E-Paper
Advertisement

Big Tv Kissik Talks: కన్నీళ్లు తెప్పిస్తున్న శివ స్టోరీ.. ప్రియాంక జైన్ తో పెళ్లి పై క్లారిటీ…

Big Tv Kissik Talks: కన్నీళ్లు తెప్పిస్తున్న శివ స్టోరీ.. ప్రియాంక జైన్ తో పెళ్లి పై క్లారిటీ…
Advertisement

Big TV Kissik Talks: తెలుగు ఆడియన్స్ కి నిరంతరం ప్రపంచ వ్యాప్తంగా జరిగే వార్తలని అందించడమే కాకుండా సరికొత్త ప్రోగ్రామ్స్ తో ఎంటర్ టైన్ చేయడంలో ముందుంటుంది బిగ్ టీవీ.ఇక ఈ క్రమంలో ఎన్నో ప్రోగ్రామ్స్ ని మన ముందుకు తెచ్చిన ఈ చానెల్ తాజాగా కిస్సిక్ టాక్ షో తో మరింతగా అలరిస్తుంది. ఈ షోకి జబర్దస్త్ యాంకర్ వర్షా ఈ షో కి హోస్టుగా వ్యవహరిస్తున్న సంగతి తెల్సిందే.

జీవితంలో ఎదురైన ఎన్నో విషయాల గూర్చి

Advertisement

ఇక ఇప్పటికే ఈ షో ద్వారా ఏంటో మందిని ఇంటర్వ్యూ చేసిన వర్ష తాజాగా సీరియల్ యాక్టర్ శివ కుమార్ ని సరికొత్త ఇంటర్వ్యూతో మన ముందుకు తెచింది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు. ఈ ప్రోమో వీడియోలో భాగంగా తనకి గర్ల్ ఫ్రెండ్ ప్రియాంక జైన్ తో పెళ్లి ఎప్పుడనే విషయాలతో పాటు, తన జీవితంలో ఎదురైన ఎన్నో విషయాలను పంచుకున్నారు, జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, తనకి, తన తండ్రికి మధ్య జరిగిన చేదు సంఘటనల గురించి చెబుతూ ఎమోషనల్ అయిపోయాడు.

వేరే అమ్మాయిలని ఎందుకు చూడనంటే

Advertisement

తన తల్లి టీచర్ అవడం వల్ల తను అందరిని సర్, మేడం అని పిలవడం అలవాటు అయిందని, అందువల్లే తనకి ఎవరు దగ్గర అవడం కాని, తను ఎవరికీ దగ్గర అవడం జరగలేదని తెలిపాడు. అందువల్లే తనకి ఫ్రెండ్స్ ఎవరూ కాలేదని, తనకి ఉన్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ ప్రియాంక అని, తన మనసులో ఉన్న బాధ అయినా, సంతోషం అయినా తనతోనే పంచుకుంటానంటూ మనసులోని మాటని బయటపెట్టాడు. ప్రియాంకనే తనని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని, అలాంటిది తను వేరే వాళ్ళని ఎందుకు చూస్తానని యాంకర్ వర్ష అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పుకొచ్చాడు. ఏ అబ్బాయికి అయినా తన అమ్మలాంటి భార్య దొరకాలని, నాకు అచ్చం తన అమ్మలో ఉన్న లక్షణాలు కల ప్రియాంక తన భార్య కాబోతుందని ఆనందం వ్యక్తం చేశాడు.

గర్ల్ ఫ్రెండ్ ప్రియాంక జైన్ తో పెళ్లి ఎప్పుడంటే

ఇక ప్రియాంకతో పెళ్లి ఎప్పుడు, ఎలా జరగబోతుంది అన్న ప్రశ్నకి సమాధానంగా ఈ సంవత్సరం ఎట్ట పరిస్థితిల్లో పెళ్లి చేసుకోవాలని, అది కూడా ఉత్తరాఖండ్ లో ఉన్న త్రియుగి నారాయణ ఆలయంలో చేసుకోవాలని అనుకుంటున్నామని తెలిపాడు. శివ పార్వతులు అక్కడే పెళ్లి చేసుకున్నారని, తను శివ, ప్రియాంక తనకి పార్వతి కాబట్టి అక్కడే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేశాడు.

also read :ప్రెస్ మీట్లు పెట్టి ఏడవడం ఆపండి.. చేతకాకపోతే వ్యాపారం చూసుకోండి.. టాలీవుడ్ నిర్మాతలపై మధుర శ్రీధర్ ఫైర్!

ఇక తన జీవితంలో జరిగిన బ్రేకప్ గురించి చెబుతూ.. అబ్బాయిలకి ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఎంతో స్పెషల్ అని తనకి కూడా అలానే తెలిపాడు. ఇక ప్రేమలో ఈగో డేంజరసా లేక సైలెంట్ గా ఉంటె డేంజరసా అన్న ప్రశ్నకి సమాధానంగా అందరికి ఈగో అనేది చాలా కామన్ అని కానీ ప్రేమించిన అమ్మాయి ముందు ఈగో ఉండాల్సిన అవసరం లేదని, అమ్మాయిని ప్రేమించామంటే ఒకవేళ ఆ అమ్మాయి తప్పు ఉన్నా మనమే సారీ చెప్పాలని నేను అదే నేర్చుకున్నాని తెలిపాడు.

వేరే వాళ్ళ లైఫ్ తో ఆడుకునే అర్హత ఎవరికీ లేదు

ఇక అమ్మాయిల డ్రెస్సింగ్ స్టైల్ విషయానికి వస్తే ప్రతీ అమ్మాయికి సెల్ఫ్ గ్రోత్ అనేది ఉండాలని, పెళ్ళికి ముందు ఎలా ఉన్నారో అలాగే ఉండొచ్చని, వెస్ట్రన్ వేసుకోవద్దు, ట్రెడిషన్ డ్రెస్సులే వేసుకోవాలని తానేమీ ఫోర్స్ చేయనని అది వాళ్ళ ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రేమలో ఎవరిని ఎవరు చీట్ చేసే హక్కు ఎవరికీ లేదని, వారిని సంతోషంగా ఉంచలేకపోతే అసలు వాళ్ళ లైఫ్ లోకే వెళ్ళవద్దని, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం వేరే వాళ్ళ లైఫ్ తో ఆడుకునే అర్హత ఎవరికీ లేదంటూ కుండబద్దలు కొట్టేశాడు.

ఇక తన జీవితంలో జరిగిన చేదు సంఘటలని వివరిస్తూ… తన తల్లి స్కూల్ నుండి కాస్త ఆలస్యమైతే ఎక్కడికి వెళ్లావ్, ఎవరితో తిరుగుతున్నావ్ అంటూ టార్చర్ పెట్టేవాడంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు తన తల్లిని ఎందుకు రోజూ కొడతాడో అర్థం కాక బాధ పడేవాడినని ఎమోషనల్ అయిపోయాడు శివ కుమార్. తన నాన్నకి గుట్కా, సిగరెట్స్, లెక్కలేని అఫైర్స్.. ఇలా లేని చెడు అలవాటు లేదని, తన నాన్నవల్లే తన చెల్లికి అబ్బాయిలంటే విరక్తి పుట్టిందని చెప్పుకొచ్చాడు. కేవలం 20 రూపాయల కోసమే ఊరు ఊరంతా వినబడేలా గొడవ చేశాడని, ఆ టార్చర్ చూడలేక తల్లి, చెల్లితో పాటు తను కిరోసిన్ పోసి కాల్చుకుందాం అనుకునే లోపే తన అమ్మ వాళ్ళ స్టూడెంట్ అగ్గిపెట్టె లాగేసిందని చిన్నప్పటి చేదు జ్ఞాపకాల్ని తలుచుకొని ఎమోషనల్ అయిపోయాడు.

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో

ఇప్పటి వరకి తనకి తన నాన్న నుండి సరైన ప్రేమ దొరకలేదని, కాని తానెప్పుడు తన నాన్నతో మంచిగానే ఉండాలని కోరుకుంటానని, ఐ లవ్ యూ సో మచ్ నాన్న అంటూ మనసులో దాచుకున్న ప్రేమని ఇలా బయటపెట్టాడు. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ షో ద్వారా ఫస్ట్ టైమ్ చెబుతున్నానని, తనే దగ్గరుండి తన నాన్న నుండి తన అమ్మకి విడాకులు ఇప్పించేస్తానంటూ రివీల్ చేశాడు శివ కుమార్. ఎన్నో విషయాలను ఈ షో ద్వారా పంచుకున్నారు.. ప్రస్తుతం శివ కుమార్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Gundeninda GudiGantalu Today episode: పాపం మీనా… ప్రభావతి ఫుల్ హ్యాపీ.. మేనేజర్ కుట్రతో మీనా బలి..

Podarillu Today Episode : చక్రి ప్లాన్ చెడగొట్టిన నారాయణ.. చక్రి గిఫ్ట్ కు మహా ఫిదా.. దేవతలాగా ఉంది..

Illu Illalu Pillalu Today Episodes: హమ్మయ్య.. వల్లి కోరిక తీరింది.. భద్రకు ఫిట్టింగ్ పెట్టిన వల్లి.. ధీరజ్ కు షాక్..

Brahmamudi Serial Today Episode July 18th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు కోసం ధర్నాకు దిగిన ఇందు 

Intinti Ramayanam Today Episode: పల్లవికి ఘోర అవమానం.. అవనికి అడ్డంగా దొరికిన పల్లవి.. స్ట్రాంగ్ వార్నింగ్..

Podarillu Chakri : స్టైలిష్ లుక్ లో చక్రి.. ఏమున్నాడ్రా బాబు.. అమ్మాయిలు పడి చచ్చిపోరు..!

Illu illaalu pillalu Sukanya : ‘ ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ సుకన్య సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..? ఇదేం ట్విస్ట్..

Big Stories

Advertisement
×