E-Paper
Advertisement

Sri Satya: లగ్జరీ బంగ్లాలు.. ఖరీదైన కార్లు.. ఆస్తులపై శ్రీ సత్య షాకింగ్ కామెంట్!

Sri Satya: లగ్జరీ బంగ్లాలు.. ఖరీదైన కార్లు.. ఆస్తులపై శ్రీ సత్య షాకింగ్ కామెంట్!
Advertisement

Sri Satya:ప్రముఖ సినీనటి శ్రీ సత్య గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బుల్లితెర షోలు, బిగ్ బాస్, సినిమాలు వంటి కార్యక్రమాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొని ఎన్నో విషయాలను పంచుకుంది. అందులో భాగంగానే లగ్జరీ బంగ్లాలు , ఖరీదైన కార్లు అంటూ వస్తున్న వార్తలపై స్పందించి అందర్నీ ఆశ్చర్యపరిచింది శ్రీ సత్య.

ఆస్తులపై శ్రీ సత్య షాకింగ్ కామెంట్..

సినిమాలు , షోలు, రియాలిటీ షోలు అంటూ బిజీగా మారిపోయావు. నీ సంపాదన ఎంత? ఆస్తిపాస్తుల వివరాలు ఏంటి? అని హోస్ట్ వర్ష అడగగా.. నాకు పెద్దగా ఆస్తులు ఏమి లేవు. ఆస్తిపాస్తులు మొత్తం జీరో. నాకు సొంత ఇల్లు లేదు.. సొంత కారు లేదు. మా నాన్న బిజినెస్ పూర్తిగా లాస్ అయిపోయింది. మా అమ్మకి కోవిడ్ టైంలో అలాంటి పరిస్థితి ఏర్పడడం వల్ల ఉన్న ఒక ఇంటిని కూడా అమ్మేసుకున్నాము. అంటూ తన ఆస్తుల వివరాల గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది శ్రీ సత్య.

జీవితంలో అదొక్కటే భయం..

Advertisement

ఇకపోతే శ్రీ సత్య మాట్లాడుతూ..” నాకు ఆస్తిపాస్తులు లేవు ఇప్పుడు ఆఫర్లు కూడా పెద్దగా లేవు. ఇక ఉన్న భయం కూడా అదే.. చేతిలో పని లేకపోతే నా కుటుంబాన్ని పోషించడం చాలా కష్టంగా ఉంటుంది. మా అమ్మ కదలలేని పరిస్థితి.. మా అమ్మను చూసుకుంటూ మా నాన్న గడిపేస్తున్నారు.. ఇప్పుడు నా కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే నా భయం మొత్తం వారి గురించే. అది తప్ప ఇక దేని గురించి నేను భయపడడం లేదు. బాధపడడం లేదు అంటూ శ్రీ సత్య తెలిసింది. ప్రస్తుతం అయితే కొంచెం వర్క్ ఉంది డబ్బులు వస్తున్నాయి సరిపోతుంది . దీని తర్వాత నా పరిస్థితి ఏంటి అనే భయం నన్ను వెంటాడుతోంది. అంటూ శ్రీ సత్య తెలిపింది. తన ఆస్తుల గురించి వస్తున్న వార్తలపై ఒక్క మాటలో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది శ్రీ సత్య. చేతిలో పని ఉంటే తప్ప డబ్బులు లేని పరిస్థితి చూసి అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఈమె కష్టానికి ప్రతిఫలం లభించాలని, వరుస అవకాశాలు రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

అమ్మ కోసం భారీ ఖర్చు..

మా అమ్మ కోసం ఒక పని అమ్మాయిని పెట్టాము. అమ్మను కూర్చోబెట్టడం, పడుకోబెట్టడం వాష్ రూమ్ కి తీసుకెళ్లడం లాంటి పనుల కోసం ఆ అమ్మాయి ఉంటుంది. మా అమ్మ ఫిజియోథెరపీ కోసం ప్రతి వారం 20వేల రూపాయలు ఖర్చవుతుంది. ఇక నెలకు 2 నుండి రెండున్నర లక్ష వరకు ఖర్చు అవుతుంది. ఆ డబ్బంతా ఎక్కడి నుంచి తీసుకురావాలి నిజంగా నా కష్టాలు ఎవరికీ రాకూడదు అంటూ శ్రీ సత్య తెలిపింది . ఇక ప్రస్తుతం శ్రీ సత్య చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

also read: Aishwarya Lakshmi: పెళ్లి కంటే అదే ముద్దు.. ఐశ్వర్య లక్ష్మీ సంచలన కామెంట్స్!

Related News

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Big Stories

Advertisement
×