BigTV English

Coolie Day2 Collection : భారీగా పడిపోయిన కూలీ కలెక్షన్లు… రెండో రోజేకే బరిలో నుంచి తప్పుకుందా ?

Coolie Day2 Collection : భారీగా పడిపోయిన కూలీ కలెక్షన్లు… రెండో రోజేకే బరిలో నుంచి తప్పుకుందా ?

Coolie collections : సూపర్ స్టార్ రజనీకాంత్, అక్కినేని నాగార్జున కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం కూలీ.. తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో అమీర్ ఖాన్‌, ఉపేంద్ర, సత్యరాజ్‌, సౌబిన్‌ షాహిర్‌ కీలక పాత్రలు పోషించడంతో ఈ మల్టీస్టారర్‌ మూవీ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తుందని అంతా ఊహించారు. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. ఆగస్టు 14న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్‌డ్‌ టాక్‌ వస్తోంది.. తమిళనాడులో మాత్రం ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. కలెక్షన్స్ కూడా ఎక్కువగానే వస్తున్నట్లు టాక్.. మొదటి రోజు భారీగా వసూళ్లను రాబడితే రెండోరోజు మాత్రం ఈ మూవీ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయని తెలుస్తుంది. మరి కూలీ మూవీ రెండు రోజులకు ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఒక్కసారి తెలుసుకుందాం..


వరల్డ్ వైడ్ గా రెండు రోజుల కలెక్షన్స్.. 

రజనీకాంత్‌కు తమిళనాడుతో సమానంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. దీంతో కూలీకి ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్‌ దక్కాయి. రెండో రోజు సెలవు దినం కావడంతో వసూళ్లు అదిరిపోతాయని అనుకున్నారు. కానీ ఈ మూవీకి రెండో రోజు రెస్పాన్స్ బాగా దక్కిందని టాక్ వినిపిస్తుంది. మరి కలెక్షన్స్ కూడా తగ్గినట్లు తెలుస్తుంది. కూలీకి మొదటి రోజు 68 కోట్ల నెట్ వచ్చింది. రెండో రోజు 116.50 కోట్లు వచ్చాయి. అంటే ఒక్క రెండో రోజు 48.5 కోట్ల నెట్ వచ్చింది. కూలీకి రెండో రోజు కలెక్షన్లు భారీగా తగ్గాయి. ఈ వీకెండ్ కలెక్షన్స్ భారీగా పెరుగుతాయని రజిని అభిమానులు అభిప్రాయపడ్డారు.. కానీ మొదటి రోజు కంటే రెండో రోజు దారుణంగా కలెక్షన్లను వసూలు చేయడంతో సినిమా 1000 కోట్ల క్లబ్ లోకి చేరుతుందా లేదా అని టెన్షన్ పడుతున్నారు. మరి ఈ వీకెండు ఈ మూవీ కలెక్షన్స్ ఏమాత్రం పెరుగుతాయో చూడాలి…


Also Read: తెలుగు రాష్ట్రాల్లో ‘కూలీ ‘ రికార్డ్ బ్రేక్.. ఏకంగా మిలియన్ క్రాస్..!

కూలీ ప్రీ బిజినెస్..

తమిళ హీరో అయినా రజినీకాంత్ కు తెలుగులో మంచి డిమాండ్ ఉంది. ఈయన తెలుగు చిత్రాల్లో కూడా నటించారు.. తాజాగా రజినీ, నాగార్జున కాంబినేషన్లో వచ్చిన కూలీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాల తో కలిపి కూలీకి రూ.370 కోట్ల భారీ బడ్జెట్‌ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వస్తున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సునీల్‌కు చెందిన ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 53 కోట్ల రూపాయలతో రైట్స్ ను సొంతం చేసుకున్నాడు. మొత్తం కలిపి 110 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ఇండస్ట్రీలో టాక్.. ఇప్పుడు చూస్తుంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు.. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.. 8 వారాలకు స్ట్రీమింగ్ కి రాబోతుంది.

Related News

Mass Jathara Release :చివరికి హీరో కూడా చింటూ అనేశాడు… ఫైనల్ గా మాస్ జాతర రిలీజ్ డేట్ వచ్చేసింది

Allu Sirish engagement : రూమర్స్ నిజమే.. ఎంగేజ్మెంట్ డేట్ ప్రకటించిన అల్లు శిరీష్.. ఎప్పుడంటే?

Actor Ajith Kumar: వింత వ్యాధితో బాధపడుతున్న అజిత్.. సరైన నిద్ర లేదంటూ?

The Raja Saab: ట్రైలర్ ఎఫెక్ట్… రాజాసాబ్ స్పెషల్ షో చూసిన ప్రభాస్… రియాక్షన్ ఏంటంటే ?

Boyapati Sreenu: అఖండ 2 విడుదలపై బోయపాటి క్లారిటీ … కథ మొత్తం దాని చుట్టే అంటూ!

Nagarjuna: ఢిల్లీ హైకోర్టులో నాగార్జునకి ఊరట.. వారిపై వేటు తప్పదా?

Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో బిగ్ ట్విస్ట్.. మేనేజన్ అరెస్ట్

IBomma Counter: బరాబర్ పైరసీ చేస్తాం… పోలీసులకు ఐ బొమ్మ స్ట్రాంగ్ కౌంటర్!

Big Stories

×