E-Paper
Advertisement

రీఎంట్రీలో మరింత జోరు పెంచిన షాలిని.. ఆ నోటికి హద్దు అదుపు లేదా?

రీఎంట్రీలో మరింత జోరు పెంచిన షాలిని.. ఆ నోటికి హద్దు అదుపు లేదా?
Advertisement

Bigg Boss 10 Shalini:బిగ్ బాస్ సీజన్ 10లో మొదటివారం మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ఆర్జే చరణ్ ఎలిమినేట్ అయ్యి.. మళ్లీ హౌస్ లోకి వచ్చి సత్తా చాట లేక ఐదవ వారం ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆరవ వారం షాలిని ఎలిమినేట్ చేసినట్లు చూపించి, ఆ తర్వాత సీక్రెట్ రూమ్ కి పంపించారు. మళ్లీ హౌస్ లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ ఆదేశాలతో షాలిని బుధవారం రోజు హౌస్ లోకి సడన్గా రీఎంట్రీ ఇచ్చింది. దీంతో అందరూ సర్ప్రైజ్ అయ్యారు. ముఖ్యంగా రోహిత్ ఆమెను హగ్ చేసుకుని సంతోషంగా ఫీల్ అయ్యాడు. అయితే మరికొంతమంది మళ్లీ ఎందుకు వచ్చింది రా బాబు అనే రేంజ్ లో తలలు పట్టుకున్నారు.

రీ ఎంట్రీలో మరింత హద్దులు దాటిన షాలిని..

ఇకపోతే షాలిని రీఎంట్రీ ఇచ్చిందో లేదో అప్పుడే తన నోటికి పని చెప్పింది. టాస్క్ లో భాగంగా దక్షిపై విరుచుకు పడింది. అసభ్యంగా మాట్లాడబోయి తనను తాను కంట్రోల్ చేసుకున్నప్పటికీ.. కొన్నిసార్లు ఆమెను ఇతర సభ్యులు కంట్రోల్ చేయాల్సి వచ్చింది. ఇకపోతే మొదట్లో ఉన్నప్పుడే తన నోటికి హద్దు అదుపు లేకుండా పోయిందని చాలామంది బాధపడ్డారు. ఇక రీఎంట్రీలో రెచ్చిపోతుంటే అసలు ఆ నోటికి మూతపడదా అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

also read:ఆ భయమే నన్ను వెంటాడుతోంది.. రష్మిక బ్రతిమలాడడంపై విజయ్ షాకింగ్ రియాక్షన్!

కంటెస్టెంట్స్ ను మూడు భాగాలుగా విభజించిన బిగ్ బాస్..

ఇదిలా ఉండగా తాజాగా నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన గేమ్ విషయానికి వస్తే.. హౌస్ లోని సభ్యులను రెడ్, ఎల్లో, గ్రీన్ లెవెల్ గా విభజించారు బిగ్ బాస్. ఆడియన్స్ ఓటింగ్ ను బట్టి , ఆట తీరును బట్టి బిగ్ బాస్ కొంతమందిని రెడ్ లెవెల్ లో ,మరికొంతమందిని ఎల్లో లెవెల్ లో ఉంచారు. రెడ్ లెవెల్ లో ఉన్నవాళ్లు డేంజర్ జోన్ లో ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో ఝాన్సీ, రాంప్రసాద్ , రోహిత్, శ్వేత , సుధీర్, రామకృష్ణ, షాలిని, వంశీ రెడ్ లెవెల్ ఉన్నారు. త్రిగుణ్, నరేష్, వర్షిని, ముఖేష్ , దేబ్జాని , అమన్ శివ ఎల్లో జోన్లో ఉన్నారు. ఇక నెక్స్ట్ లెవెల్ గ్రీన్ గ్రీన్ కి చేరుకున్న వాళ్లకు బిగ్ బాస్ నుంచి మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

ఆటలో గెలిచిన రామ్ ప్రసాద్..

Advertisement

రెడ్ జోన్ లో ఉన్నవాళ్లు ఎల్లో జోన్ కి వెళ్లడానికి గట్టిగానే ప్రయత్నం చేశారు. ముందుగా బిగ్బాస్ వీరికి ఒక టాస్క్ ఇచ్చారు. ఒక సర్కిల్లో బోన్ లాంటి దాన్ని పెట్టి రెడ్ జోన్ లో ఉన్న సభ్యులు సర్కిల్ చుట్టూ నిలబడి బజర్ మోగినప్పుడు బోన్ ని దక్కించుకోవాలి. ఎవరైతే దాన్ని దక్కించుకుంటారో వాళ్ళు అక్కడ అమర్చిన బాక్స్లను బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. బ్రేక్ చేసినప్పుడు బాక్స్ నుంచి ఎల్లో కలర్ వస్తే.. వాళ్ళు ఆ గేమ్ నుంచి ఒకరిని లేదా ఇద్దరినీ బిగ్ బాస్ చెప్పినట్లు ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక గేమ్లో అందరూ బాగానే కష్టపడ్డారు. కానీ చివరికి రాంప్రసాద్, ఝాన్సీ మిగిలారు. ఇక ఫైనల్ రౌండ్ లో రాంప్రసాద్ విజయం సాధించి రెడ్ లెవెల్ నుండి ఎల్లో లెవెల్ కి వెళ్లిపోయారు.

Related News

బల ప్రదర్శన.. కళ్ళు తిరిగి పడిపోయిన వర్షిణి!

కంటెస్టెంట్స్ కి ఊహించని షాక్.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే!

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు క్లాస్ పీకిన మీనా.. బాలు గెలిచాడు.. రోహిణి దొరుకుతుందా..?

Podarillu Today Episode : కేశవకు షాక్.. మహా ప్లాన్ అదుర్స్.. ఫ్యామిలీ పార్టీ..

Karthika Deepam 2 Serial Today Episode October 22nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సుమిత్రతో చాలెంజ్ చేసి ఆఫీసుకు వెళ్లిన జ్యోత్స్న   

Illu Illalu Pillalu Today Episodes: వల్లి పై చందు సీరియస్.. చివర్లో భద్ర ట్విస్ట్.. మైండ్ బ్లాక్ అయ్యే సీన్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. ఆరాధ్య కోసం కన్నీళ్లు.. భానుమతికి స్ట్రాంగ్ వార్నింగ్..

Big Stories

Advertisement
×