E-Paper
Advertisement

Actress Sirisha : పెళ్లి నరకం.. కన్నీళ్లు తెప్పిస్తున్న శిరీష స్టోరీ.. ఒక్కరోజుకు ఎంతంటే..?

Actress Sirisha : పెళ్లి నరకం.. కన్నీళ్లు తెప్పిస్తున్న శిరీష స్టోరీ.. ఒక్కరోజుకు ఎంతంటే..?
Advertisement

Actress Sirisha : ఈమధ్య సినిమాల హీరోయిన్ల కంటే సీరియల్ హీరోయిన్లకు ఎక్కువ డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే.. రెమ్యూనరేషన్ కూడా వీళ్ళకే ఎక్కువ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సీరియల్స్ లో నటించి బాగా పాపులర్ అయిన యాక్టర్స్ ఎంతోమంది ఉన్నారు. కొందరు స్టార్ ఇమేజ్ ను అందుకోవడంతో పాటుగా ఎన్నో కష్టాలను, కన్నీళ్లతో కడుపు నింపుకున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, సుఖాలు కామన్.. అసలు విషయానికొస్తే.. టీవీ సీరియల్ హీరోయిన్ శిరీష విడాకుల విషయం హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చి ఎన్నో విషయాలను బయట పెట్టింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న సీరియల్స్ కు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంత? ఇప్పుడు ఏ సీరియల్స్ చేస్తుందో ఒకసారి తెలుసుకుందాం..

భర్తతో విడాకులు అందుకే తీసుకుందా..?

మొగలిరేకులు సీరియల్ లో సింధు పాత్రలో నటించిన శిరీష మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సీరియల్ ఆమె నటనకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.. ఆ తర్వాత వరుసగా సినిమాలు, సీరియల్స్ చేస్తూ బిజీ అయ్యింది. స్వాతి చినుకులు, మనసు మమత, రాములమ్మ, నాతి చరామి, కాంచన గంగ, చెల్లెలి కాపురం వంటి సక్సెస్ఫుల్ సీరియల్స్ లో హీరోయిన్ గా నటించింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నటుడు నవీన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. వీరి కాపురానికి గుర్తుగా ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే ఇటీవల తన సోషల్ మీడియా  అకౌంట్ లో భరించలేని, కంట్రోల్ చేయలేని పరిస్థుతుల కారణంగా మేము వేర్వేరు దారులు ఎంచుకున్నాం. ఇలాంటి సమయంలో మీ అందరి మద్దతు మాకు చాలా అవసరం. అంటూ పోస్ట్ చేసింది. మనస్పర్థల కారణంగా విడిపోయారు.

Advertisement

Also Read :Guess The Actress: స్టార్ హీరోలకు చెల్లెలు.. ఇప్పుడేమో సినిమాలకు దూరం..గుర్తుపట్టారా..?

ఒక్కరోజుకు ఎంత తీసుకుంటుంది..? 

కొన్ని బంధాలు సగంలోనే దూరం అవుతాయి. అలాగే యాక్టర్స్ శిరీష పెళ్లి కూడా కొన్నేళ్ళకే పెటాకులు అయ్యింది. ప్రేమ పెళ్లి చేసుకున్నా సగంలోనే విడాకులు తీసుకుంటున్నారు. బుల్లితెర హీరోయిన్ శిరీష కూడా భర్తకు దూరంగా కొడుకుతో కలిసి జీవిస్తుంది. ఒకప్పుడు వరుసగా సీరియల్స్ చేసిన ఈమె కొన్నాళ్ళు తన నటనా జీవితానికి ముగింపు పలికింది. ఇప్పుడు మళ్లీ వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్ లో నటిస్తుంది. ఈమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈమె రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ అవుతుంది. ఒక్కో సీరియల్ కు 35 వేలు తీసుకుంటుందని సమాచారం.. ఒక సీరియల్ చేసేందుకు నెలకు లక్షల్లో తీసుకుంటుంది. ప్రస్తుతం స్టార్ మా తో పాటుగా జీ తెలుగులో కూడా పలు సీరియల్స్లలో నటిస్తూ వస్తుంది. ఇక ఫ్యూచర్లో రెండు పెళ్లి చేసుకుంటుందా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైన బాబు పుట్టాక విడిపోతే వాడి పరిస్థితి ఏంటి అని ఇప్పటికీ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు..

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×