E-Paper
Advertisement

Iran Offer to Greenland: ఎత్తుకు పైఎత్తులు.. గ్రీన్‌ల్యాండ్‌కు ఇరాన్ ఆఫర్, ట్రంప్‌కు ముచ్చెమటలు

Iran Offer to Greenland: ఎత్తుకు పైఎత్తులు.. గ్రీన్‌ల్యాండ్‌కు ఇరాన్ ఆఫర్, ట్రంప్‌కు ముచ్చెమటలు
Advertisement

Iran Offer to Greenland: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై మాటల అస్త్రాన్ని ఎక్కుపెట్టింది ఇరాన్. ఆయన్ని టార్గెట్ చేస్తూ కొత్త అస్త్రాలు సంధించింది. ట్రంప్ నుంచి గ్రీన్‌లాండ్‌ను తాము రక్షిస్తామని ఇరాన్ ప్రతిపాదన చేసింది. జస్ట్ మీరు అడగండి చాలు మేం వస్తామని చెప్పింది. దీంతో ఇరుదేశాల ఏం జరుగుతుందోనన్న ఆసక్తి అప్పుడే మొదలైంది.

గ్రీన్‌ల్యాండ్‌కు ఇరాన్ ఆఫర్, ట్రంప్‌కు ముచ్చెమటలు

Advertisement

కొద్దిరోజుల కిందట గ్రీన్‌లాండ్‌‌ను చేజిక్కించుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ వ్యవహారంపై ఇరాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నుంచి గ్రీన్‌లాండ్‌ను రక్షించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. ఈ విషయంలో ట్రంప్ మొదట ఐరోపా యూనియన్‌ను బెదిరించి, చివరకు బ్రతిమాడారని అన్నారు.

ఇవాళ మీరు రాకపోతే తాము గ్రీన్‌లాండ్‌ను తీసుకుంటామని అన్నారు. యూరోపియన్ యూనియన్‌కు తాను చెప్పేది ఒక్కటేనని, మీరు గ్రీన్‌లాండ్‌ను కాపాడుకోలేకపోతే మమ్మల్ని సాయం అడగాలని అన్నారు ఇరాన్ ప్రతినిధి. దాన్ని రక్షించడానికి తాము సిద్ధమేనని తేల్చిచెప్పారు. దానికి ఈ విధంగా రక్షణ కల్పిస్తారనే విషయాన్ని వెల్లడించలేదు.

Advertisement

ఇరాన్ ప్రతినిధి మాటలను క్షుణ్నంగా పరిశీలిస్తున్న అమెరికా

పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇరాన్ ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఇజ్రాయెల్-అమెరికా దాడులను ఎదుర్కొంటున్న ఇరాన్, ప్రతీకారంగా హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. దీంతో చమురు మార్గాన్ని సురక్షితం చేసుకోవడంలో అమెరికాకు సాయం చేయాలని ట్రంప్ నాటో, ఐరోపా దేశాలను కోరారు.

ఇటీవల ఇరాన్‌లోని కీలకమైన ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామంటూ ట్రంప్ బెదిరించారు. ఈ ఏడాది ఆరంభంలో గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు తన ప్రణాళికను పునరుద్ధరించారు. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా తక్షణ చర్చలు జరపాలని పిలుపునిచ్చారు.  గ్రీన్‌లాండ్‌ విషయంలో తనకు మద్దతు తెలపని ఈయూ దేశాలపై అదనపు సుంకాలను విధిస్తానని తొలుత బెదిరించారు ట్రంప్.

ALSO READ: ఇజ్రాయెల్‌కు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ అణు కేంద్రంపై ఇరాన్ దాడులు

ఏం జరిగిందో తెలీదుగానీ తర్వాత వెనక్కి తగ్గారు. ఇరాన్‌ అధికారి వ్యాఖ్యలతో తాజాగా ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఒప్పందం కుదరకపోతే డెన్మార్క్, నార్వే, స్వీడన్‌లతో సహా యూరోపియన్ యూనియన్ వస్తువులపై 10-25 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు కూడా. గ్రీన్‌ల్యాండ్ విషయంలో రాజీ పడేది‌లేదని డెన్మార్క్ తేల్చి చెప్పింది. చివరకు గ్రీన్‌ల్యాండ్ ప్రధాన మంత్రి నీల్సన్ కూడా నో చెప్పన విషయం తెల్సిందే.

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×