E-Paper
Advertisement

ప్రెస్ మీట్లు పెట్టి ఏడవడం ఆపండి.. చేతకాకపోతే వ్యాపారం చూసుకోండి.. టాలీవుడ్ నిర్మాతలపై మధుర శ్రీధర్ ఫైర్!

ప్రెస్ మీట్లు పెట్టి ఏడవడం ఆపండి.. చేతకాకపోతే వ్యాపారం చూసుకోండి.. టాలీవుడ్ నిర్మాతలపై మధుర శ్రీధర్ ఫైర్!
Advertisement

Madhura Sridhar Reddy Comments: మధుర శ్రీధర్ రెడ్డి…మధుర ఆడియో ద్వారా ఎంతో పాపులర్ అయిన ఈయన తనదైన సినిమాలతో నిర్మాతగా, దర్శకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెల్సిందే. అయితే తాజాగా ఈయన నెట్టింట్లో చేసిన కొన్ని కామెంట్స్ ఇపుడు ఫిలిమ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయిపోయాయి. మాములుగానే వివాదాలకి దూరంగా ఉండే శ్రీధర్ రెడ్డి ఇండస్ట్రీలోని ప్రొడ్యూసర్స్, అండ్ డిస్టిబ్యూటర్స్ పై ఓ రేంజ్ లో ఫైర్ అవ్వడం గమనార్హం. ప్రస్తుతం ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న పరిస్థితులు, కొందరి ప్రవర్తనపై ఆయన చేసిన ఈ ట్వీట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

Advertisement

సినిమా రంగాన్ని కేవలం ఒక కళగానో లేదా తమ వ్యక్తిగత బాధలను వెళ్లగక్కే వేదికగానో చూడవద్దని మధుర శ్రీధర్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. వెండితెర వెనుక జరిగేది పక్కా వ్యాపారమని, ఏ బిజినెస్‌లోనైనా రిస్కులు, ఒత్తిడులు, ఆర్థిక నష్టాలు అనేవి చాలా సహజమైన విషయాలని ఆయన స్పష్టం చేశారు. ఒక వ్యాపారంలోకి అడుగుపెట్టేటప్పుడు లాభనష్టాల అంచనాలు, రాబోయే సవాళ్లను ముందే పూర్తిగా అర్థం చేసుకుని రావాలే తప్ప, ప్రతి చిన్న విషయానికి పరిశ్రమ అతలాకుతలం అయిపోతోందనే రేంజ్‌లో బిల్డప్ ఇవ్వడం ఏమాత్రం సరికాదని హితవు పలికారు. నిజంగా ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవనిపిస్తే, సినిమా బిజినెస్ చేయడం చేతకాకపోతే సినిమాలు తీయడం ఆపేయాలని చెప్పుకొచ్చారు.

గౌరవంగా బయటకు వెళ్లిపోవాలి 

Advertisement

పరిశ్రమ నుంచి గౌరవంగా బయటకు వెళ్లిపోవాలే తప్ప.. ప్రతిసారి మీడియా ముందుకు, మైకుల ముందుకు వచ్చి సమస్యలు ఉన్నాయి అంటూ ఏడవడం అస్సలు బాలేదని తీవ్రంగా తప్పుపట్టారు. ఇలా పదే పదే బహిరంగంగా విలపించడం వల్ల ఇండస్ట్రీ పరువు పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేదో ప్రపంచాన్ని కుదిపేస్తున్న అతిపెద్ద సమస్య అయినట్టు, లేదా దేశం మొత్తం ఎదుర్కొంటున్న ఒక ఊహించని మహా సంక్షోభం అయినట్టు కొందరు మైకుల ముందు ప్రవర్తించే తీరు చూస్తుంటే తనకు నవ్వొస్తోందని సెటైర్ వదిలారు.

also read :హాస్టల్ లైఫ్ బ్యాక్‌డ్రాప్‌లో క్రేజీ కామెడీ ఎంటర్‌టైనర్.. ఘనంగా ప్రారంభమైన ‘లఫూట్ గ్యాంగ్’!

సినిమా అనేది ఒక కమర్షియల్ బిజినెస్ అని, ఇది ఎంతమాత్రం ఛారిటీ లేదా స్వచ్ఛంద సంస్థ కాదని అందరూ గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఇండస్ట్రీలో కొనసాగాలనుకుంటే కథలను నమ్మి సిన్సియర్‌గా సినిమాలు తీయాలని సలహా ఇచ్చారు.
ఒకవేళ ఇక్కడ మీ ఐడియాలు, మీ బిజినెస్ ప్లాన్లు వర్కౌట్ అయితే హ్యాపీగా ఇండస్ట్రీలో ఉండవచ్చని, ఒకవేళ ఇక్కడ వర్కౌట్ కాకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బయటికి వెళ్లిపోయి వేరే ఏదైనా లాభసాటి బిజినెస్ చేసుకోవడం ఉత్తమమని సూచించారు.

సినిమాకి ప్రేక్షకుల్లో ఒక మంచి స్థానం

ఒక సినిమాలో నష్టం వస్తే, ఆ నష్టాన్ని తట్టుకుని నిలబడే ఆర్థిక శక్తి మరియు ధైర్యం ఉంటేనే ఇంకో సినిమా తీయడానికి డేర్ చేయాలని, లేదంటే సైలెంట్‌గా ఆగిపోవడమే మంచిదని రియాలిటీని వివరించారు.మీ కంపెనీ సమస్యలు, మీ వ్యక్తిగత ఆర్థిక ఇబ్బందులు లేదా మీ అంతర్గత కలహాలు అన్నింటినీ తీసుకొచ్చి సినిమా ప్రాజెక్ట్‌పై రుద్దకండి అని శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. సినిమా ఒక అద్భుతమైన మీడియం అని, దాన్ని బాధల వేదికగా మార్చొద్దని కోరారు. సిన్సియర్‌గా సినిమాలు తీస్తే, ప్రతి మంచి సినిమాకి ప్రేక్షకుల్లో ఒక మంచి స్థానం తప్పకుండా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కామెంట్స్ పై ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో

గతంలో ‘స్నేహగీతం’, ‘ఇట్స్ మై లవ్ స్టోరీ’, ‘బ్యాక్‌బెంచ్ స్టూడెంట్’ వంటి యూత్‌ఫుల్ చిత్రాలతో దర్శకుడిగా మెప్పించిన మధుర శ్రీధర్, ఆ తర్వాత ‘లేడీస్ అండ్ జెంటిల్‌మెన్’, ‘ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్’, ‘దొరసాని’, ‘ఏబీసీడీ’ వంటి వైవిధ్యమైన చిత్రాలకు నిర్మాతగా, సహ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెల్సిందే.

also read :జోయా అఖ్తర్ ఆఫీస్‌లో భారీ చోరీ.. ఏకంగా 66 హార్డ్ డిస్క్‌లు మాయం, కోట్లలో నష్టం!

సినిమా మేకింగ్ మరియు డిస్ట్రిబ్యూషన్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ మధ్య కాలంలో థియేటర్ల వ్యవస్థ, ఓటీటీ బిజినెస్, ప్రొడక్షన్ కాస్ట్స్ విషయంలో కొందరు నిర్మాతలు ప్రెస్ మీట్లు పెట్టి చేస్తున్న హడావుడిని ఉద్దేశించే మధుర శ్రీధర్ రెడ్డి ఇలా రియాక్ట్ అయినట్టు ఫిలిం నగర్ టాక్. చూడాలి మరి మధుర శ్రీధర్ చేసిన ఈ కామెంట్స్ పై ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో !

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×