E-Paper
Advertisement

సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా.. సీఎం చంద్రబాబుతో పవన్ అరగంట భేటీ, అసలు మేటరేంటి?

సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా.. సీఎం చంద్రబాబుతో పవన్ అరగంట భేటీ, అసలు మేటరేంటి?
Advertisement

Amaravati: ఏపీలో రాజకీయాలు పరిస్థితి అదిగో పులి అంటే.. ఇదిగో మేక అన్నచందంగా సాగుతున్నాయి. లోపల జరుగుతున్న ఒకటయితే.. బయట ప్రచారం మరోలా సాగుతోంది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు, ఎస్ఈసీ ఎన్నికలు వాయిదా వంటి నేపథ్యంలో గురువారం ఉదయం సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దాదాపు పావుగంట పాటు భేటీ అయ్యారు. ఎలాంటి సెక్యూరిటీ, కాన్వాయ్ లేకుండా సీఎం చంద్రబాబు నివాసానికి ఒంటరిగా వచ్చారు జనసేనాని. దీనిపై ప్రత్యర్థి వర్గం రకరకాలుగా ప్రచారం మొదలుపెట్టేసింది.

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు ఇంటికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లారు. సెక్యూరిటీ, తన కాన్వాయిని పవన్ కల్యాణ్ పక్కన పెట్టి వెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనిపై ప్రత్యర్థులు రకరకాలుగా స్టోరీలు అల్లేసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ తన పదవికి రాజీనామా చేశారని, అందుకే సెక్యూరిటీ, కాన్వాయ్‌ని పక్కన పెట్టేశారని ప్రచారం మొదలు పెట్టేసింది. ఉన్నట్లుండి సెక్యూరిటీ పక్కన పెట్టి డిప్యూటీ సీఎం రావటానికి కారణాలేంటి? అసలు ఏం జరుగుతోంది?

Advertisement

ఈ వ్యవహారంపై దీనిపై డిప్యూటీ సీఎం కార్యాలయం ఓ ప్రకటన చేసింది. అనధికార ఛానెల్ ద్వారా డిప్యూటీ సీఎం కార్యాలయం, గుర్తింపును దుర్వినియోగం ప్రజలను తప్పుదారి ఏ మాత్రం ఆమోద యోగ్యకాదని, ఇలాంటి వాటిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఈ నకిలీ ఛానెల్ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు తగిన చర్యలు చేపట్టామని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నకిలీ ఛానెల్ వార్తలు ప్రజలు ఏ మాత్రం పట్టించుకోవద్దని, తాజా వివరాల కోసం కార్యాలయం అధికారిక సోషల్ మీడియాను అనుసరించాలని అందులో పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబుతో దాదాపు అరగంట భేటీ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనేదానిపై చర్చించినట్టు తెలుస్తోంది. వివిధ అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. రెబెల్స్ నామినేషన్లు, ఎన్నికలను రీషెడ్యూల్ అంశం, మూడు పార్టీల మధ్య పొత్తులకు సంబంధించి చిన్న చిన్న విభేదాలు ఉండడంపైనా చర్చించినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది.

Advertisement

 

Related News

కూటమి మధ్య జెడ్పీ పీఠాలు పంపకాల మాటేంటి? ఈ సాయంత్రానికి ఓ కొలిక్కి, కిందిస్థాయిలో అయితే

హింసాత్మకంగా దేవరగట్టు కర్రల సమరం.. ఒకరు మృతి, 100కి పైగా గాయాలు

కూటమి పార్టీల జాయింట్ ప్రకటన.. ఎస్ఈసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం, కాకపోతే..

ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్

మేము తిరగబడితే తుమ్మలగుంట దాటి బయటకు రాలేవు! చెవిరెడ్డికి పులివర్తి నాని వార్నింగ్

నెల్లూరు రూరల్‌లో కూటమి హవా.. 8 స్థానాలు ఏకగ్రీవం, బరిలో డమ్మీలే!

అంతా డూప్‌తో బతకడమే వైసీపీ స్టైల్: ఆదినారాయణ రెడ్డి

Big Stories

Advertisement
×