E-Paper
Advertisement

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!
Advertisement

Ariyana Glory: ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అరియానా (Ariyana Glory) ఇటీవల హిజ్రాల గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. “ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుంటాము. అంత కష్టంతో కట్టుకున్న ఇంటి గృహప్రవేశాన్ని.. అంతే సంతోషంగా జరుపుకుంటాము.. ఆ సంతోషాన్ని పాడు చేయడానికి కొంతమంది హిజ్రాలు వచ్చి డబ్బులు కావాలని డిమాండ్ చేయడం మనసుకు కష్టాన్ని కలిగిస్తోంది” అంటూ తన ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అరియానా అసహనం.. క్షమాపణలు కోరిన వర్షిత..

అయితే అరియానా చేసిన కామెంట్లకు కొంతమంది ట్రాన్స్ జెండర్స్ తమ అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాల ద్వారా స్పందిస్తూ.. ఆమెకు క్షమాపణలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే యూట్యూబర్ గా మంచి పేరు సొంతం చేసుకున్న ట్రాన్స్ జెండర్ వర్షిత (Varshitha )తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక వీడియో విడుదల చేసింది. అందులో ఆమె మాట్లాడుతూ.. “రీసెంట్ గా బిగ్ బాస్ ఫేమ్ అరియానా గారు తన ఇంటి గృహప్రవేశానికి వచ్చిన మా ట్రాన్స్ కమ్యూనిటీ పీపుల్స్ కొంతమంది.. ఇచ్చింది తీసుకోకుండా ఇబ్బంది పెట్టారు అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు.. దీనికి మా ట్రాన్స్ కమ్యూనిటీ పీపుల్స్ తరఫున నేను క్షమాపణలు చెబుతున్నాను..

ట్రాన్స్ కమ్యూనిటీ మొత్తాన్ని అనడం తీసుకోలేకపోతున్నాము – వర్షిత

Advertisement

ఒకటైతే చెప్పగలుగుతాను అందరూ ఒకేలా ఉండరు.. ఎవరో ఒక ట్రాన్స్ జెండర్ ఎక్కడో తప్పు చేయడం వల్ల.. మీ ట్రాన్స్ కమ్యూనిటీ అందరూ ఇలాంటి వాళ్ళే అని మాపై నింద వేయడం చాలా బాధాకరం. ఇలాంటి ఎన్నో సంఘటనలు మమ్మల్ని మరింత బాధించాయి. అందుకు నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను. మా ట్రాన్స్ కమ్యూనిటీ పీపుల్స్ కి ఎంత చెప్పినా కొంతమంది ఇలాంటి అరాచకాలు చేస్తూనే ఉన్నారు. ఒక అమ్మాయి తప్పు చేస్తే అమ్మాయినే నిందిస్తారు.. ఒక అబ్బాయిని తప్పు చేస్తే ఆ అబ్బాయినే నిందిస్తారు.. కానీ ఒక ట్రాన్స్ తప్పు చేస్తే మొత్తం ట్రాన్స్ కమ్యూనిటీనే నిందిస్తున్నారు. మీకు ఎక్కడైనా అలాంటి వాళ్ళు కనిపిస్తే వెంటనే పోలీసులకు ఫోన్ చేసి, వారిపై యాక్షన్ తీసుకోమని చెప్పండి. అంతేకానీ ఇలా మా ట్రాన్స్ కమ్యూనిటీ మొత్తాన్ని నిందించడాన్ని మేము తీసుకోలేకపోతున్నాం.. మాలో కూడా నీతి నిజాయితీగా ఉంటూ.. ఇచ్చింది తీసుకొని.. ప్రేమానురాగాలు పంచేవాళ్ళు చాలామంది ఉన్నాము.. దయచేసి అందరిని అనకండి” అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు.

ALSO READ:అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

ట్రాన్స్ కమ్యూనిటీ పీపుల్స్ కి స్నేహ వార్నింగ్..

Advertisement

ఇకపోతే ఇదే విషయంపై మరో ట్రాన్స్ జెండర్ స్నేహ వరంగల్ (Sneha Warangal) కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. “ఎక్కడో ఒకరు తప్పు చేయడం వల్ల మొత్తం ట్రాన్స్ కమ్యూనిటీ పైనే నింద వేస్తున్నారు. కాబట్టి ట్రాన్స్ బాయ్స్ మీరు ఎక్కడైనా సరే దయచేసి ఇలా తప్పుగా ప్రవర్తించకండి. మీ ప్రవర్తన మొత్తం కమ్యూనిటీనే తప్పుదోవ పట్టించేలా చేస్తోంది. ఒకరిని ఏదైనా అడిగేటప్పుడు ఆచితూచి అడగడం కానీ, ఏదైనా ఫంక్షన్ జరిగేటప్పుడు ఆ ఇంటి వాళ్లతో పద్ధతిగా మాట్లాడి , వాళ్ళు ఇచ్చేది ఏదైతే ఉందో అర్థం చేసుకొని దానిని సంతోషంగా స్వీకరించండి. ట్రాన్స్ జెండర్స్ దీవెనలు చాలా గొప్పవి .. దయచేసి అర్థం చేసుకోండి”.. అంటూ కామెంట్ చేశారు.

?utm_source=ig_web_copy_link&igsi=MzRlODBiNWFlZA==

?utm_source=ig_web_copy_link&igsi=MzRlODBiNWFlZA==

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×