E-Paper
Advertisement

Sonia Yash: సోనియా యష్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. రెండు తరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి!

Sonia Yash: సోనియా యష్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. రెండు తరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి!
Advertisement

Soniya Yash: సోనియా తెలుగు బుల్లితెర సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ సంచలనాత్మక దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎంతో మంది హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇలా రాంగోపాల్ వర్మ హీరోయిన్ల జాబితాలో సోనియా (Soniya)కూడా ఒకరు. పలు సినిమాలలో హీరోయిన్ గా నటించిన సోనియా అనంతరం సినిమాలకు దూరమవుతూ వచ్చారు. అయితే ఈమెకు బిగ్ బాస్ కార్యక్రమంలో అవకాశం లభించడంతో ఎంతో మంది తెలుగు బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. ఇలా బిగ్ బాస్ తర్వాత సోనియా పెద్దగా ఇండస్ట్రీలో కనిపించలేదని చెప్పాలి.

ఏడు కంపెనీలకు సీఈవో..

బిగ్ బాస్ కార్యక్రమం పూర్తి అయ్యేసరికి ఈమె యష్ (Yash) అనే వ్యక్తితో వివాహం జరుపుకున్నారు. ఇక పెళ్లి తర్వాత ఈమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అవుతూ వచ్చారు. తన భర్త వ్యాపారాలను చూసుకుంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక యష్ కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా విదేశాలలో కూడా వ్యాపారాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈయన పలు వ్యాపారాలను నిర్వహిస్తూ బిజినెస్ మెన్ గా ఎంతో బిజీగా గడుపుతున్నారు ఇప్పటివరకు ఏడు కంపెనీలను ఈయన రన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఏడు కంపెనీలకు సీఈఓగా  బాధ్యతలు తీసుకొని తన వ్యాపారాలను విస్తరిస్తూ వెళ్తున్నారు.

లెక్కపెట్టలేనంత ఆస్తి..

Advertisement

ఒకవైపు బిజినెస్ ద్వారా భారీ స్థాయిలో డబ్బు సంపాదిస్తూనే మరోవైపు ఎన్జీవో సంస్థలను ప్రారంభించి సామాజిక సేవ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. వృత్తిపరంగా ఎంతో బిజీగా ఉన్న యష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన ఆస్తులకు సంబంధించిన విషయాలను బయటపెట్టారు. ఏడు కంపెనీలకు సీఈవో అయినటువంటి యష్ ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లు ఉంటుంది అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు యష్ సమాధానం చెబుతూ తనకు ఎంత ఆస్తి ఉందనే విషయాన్ని ఇప్పటి వరకు లెక్కపట్టలేదు కానీ, నా తర్వాత మరో రెండు తరాలు తిని కూర్చున్న తరగని ఆస్తి సంపాదించాను అంటూ ఈయన షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.

శిఖ అనే చిన్నారి..

Advertisement

ఇలా రెండు తరాలు తిని కూర్చోవడానికి సరిపడే ఆస్తి అంటే వేలకోట్లలోనే ఈయన ఆస్తులు ఉన్నాయని స్పష్టమవుతుంది.. ఇలా ఈ స్థాయిలో సంపాదించినప్పటికీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక యష్ సోనియాను పెళ్లి చేసుకోవడంతో ఈ దంపతులకు ఒక కుమార్తె జన్మించిన విషయం తెలిసిందే. ఈ చిన్నారికి శిఖ అని నామకరణం కూడా చేశారు. ఇక సోనియా యశ్ కు రెండో భార్య కావడం గమనార్హం . తన మొదటి భార్యకు ఒక కుమారుడు కూడా ఉన్నారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోవడంతో ఈయన అనంతరం సోనియాను రెండో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఈ దంపతులకు ఓ కుమార్తె జన్మించారు. ఇలా సోనియా దంపతులు ఒకవైపు కుటుంబ వ్యవహారాలను చూసుకుంటూ మరోవైపు వ్యాపారాలను కూడా చూసుకుంటూ కెరియర్ పరంగా బిజీగా గడుపుతున్నారు.

Also Read: Soniya Yash: మేము చనిపోతే మాడెడ్ బాడీ వారికే సొంతం.. సోనియా యష్ గొప్ప నిర్ణయం..గ్రేట్ అంటూ!

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×