్థితి గురించి ఓపెన్ అయింది. బిగ్‌బాస్ 6 అయిపోయాక BB అవార్డ్స్ అని ఓ కార్యక్రమం చేశారు. అందులో టాప్ 3లో ఉన్న నేను, టాప్ 5లో ఉన్న రోహిత్ లేము.. అసలు మమ్మల్ని ఎందుకు పిలవలేదు అన్న ప్రశ్న మా ఇద్దరికీ వచ్చింది. నాకు అర్థమైన విషయం ఏంటంటే.. మూడు రూల్స్ కచ్చితంగా ఫాలో కావాలి. అలాగే నోటికొచ్చినట్లు మాట్లాడి కంటెంట్ క్రియేట్ చేయాలి. రెండు.. మోడ్రన్‌గా ఉండాలి, ఎక్స్‌పోజ్ చేయాలి.. అంతేకాదు కలర్ కూడా మంచిగా ఉండాలి అప్పుడే బుల్లితెరపై ప్రసారమవుతున్న షోలతో బిజీగా ఉంటారు అని సంచలన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈమె ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది.
Also Read:భారీగా పడిపోయిన కూలీ కలెక్షన్లు… రెండో రోజేకే బరిలో నుంచి తప్పుకుందా ?
కన్నీళ్లు పెట్టిస్తున్న కీర్తి స్టోరీ..
ఈమె పర్సనల్ లైఫ్ వింటే ఎవరికైన కన్నీళ్లు వస్తాయి.. ఒక ప్రమాదంలో ఆమె తన కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకుంది. ఒంటరిగా నిలబడి పోరాటం చేసింది. ఎంతో కస్టపడి ఇండస్ట్రీకి వచ్చింది.బిగ్ బాస్ కు వెళ్ళివచ్చాక అందరికి మరింత దగ్గరయింది. ఈ మధ్యనే కీర్తి.. తాను ప్రేమించిన వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుంది. ఇక ఆమె గతంలో ఎదుర్కున్న పరిస్థితిలు వింటే ఎవరికైన కన్నీరు రాకమానదు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకుంది. తనకు పిల్లలు పుట్టరన్న విషయాన్ని తెలిసి కూడా పెళ్లి చేసుకోవడానికి బాయ్ ఫ్రెండ్ రెడీ అయ్యాడంటూ ఒక వీడియోని అప్పట్లో సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ మేము పెళ్లి చేసుకోవట్లేదు అంటూ మరో వీడియోని షేర్ చేసింది. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు ఆసక్తికర సీరియల్లలో కీలకపాత్రలో నటిస్తుంది. అంతేకాదు కొన్ని సినిమాలలో కూడా నటించింది. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లేటెస్ట్ ఫోటోలతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.