E-Paper
Advertisement

ప్రేమిస్తే పంచాయతీ పెట్టి పరువు తీసే ఊరు… నిజ ఘటనల ఆధారంగా తెరకెక్కిన తెలుగు ప్రేమకథ… క్లైమాక్స్ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే

ప్రేమిస్తే పంచాయతీ పెట్టి పరువు తీసే ఊరు… నిజ ఘటనల ఆధారంగా తెరకెక్కిన తెలుగు ప్రేమకథ… క్లైమాక్స్ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే
Advertisement

Telugu Romantic Drama OTT : చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తే… ఆ ప్రేమను కుటుంబాలు, గ్రామాల మధ్య ఉన్న విభేదాలు అడ్డుకుంటే… తమకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్న యువతీ యువకులకు సమాజమే శత్రువుగా మారితే… ప్రేమను అర్థం చేసుకోవాల్సిన పెద్దలే ఆ జంట జీవితాల్లో సమస్యలు సృష్టిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి ? ఇలా గ్రామీణ నేపథ్యం, ప్రేమ, కుటుంబాల మధ్య విభేదాల చుట్టూ సాగే తెలుగు చిత్రం ‘కాగితం పడవలు’ (Kaagitham Padavalu). మరి ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో ఎక్కడ అందుబాటులో ఉందనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

రాము, గోదావరి చిన్నప్పటి నుంచి ఒకరికొకరు బాగా తెలుసు. ఒకే స్కూల్ లో చదువుకుంటారు. కాలక్రమంలో వారి మధ్య స్నేహం ప్రేమగా మారుతుంది. నిజానికి ముందుగా గోదావరి అతన్ని దూరం పెడుతుంది. కానీ రామూ నిజమైన ప్రేమను అర్థం చేసుకున్న తరువాత దగ్గరవుతుంది. అయితే వీరిద్దరి గ్రామాల మధ్య ఉన్న విభేదాలు, కుటుంబాల ఆలోచనలే వారి ప్రేమకు అడ్డంకులుగా నిలుస్తాయి. తమ మనసులోని భావాలను అర్థం చేసుకుని కలిసి జీవించాలని రాము, గోదావరి కోరుకుంటారు. కానీ ప్రేమ అనేది ఇద్దరి వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదన్నట్లుగా చుట్టూ ఉన్నవారు వారి జీవితాల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెడతారు.

Advertisement

ఇదే సమయంలో వారి స్నేహితుల జీవితాల్లోనూ ప్రేమకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. ప్రేమించిన వ్యక్తిని ఎంచుకునే స్వేచ్ఛకు బదులుగా కుటుంబ గౌరవం, ఊరి పరువు వంటి విషయాలకే పెద్దలు ప్రాధాన్యం ఇస్తారు. దీంతో రాము, గోదావరి ఫ్రెండ్స్ లో ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్న జంట ఆత్మహత్యకు పాల్పడతారు.

మరి ఈ పరిస్థితుల్లో హీరో హీరోయిన్ తమ ప్రేమను నిలబెట్టుకోవాలంటే కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిందేనా ? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఇద్దరూ తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోగలరా ? గ్రామాల మధ్య ఉన్న విభేదాలు వారి జీవితాలను ఎటువైపు నడిపిస్తాయి ? అనేవే కథలోని ప్రధాన అంశాలు. ప్రేమకథతో పాటు కుటుంబాల మధ్య సంఘర్షణను చూపించే ఈ చిత్రంలో యువత నిర్ణయాలు, పెద్దల ఆలోచనల మధ్య ఉన్న అంతరాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు.

Advertisement

Also Read : ఛారిటీ పార్టీకి వెళ్లిన స్టార్‌ హీరో… అగ్నిపర్వతం దగ్గర బలి… ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్ ను డోంట్ మిస్

ఓటీటీలో తెలుగులోనే స్ట్రీమింగ్

‘కాగితం పడవలు’ మూవీ ఇదే ఏడాది సెప్టెంబర్‌ 18న థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఈ సినిమా సన్ నెక్స్ట్ (Sun nxt) ఓటీటీలోకి వచ్చింది. తెలుగు సినిమానే కాబట్టి తెలుగులో నిశ్చింతగా చూడవచ్చు. ఇందులో వర్ధన్‌ గుర్రాల (Vardhan Gurrala), కృష్ణప్రియ (Krishna Priya) ప్రధాన పాత్రల్లో నటించగా, ఎంజీఆర్‌ తుకారాం (MGR Thukaram) దర్శకత్వం వహించారు. ప్రేమకథలు, కుటుంబ భావోద్వేగాలతో సాగే తెలుగు సినిమాలు ఇష్టపడేవారు ఈ చిత్రాన్ని ఓసారి చూడవచ్చు.

Tags

Related News

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

బాబోయ్… రోడ్డుపై రచ్చ ఇంత డేంజరా ? మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

ప్రేమ, పగ మధ్య నలిగిపోయే గ్యాంగ్‌స్టర్‌… వెన్నులో వణుకు పుట్టించే ఊచకోత… తెలుగులో తమిళ యాక్షన్ డ్రామా

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ సినిమాలు.. ఒకేరోజు ఏకంగా 10 స్ట్రీమింగ్..!

ప్రాణాలను పణంగా పెట్టి ఎవరెస్ట్ ఎక్కిన రియల్ హీరో… చరిత్ర మర్చిపోయిన అసలైన వీరుడి ఎపిక్ స్టోరీ… చూస్తే గూస్‌బంప్స్ గ్యారెంటీ

ఛారిటీ పార్టీకి వెళ్లిన స్టార్‌ హీరో… అగ్నిపర్వతం దగ్గర బలి… ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్ ను డోంట్ మిస్

30 ఏళ్ల క్రితం మాయమైన చేపల పడవ మళ్లీ ప్రత్యక్షం…. మైండ్ బెండింగ్ మిస్టరీ

Big Stories

Advertisement
×