E-Paper
Advertisement

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!
Advertisement

Pawan Kalyan Assets:పవన్ కళ్యాణ్ ..పవన్ కళ్యాణ్ ..పవన్ కళ్యాణ్ ..ఇపుడు ఎక్కడ చూసినా,ఎక్కడ విన్నా ఈ పేరే. కారణం ఈ రోజు అంటేసెప్టెంబర్ 2న పవన్ తన బర్త్ డేని జరుపుకోవడమే.ఈరోజుతో 55వ ఏట పవన్ కళ్యాణ్ అడుగుపెడుతుండటంతో ఇపుడు సోషల్ మీడియా మొత్తం పవన్ నామస్మరణ చేస్తుంది.ఇక ఇదే క్రమంలో పవన్ కి సంబందించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇపుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.మరి పవన్ ఆస్తులు ఇవే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నఆ నెంబర్స్ ఏంటో, ఎంతో ఒకసారి మనమూ చూసేద్దామా !

ఆయన ఆస్తులు రూ.165 కోట్లు

వాస్తవానికి పవన్ ఆస్తులు ఇవే అంటూ రెండు రకాల నెంబర్స్ వినిపిస్తుండటం గమనార్హం. అవును.. పవన్ కళ్యాణ్ రెండేళ్ళ కిందట అంటే 2024లో పిఠాపురం ఎలక్షన్స్ లో పోటీ పడ్డప్పుడు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తులు రూ.165 కోట్లు ఉన్నట్టు తెలుస్తుంది.వీటిలో పవన్ కి హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ వంటి ప్రాంతాలలో ఇల్లు, స్తిరాస్తులతో పాటు, జన్వాడలో వ్యవసాయ పొలం, అలాగే గుంటూరు చుట్టు పక్కల స్తిరాస్తులు కూడా ఉన్నాయన్న టాక్ వినిపిస్తుంది. ఇంతే కాకుండా రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఒక బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్ కూడా ఉన్నట్టు సమాచారం.

Advertisement

also read :నాని ‘ప్యారడైజ్’ అసలు కథ ఇదేనా?

ఇక పవన్ కళ్యాణ్ కి వాహనాలు,అందునా బైక్స్ అంటే ఎంతిష్టమో చెప్పక్కర్లేదు.వాటి విషయానికే వస్తే పవన్ కళ్యాణ్ దగ్గర మొత్తం 11 వాహనాలు ఉన్నట్లు తెలుస్తుంది.వీటిలో రేంజ్ రోవర్‌తో పాటు హార్లీ డేవిడ్‌సన్ వంటి కాస్ట్లీ బైక్ కూడా ఉండటం విశేషం.అలా వీటి మొత్తం ధర దాదాపు 15కోట్లకి పైగానే ఉండొచ్చని సోషల్ మీడియాలో వినిపించే టాక్.

Advertisement

ఇక వీటితో పాటు వీరి బ్యాంకు డిపాజిట్ల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ పేరుతో దాదాపు రూ.18.48 కోట్లని,అలాగే ఆయన భార్య అన్నా లెజ్నోవా పేరుతో సుమారు రూ.కోటి రూపాయల బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు వినిపిస్తుంది.

పవన్ దాదాపు 400కోట్లకి యజమాని

అయితే పవన్ కళ్యాణ్ ఆస్తులపై మరో ఆసక్తి కరమైన నెంబర్ వినిపిస్తుంది.అవును ..పవన్ కళ్యాణ్ ఆస్తులు దాదాపు 400కోట్లకి పైనే ఉండొచ్చు అన్న మరో వార్త సోషల్ మీడియాలో తెగ హైలెట్ అవుతుంది. అఫిడవిట్ లలో ఆస్తులని వాటిని కొన్న ధర ప్రకారం అంచనా వేసిన ధరలని,కానీ వాటిని ప్రస్తుతం ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెట్ ధర ఆధారంగా నిర్ణయిస్తే మాత్రం వాటి ధర మరింత పెరిగిపోతుందని,అలా చూస్తే పవన్ దాదాపు 400కోట్లకి యజమాని అని వినిపిస్తుంది.

also read :టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

నిజానికి పవన్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వకముందే పెద్ద స్టార్ హీరో,పైగా సినిమాకి ఎంత లేదన్నా ఈజీగా 70, 80కోట్లు పుచ్చుకుంటాడు అన్న టాక్ ఉంది.కాబట్టి ఇన్నేళ్ళ ఈ జర్నీలో ఆ మాత్రం వెనకేయడంలో ఆశ్చర్యం లేదంటూ సపోర్ట్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్.

ఎలాంటి సంచలనాలని నమోదు చేస్తాడో !

ఇక పవన్ కెరీర్ విషయానికి వస్తే అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయితో ఎంట్రీ ఇచ్చి ఖుషీతో యూత్ అంతటిని ఫిదా చేసిన పవన్ గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ రికార్డ్ ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెల్సిందే.ఇక రీసెంట్ గా వచ్చిన ఓజితో ఏకంగా మూడొందల కోట్లని కొలగొట్టి అయామ్ బ్యాక్ అంటూ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. చూడాలి మరి వచ్చే ఏడు ఓజి2 తో పలకరిస్తానని మురిపిస్తున్న ఈ బర్త్ డే బాయ్ ఎలాంటి సంచలనాలని నమోదు చేస్తాడో !

Tags

Related News

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

Big Stories

Advertisement
×