E-Paper
Advertisement

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?
Advertisement

Kamakshi Bhaskarla: సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అనే విషయం అందరికీ తెలిసిందే. సినిమా అవకాశాల కోసం కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే సెలబ్రిటీలు ఈ విధమైనటువంటి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అంటూ ఇప్పటికే ఎంతోమంది ముద్దుగుమ్మలు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా మరొక హీరోయిన్ సైతం ఇండస్ట్రీలో అడిగే కమిట్మెంట్స్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

సింపుల్ గా ఇంకేంటి అని అడుగుతారు..

పొలిమేర (Polimera)సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla)వృత్తిపరంగా డాక్టర్ అయినప్పటికీ సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చారు. ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా కామాక్షి భాస్కర్ల ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఈమె ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్(Tollywood) సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్(Casting couch) ఉందని తెలిపారు. నిర్మాతలు చాలా ఈజీగా ఇంకేంటి? మరేంటి? అంటూనే కమిట్మెంట్స్ అడుగుతారని ఈమె తెలిపారు.

కొత్త వాళ్లను మాయ చేస్తుంటారు..

Advertisement

ఇండస్ట్రీ లోకి చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు ఇన్వెస్టర్స్ పేరుతో వచ్చి కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే అమ్మాయిలను ఇబ్బంది పెడుతుంటారని తెలిపారు. నిజానికి వాళ్లు నిర్మాతలు కాదు, వాళ్లకు వాళ్లే నిర్మాతలని చెప్పుకొని తిరుగుతుంటారు. ఎవరైతే ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంటారో అలాంటి వారిని మాయ చేస్తూ కమిట్మెంట్స్ అడుగుతారని కామాక్షి భాస్కర్ల వెల్లడించారు. కమిట్మెంట్స్ గురించి నేరుగా కాకుండా ఇంకేంటి? అని మాత్రమే అడుగుతూ కొత్తవారిని ఇబ్బందులు పెడుతుంటారని ఈమె తెలిపారు.

మూడు సంవత్సరాలకు అర్థం తెలిసింది..

కమిట్మెంట్ అనే పదానికి ఇండస్ట్రీలో వేరే అర్థం ఉందనే విషయం తెలియకుండా నేను దాదాపు మూడు సంవత్సరాలు పాటు ఇండస్ట్రీలో ఉన్నానని కామాక్షి వెల్లడించారు. కెరియర్ మొదట్లో ఎవరైనా అడిగితే తాను చాలా కమిటెడ్ గా పని చేస్తానని చెప్పేదాన్నని , అయితే ఆ పదానికి అర్థం ఇండస్ట్రీలో మరొకటి ఉందని నేను తరువాత తెలుసుకున్నాను అంటూ ఈమె తెలియజేశారు. ఇకపోతే ఇండస్ట్రీలో ఇదివరకే ఎంతోమంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ గురించి పలు సందర్భాలలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇలా కమిట్మెంట్స్ అడుగుతారని ఎంతోమంది సెలబ్రిటీలు చెప్పినప్పటికీ వారిని ఇబ్బందులకు గురిచేసిన వారి పేర్లను మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. తాజాగా కామాక్షి భాస్కర్ల కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

Advertisement

Also Read: ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

Related News

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

Big Stories

Advertisement
×