E-Paper
Advertisement

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Shiva Jyothi:శివజ్యోతి..బుల్లితెరపై తనదైన తెలంగాణా యాసతో ఎంతో మందిని మంత్ర ముగ్డులని చేసిన ఈ యాంకర్ తెలీని వారెవరూ లేరంటే ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా ఎన్నో టీవీ షోలతో పాటు రియాలిటీ ప్రోగ్రామ్స్‌లో పాల్గొని తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెల్సిందే. ఇక ఇదే క్రమంలో తాజాగా షేర్ చేసిన పింక్ శారీ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

సాధారణంగా మోడ్రన్ డ్రెస్సులు, ట్రెండీ అవుట్‌ఫిట్స్‌లో దర్శనమిస్తు ఉంటుంది శివజ్యోతి.. కానీ ఈసారి పూర్తిగా సాంప్రదాయబద్ధమైన చీరకట్టులో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. పింక్ కలర్ శారీలో ఆమె లుక్ చూసేందుకు ఎంతో అందంగా, తెలుగు ఆడపడుచులా కనిపిస్తోంది.

Advertisement

ఇక ఈ పింక్ శారీకి తగ్గట్టు ఆమె వేసుకున్న స్టైలింగ్, ఆభరణాలు ఈ ఫొటోలకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయనే చెప్పాలి. ముఖ్యంగా ఆమె మెడలో ధరించిన భారీ హారం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ట్రెడిషనల్ జ్యువెలరీ టచ్ ఉన్న ఆ గోల్డ్ టోన్ హారం.. ఆమె సింపుల్ శారీ లుక్‌ను మార్చేసింది.

ఇక ఈ ట్రెడిషనల్ లుక్ కి ఒక కంప్లీషన్ తేవడానికి చెవులకు ట్రెడిషనల్ ఇయర్‌రింగ్స్, చేతులకు మంచి డిజైన్ గాజులు, శారీకి సరిపోయే పర్‌ఫెక్ట్ మేకప్‌తో తన అభిమానులని ఫిదా చేస్తుంది.ఇక పింక్ శారీకి గోల్డ్ టోన్ జ్యువెలరీ కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయిందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

ముఖ్యంగా కెమెరా ముందు ఎలాంటి ఆర్టిఫిషియల్ పోజులు లేకుండా, తన న్యాచురల్ స్మైల్ తో ఆమె ఇచ్చిన ఫోజులు ఫొటోల రిచ్‌నెస్‌ను మరింత పెంచాయనే చెప్పాలి.

ఇక శివజ్యోతి ఫొటోలు ఇలా షేర్ చేసిందో లేదో సోషల్ మీడియాలో లైకులు, కామెంట్ల వర్షం కురిపించారు ఫాలోవర్స్.‘చీరకట్టులో మీరు చాలా అందంగా ఉన్నారు’’,‘‘ఈ ట్రెడిషనల్ లుక్ అద్దిరిపోయింది’’ అంటూ అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మరికొంతమందైతే ఇలాంటి సాంప్రదాయ రూపంలో మరిన్ని ఫొటోషూట్లు చేయాలని కోరుతుండటం విశేషం.

ఇక శివజ్యోతి సోషల్ మీడియాలో ఎంతగా పాపులర్ కావడానికి కేవలం ఆమె గ్లామర్ మాత్రమే కారణం కాదు. తెరపై ఆమె మాట్లాడే తీరులోని సహజత్వం ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తాయి. అందుకే ఆమె ఏ చిన్న పోస్ట్ పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతుంటుంది.

మొత్తానికి మాటలతోనే కాకుండా తన ట్రెడిషనల్ అందాలతో కూడా శివజ్యోతి మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

Tags

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×