E-Paper
Advertisement

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!
Advertisement

Rashmika mandanna:చిత్ర పరిశ్రమలో తనదైన కథా ఎంపికలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ.. అందం, అభినయంతో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకుంది రష్మిక మందన్న (Rashmika mandanna). నేడు భారతీయ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు దక్కించుకున్న ఈమె.. ఇన్నేళ్ల కెరియర్లో ఎన్నో రికార్డులు నెలకొల్పి.. అందరి దృష్టిని ఆకట్టుకుంది. అలాంటి ఈమె ఖాతాలో ఇప్పుడు మరో ఘనత వచ్చి చేరడం నిజంగా ప్రశంసనీయం.

రష్మిక ఖాతాలో మరో అరుదైన ఘనత..

పుష్ప సిరీస్ తో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న(Rashmika mandanna).. యానిమాల్, పుష్ప 2, ఛావా, సికందర్, గర్ల్ ఫ్రెండ్ ఇలా వరుస చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలలో నటిస్తూ జోరు పెంచింది. విషయంలోకి వెళ్తే.. ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే వెలువరించిన సెప్టెంబర్ 2 కు సంబంధించి.. ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ ర్యాంకింగ్స్ లో ఏకంగా అగ్రస్థానంలో నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. భారతీయుల అభిమాన కథానాయికగా తన కెరియర్ లోనే ఒక అరుదైన మైలురాయిని అందుకుంది. గత నాలుగేళ్లుగా ఈ లిస్టులో మొదటి స్థానంలో ఉన్న బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే(Deepika Padukone)ను కూడా రష్మిక మందన్న వెనక్కి నిటారు.

ఈ అరుదైన ఘనతకు అదే కారణమా?

Advertisement

భాషతో సంబంధం లేకుండా జోనర్ కే పరిమితం కాకుండా వరుస హిట్స్, సక్సెస్ రేట్, విస్తరిస్తున్న ప్రాబల్యంతో రష్మిక ఈ ఘనత అందుకున్నారు.. ముఖ్యంగా టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు.. విభిన్నమైన జోనర్ లను ఎంచుకొని ప్రేక్షకులను అలరించారు రష్మిక మందన్న.

ALSO READ:అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

దీపికా స్థానం ఎంత?

Advertisement

ఇకపోతే ఇన్నేళ్లుగా మొదటి స్థానంలో నిలిచిన దీపిక పదుకొనే రెండవ స్థానానికి పరిమితం కాగా.. మూడవ స్థానంలో శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor), నాలుగవ స్థానంలో సాయి పల్లవి(Sai Pallavi), ఐదవ స్థానంలో అలియా భట్ (Alia Bhatt) నిలిచారు. ఈ టాప్ ఫైవ్ లో ఇద్దరు దక్షిణాది హీరోయిన్లు ఉండడం.. బాలీవుడ్ పై సౌత్ డామినేషన్ ను తెలియజేస్తోందని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు.

రష్మిక మందన్న సినిమాలు..

రవీంద్ర పుల్లె (Rawindra pulle) దర్శకత్వంలో రష్మిక మందన్న నటిస్తున్న యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిం మైసా.. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే యాక్షన్ స్టంట్స్ చేస్తుండగా.. ఒక్కసారిగా కాలు తుంటి భాగంలో గాయం కాగా.. గత నెల రోజులకు పైగా రష్మిక మందన్న విశ్రాంతి తీసుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ సెట్ లో ఆమె పాల్గొనబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించింది కూడా.. మరొకవైపు ఈ చిత్రాన్ని నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంతోపాటు తన భర్త విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో కలిసి వివాహం తర్వాత చేస్తున్న తొలి చిత్రం రణబాలి. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మొదట సెప్టెంబర్ 11న విడుదల చేయాల్సి ఉండగా.. సినిమా షూటింగ్ ఆలస్యం కారణంగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 16 కు వాయిదా వేశారు. మరి ఈ రెండు చిత్రాలు రష్మిక కెరియర్ కు ఏ విధంగా ఉపయోగపడతాయో చూడాలి.

Related News

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

Big Stories

Advertisement
×