E-Paper
Advertisement

ఫుడ్ లవర్స్‌కు క్రేజీ ఆఫర్.. SBI ఎటర్నల్ కార్డ్ లాంచ్.. ఉచితంగా జొమాటో గోల్డ్ సేవలు!

ఫుడ్ లవర్స్‌కు క్రేజీ ఆఫర్.. SBI ఎటర్నల్ కార్డ్ లాంచ్.. ఉచితంగా జొమాటో గోల్డ్ సేవలు!
Advertisement

Eternal SBI Card: పండుగ సీజన్ వచ్చిందంటే చాలు.. ఫుడ్ డెలివరీలు, క్విక్ కామర్స్ కొనుగోళ్లు, షాపింగ్, వినోద కార్యక్రమాల కోసం ఖర్చులు విపరీతంగా పెరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఊరటనిచ్చేలా ప్రముఖ ఆర్థిక సంస్థ ‘ఎస్‌బీఐ కార్డ్’ (SBI Card), గతంలో జొమాటో లిమిటెడ్‌గా ఉన్న ‘ఎటర్నల్ లిమిటెడ్’ (Eternal Limited) సంస్థతో కలిసి ఓ సరికొత్త కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చాయి.

ఈ ‘ఎటర్నల్ ఎస్‌బీఐ కార్డ్’ (Eternal SBI Card) ద్వారా జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్, బిస్ట్రో ప్లాట్‌ఫారమ్‌లపై యూజర్లకు డిస్కౌంట్లు లభించనున్నాయి. అంతేకాకుండా ఉబర్, ఐక్సిగో, అర్బన్ కంపెనీ, అపోలో 24/7 వంటి సర్వీసులపై క్యాష్‌బ్యాక్ కూడా ఆఫర్ చేయనున్నారు. పండుగ వేళ గ్యాదరింగ్‌లు, షాపింగ్, సినిమా ప్లాన్ చేసుకునేవారికి ఈ కార్డ్ మంచి ప్రయోజనకరంగా ఉంటుందని ఎస్ బీఐ, ఎటర్నల్ ప్రతినిధులు పేర్కొంటున్నారు.

Advertisement

ఈ ఎటర్నల్ క్రెడిట్ కార్డ్ ద్వారా జొమాటో, డిస్ట్రిక్ట్, బిస్ట్రోలలో చేసే అర్హత గల లావాదేవీలపై నేరుగా 10% డిస్కౌంట్ లభించనుంది. ఇక బ్లింకిట్‌లో ఎలక్ట్రానిక్స్, బ్యూటీ ప్రొడక్ట్స్‌పై 10% డిస్కౌంట్ ఇస్తుండగా.. మిగతా కేటగిరీల కొనుగోళ్లపై 5% డిస్కౌంట్ వర్తిస్తుంది. అయితే పొగాకు ఉత్పత్తులు, పసిపిల్లల ఆహారం, గోల్డ్, సిల్వర్ వంటి ఖరీదైన ఆభరణాల కొనుగోళ్లకు ఈ ఆఫర్ వర్తించదని నిర్వాహకులు తెలిపారు.

కాగా, ఎటర్నల్ కార్డుపై జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్, బిస్ట్రోలలో కలిపి ప్రతి నెలా గరిష్టంగా రూ. 2,000 వరకు మాత్రమే డిస్కౌంట్ పొందడానికి అవకాశం ఉంది. వీటితో పాటు డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా ప్రతి నెలా ‘1+1’ మూవీ టికెట్ ఆఫర్‌ను కూడా వినియోగించుకోవచ్చు. అయితే రెండో టికెట్‌పై లభించే డిస్కౌంట్ గరిష్టంగా రూ. 200 వరకు మాత్రమే ఉండనుంది.

Advertisement

ఈ క్రెడిట్ కార్డ్ జాయినింగ్ ఫీజును రూ. 499గా నిర్ణయించారు. దీనికి బహుమతిగా ఆరు నెలల పాటు ఉచిత జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్ లభిస్తుంది. అటు గత సంవత్సరంలో కార్డ్‌దారుడు రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేసి ఉంటే, వార్షిక ఫీజుపై రాయితీ లభించనుంది. అలాగే ప్రతి స్టేట్‌మెంట్ సైకిల్‌లో రూ. 200 వరకు 1% ఫ్యూయల్ సర్ఛార్జ్ మినహాయింపు కూడా లభిస్తుంది.

Also Read: అమ్మబాబోయ్.. 75 ఏళ్ల తాతతో 30 ఏళ్ల యువతి పెళ్లి.. నిశ్చితార్థం వీడియో వైరల్!

ఈ సందర్భంగా ఎస్‌బీఐ కార్డ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సలిలా పాండే మాట్లాడుతూ.. వినియోగదారుల రోజువారీ అవసరాలకు తగినట్లుగా ఈ ప్రొడక్ట్‌ను డిజైన్ చేశామని, ఇది మెరుగైన క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను అందిస్తుందని తెలిపారు. అలాగే ఎటర్నల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అక్షాంత్ గోయల్ మాట్లాడుతూ.. ప్రతిరోజూ చేసే లావాదేవీల ద్వారా వినియోగదారులకు గరిష్ట ప్రయోజనం అందించేలా ఈ కార్డ్ ను రూపొందించినట్లు స్పష్టం చేశారు. కాగా, ప్రస్తుతం వినియోగదారులు జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్ యాప్‌ల ద్వారా ఈ కార్డ్ కోసం ముందస్తు దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Tags

Related News

బంగారం-వెండి వస్తువుల ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

చిన్న వయసులోనే కోటీశ్వరుడు అవ్వడం ఎలా? ఇదిగో అత్యుత్తమ ప్లాన్.. రూ.10 వేలు ఉంటే చాలు!

పోటీకి మేం సిద్ధమే.. మస్క్ ఆరోపణలపై రిలయన్స్ స్ట్రాంగ్ కౌంటర్

మధ్యతరగతి రిటైర్మెంట్ కోసం రూ.1 కోటి సరిపోతుందా? భవిష్యత్తు కోసం మేజిక్ ఫిగర్ ఎంత?

భార్య లోన్ కట్టకపోతే భర్త పెన్షన్ డబ్బులు కట్ చేసిన బ్యాంక్.. కోర్టు తీర్పు ఇదే

తప్పుడు అకౌంట్‌కు యూపీఐ మనీ ట్రాన్స్‌ఫర్ అయిందా? డబ్బులు వెనక్కి రావాలంటే ఇలా చేయండి!

డబ్బులు కావాలని ఫోన్ చేస్తే.. బంధువులు, స్నేహితులకు ‘నో’ చెప్పడం ఎలా?

Big Stories

Advertisement
×