E-Paper
Advertisement

India vs Netherlands: నెద‌ర్లాండ్స్ ఘోర ఓట‌మి, వ‌రుస‌గా 4 విజ‌యాల‌తో టీమిండియా రికార్డు

India vs Netherlands: నెద‌ర్లాండ్స్ ఘోర ఓట‌మి, వ‌రుస‌గా 4 విజ‌యాల‌తో టీమిండియా రికార్డు
Advertisement

India vs Netherlands: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026) నేపథ్యంలో టీమిండియా మరో విజయాన్ని నమోదు చేసుకుంది. గ్రూప్ స్టేజిలో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడిన టీమిండియా నాలుగింటిలో కూడా విజయం సాధించింది. ఇప్పటికే సూపర్ 8లోకి దూసుకు వెళ్లిన టీమిండియా, బుధవారం నెదర్లాండ్స్ తో మ్యాచ్ ఆడింది. ఈ సందర్భంగా నెదర్లాండ్స్ జట్టును చిత్తు చేసింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా విధించిన 194 లక్ష్యాన్ని చేదించలేక చేతులెత్తేసింది నెదర్లాండ్స్. ఎంత పోరాడిన టీమిండియా బౌలర్ల దాటికి, నెదర్లాండ్స్ తేలిపోయింది. ఈ నేపథ్యంలోనే నిర్ణీత 20 ఓవర్లు ఆడిన నెదర్లాండ్స్, కేవలం 176 పరుగులు సాధించి, 7 వికెట్లు న‌ష్ట‌పోయింది. ఈ త‌రుణంలోనే దీంతో 17 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ విజ‌యంతో గ్రూప్ స్టేజ్ లో అన్ని విజ‌యాలు న‌మోదు చేసుకుని సూప‌ర్ 8లోకి అడుగుపెట్టింది టీమిండియా.

Also Read: Sourav Ganguly: 85 శాతం కంటి చూపు కోల్ప‌యిన పాకిస్తాన్ క్రికెట‌ర్‌..రంగంలోకి టీమిండియా ప్లేయ‌ర్లు, 14 మంది సంచ‌ల‌న లేఖ‌

ఆదుకున్న శివమ్ దూబే, మూడు సార్లు డక్ అవుట్ అయిన అభిషేక్ శర్మ

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో బుధవారం టీమిండియా వర్సెస్ నెదర్లాండ్స్ ( India vs Netherlands, 36th Match,) మధ్య 36వ మ్యాచ్ జరిగింది. గ్రూప్ స్టేజ్ లో చివరిది అయినా ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా నిర్ణీత 20 ఓవర్లు ఆడింది ఇండియా. ఈ సందర్భంగా ఆరు వికెట్లు నష్టపోయిన టీమిండియా 193 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ మరోసారి డక్ అవుట్ అయ్యాడు. ఇప్పటికే రెండుసార్లు డక్ అవుట్ అయిన అభిషేక్ శర్మ ఇది మూడవసారి. ఇంకా మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ ఇవాళ పెద్దగా రాణించలేదు.

ఏడు బంతుల్లో 18 పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఆర్యన్ దత్ బౌలింగ్ లో ఇషాన్ కిషన్ వికెట్ సమర్పించుకున్నాడు. ఇక తర్వాత వచ్చిన తిలక్ వర్మ 27 బంతుల్లో 31 పరుగులు సాధించాడు. టీమిడియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 28 బంతుల్లో 34 పరుగులతో పర్వాలేదనిపించాడు. అయితే ఇలాంటి నేపథ్యంలో వచ్చిన ఆల్ రౌండర్ శివమ్ దూబే 31 బంతుల్లో 66 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సిక్సర్లు అలాగే నాలుగు బౌండరీలు ఉన్నాయి. హార్దిక్ పాండ్యా 21 బంతుల్లో 30 పరుగులు సాధించాడు. దీంతో ఈ భారీ స్కోరు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే నిర్ణీత 20 ఓవర్లు ఆడిన నెదర్లాండ్స్, కేవలం 176 పరుగులు సాధించి, 7 వికెట్లు న‌ష్ట‌పోయింది.  దీంతో ఇండియా విజ‌యం సాధించింది. అటు ఈ మ్యాచ్ లో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ గా శివ‌మ్ దుబే నిలిచారు.

Advertisement

Also Read: ZIM qualified into super 8: కొంపముంచిన వ‌రుణుడు, ప్ర‌పంచ క‌ప్ నుంచి నిష్క్ర‌మించిన‌ ఆస్ట్రేలియా..సూప‌ర్ 8 కు జింబాబ్వే

 

 

Related News

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

నేను లేక‌పోతే..టీమిండియాలో ధోని అడుగు పెట్టేవాడే కాదు!

Big Stories

Advertisement
×