E-Paper
Advertisement

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?
Advertisement

Serials vs Star Hero Movies:స్టార్ హీరోల సినిమాలకి ఒకప్పుడు ఎంత క్రేజ్ ఉండేదో చెప్పక్కర్లేదు.పలనా హీరో సినిమా థియేటర్ లోకి వస్తుందన్న న్యూస్ తెలిస్తే చాలు సినిమా కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసేవారు ఆడియన్స్ .కాని కాలం మారింది. స్టార్ సినిమా లైనా నెలరోజుల్లో OTT లకి వచ్చేస్తాయి లే అంటూ రిలాక్స్ అయిపోతున్నారు ఆడియన్స్.కానీ బుల్లితెరపై వచ్చే సీరియల్స్ ని మాత్రం అసలెక్కడా మిస్ కాకూడదు అంటూ సమయం కాగానే టీవీలకి అతుక్కుపోతున్నారు.

సినిమా చూడాలంటె ఒక యుద్ధం 

నిజం చెప్పాలంటే సినిమాలు ఇప్పుడు ఈజీగా టీవీలలోకి వచ్చేస్తున్నాయి.అదే సీరియల్స్ ఎప్పటి నుండో టీవీలలోకి ఎంట్రీ ఇచ్చేసి సెపరేట్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నాయి.ఇక వాటికి అలవాటు పడ్డ ఆడియన్స్ గడప దాటి థియేటర్ మొహాలు చూడాలంటే మహా బద్దకించేస్తున్నారు.పైగా టికెట్ ధరలు అమాంతం పెంచేయడం, పాప్ కార్న్ ధరలు ఆకాశంలో ఉండటం,ట్రాఫిక్ లో ఇరుక్కుంటే ఎప్పుడు ఇంటికి వస్తామో తెలీకపోవడం ..వెరసి సినిమా చూడాలంటె ఒక యుద్దాన్ని చేయాల్సివస్తుందన్న భావన ఆడియన్స్ లో బలంగా నాటుకుపోయింది.

Advertisement

మరో వైపు సినిమా చూడటం అనేదానిని ఆడియన్స్ మరో పనిలా ఫీల్ అవ్వాల్సి వస్తే, సీరియల్స్ అనేవి వారి రోజూ వారి కార్యకలాపాలలో ఇక భాగం అయిపోయింది.సీరియల్ మిస్ అయితే ఏదో కోల్పోయిన ఫీలింగ్ కలిగేంత.

ఏళ్ల తరబడి ఎంగేజ్ చేసే కాన్సెప్ట్స్

మరో వైపు సినిమాలు రెండు గంటల్లో కంప్లీట్ అయిపోయే ఎంటర్ టైన్ మెంట్ అయితే సీరియల్స్ ఏళ్ల తరబడి ఎంగేజ్ చేసే కాన్సెప్ట్స్ .రెండు గంటల్లో చూసి మర్చిపోయే సినిమాల కన్నా ఏళ్లకేళ్ళు మన మనస్సులో పాతుకుపోయే సీరియల్స్ కే ఆడియన్స్ జై కొడతారని స్పెషల్ గా చెప్పక్కర్లేదు.

Advertisement

పైగా మన ఇళ్ళల్లో జరిగే విషయాలనే సీరియల్లల్లో చూపిస్తుంటారు మేకర్స్.దీని వల్ల ఇంట్లోని కుటుంబ సభ్యులకి వాటిని ఈజీగా ఓన్ చేసుకుని తీరిగ్గా వాటి గురించి చర్చించుకునే అవకాశం ఉంటుంది.ముఖ్యంగా అత్తా కోడళ్ళ మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య పట్టింపులు, అక్కా,తమ్ముల మధ్య అనుబంధాలు వంటివాటిని ఎన్నింటినో బుల్లితెరపై చూపించడంతో ఫ్యామిలీస్ ఈజీగా కనెక్ట్ అయిపోతుంటారు.

ఏం జరుగుతుందా అంటూ ఒక ట్విస్ట్

ఇక వీటికి తోడు సీరియల్ చివర్లో రేపు ఏం జరుగుతుందా అంటూ ఒక ట్విస్ట్ మెయిన్ టెయిన్ చేస్తుండటంతో రేపటి ఎపిసోడ్ లో అసలు ఏం జరగుతుందా అన్న క్యూరియాసిటీ ఆడియన్స్ లో విపరీతంగా పెరిగిపోతుంది,అలా ఆ క్యూరియాసిటీ ప్రతీరోజు కలిగించడంలో మేకర్స్ సక్సెస్ కావడంతో కుటుంబాలకి కుటుంబాలు సీరియల్స్ కి మాహారాజ పోషకులుగా మారిన పరిస్థితి.

also read :పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

ఇంకెంత దూరం తీసికెళ్తాయో !

వీటికి తోడు సోషల్ మీడియా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడంతో సీరియల్స్ లోని కీలక సన్నివేశాలు మళ్ళీ మళ్ళీ ఆడియన్స్ ని పలకరించి అసలు వాటిని మరచిపోని స్థితికి తీసికెళ్ళిపోతున్నాయి.మొత్తానికి స్టార్ స్టేటస్ తర్వాత ముందు సీరియల్ స్టేటస్ అనే పరిస్థితికి వచ్చేశారు ఆడియన్స్. చూడాలి మరి ముందు ముందు ఈ సీరియల్స్ ఫ్యామిలీస్ ని ఇంకెంత దూరం తీసికెళ్తాయో !

Tags

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×