E-Paper
Advertisement

Big TV Kissik Talks: నేను నవ్వినా కాంట్రవర్సీ చేస్తున్నారు.. కానీ కర్మ వదలదు – శ్రీ సత్య

Big TV Kissik Talks: నేను నవ్వినా కాంట్రవర్సీ చేస్తున్నారు.. కానీ కర్మ వదలదు – శ్రీ సత్య
Advertisement

Big TV Kissik Talks: ఈ మధ్యకాలంలో ఎక్కడ విన్నా ఎక్కువగా వినిపిస్తున్న పదం కర్మ. ఎవరికైనా అన్యాయం చేస్తే, కాస్త ఆలస్యమైనప్పటికీ కచ్చితంగా అది రిటన్ వస్తుందని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా నొక్కి మరీ చెబుతున్నారు. కర్మ ఒకటి ఉందని, కచ్చితంగా అది పని చేస్తుందని, దానిని మేము నమ్ముతామని అంటున్నారు. తాజాగా స్మాల్ స్క్రీన్ బ్యూటీ శ్రీ సత్య (Sri Satya) కూడా అదే చెప్పారు. తను ఏం మాట్లాడినా కాంట్రవర్సీ చేస్తున్నారని, ఆఖరికి నవ్వినా కూడా కాంట్రవర్సీ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అయినా సరే, కర్మ అనేది కచ్చితంగా పని చేస్తుందని నమ్ముతానని శ్రీ సత్య అన్నారు. తాజాగా ఆమె బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big TV Kissik Talks) కార్యక్రమంలో పాల్గొని అనేక విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఆమె ఎందుకు కర్మ గురించి మాట్లాడారనే విషయానికి వస్తే..

Also Read- Kissik Talks: నేను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదే – శ్రీ సత్య

నవ్వినా కాంట్రవర్సీనే..

Advertisement

‘‘నేను ఎక్కడకు వచ్చి మాట్లాడుతున్నా, ఆఖరికి నవ్వుతున్నా నాపై కాంట్రవర్సీ చేస్తున్నారు. అది నా ప్రాబ్లమ్ కాదు. అప్పట్లో ఎవరో లైవ్‌లో మాట్లాడుతున్నారు.. అప్పుడే వచ్చా, నాకు నచ్చిన వాళ్లని నేను సపోర్ట్ చేసుకుంటున్నాను, నాపై రుద్దకండి అని చెప్పా. బిగ్ బాస్‌లో నాకు ఇమ్ము అంటే ఇష్టం. తనకి నేను సపోర్ట్ చేశాను. ఇమ్ముకి సపోర్ట్ చేసినందుకు నన్ను ఎంతగా తిట్టారో తెలుసా? ఒక ఆడపిల్లవి, ఆడపిల్లకి సపోర్ట్ చేయకుండా మగాళ్లకి సపోర్ట్ చేస్తావా? అని తిట్టారు. అదే ఆడపిల్ల అని శ్రీజకి సపోర్ట్ చేసినప్పుడు కూడా తిట్టారు. శ్రీజ ఆడపిల్ల కాదా! ఆమె రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు నాకు బాగా నచ్చింది. ఆమె కామెంట్‌నో, పోస్ట్‌నో రీ పోస్ట్ చేశాను. దానికి కూడా తిట్టారు. వారు ఎన్ని తిట్టుకుంటే నాకేంటి? నేనెప్పుడూ కర్మని నమ్ముతాను.

Also Read- Divi Vadthya: అలాంటి బట్టలు వేసుకునేందుకు రెడీగా ఉన్నానని దర్శకులకు తెలియాలి కదా..దివి షాకింగ్ వ్యాఖ్యలు

కచ్చితంగా కర్మ పని చేస్తుంది

Advertisement

కర్మని నేను బాగా నమ్ముతాను. ఆల్రెడీ నేను చూస్తున్నాను కూడా. కొందరు ఫేస్ చేస్తున్నారు. నేనైనా సరే.. ఎదుటి వాళ్లది ఎటువంటి తప్పులేకుండా.. కావాలని ఎవరినైనా టార్గెట్ చేస్తే.. జరిగాల్సిన రోజున నాకు జరగాల్సిన బ్యాడ్ జరుగుతుంది. ఏ విధంగానైనా అది జరగవచ్చు. ఇది నేను బాగా నమ్ముతాను. అవతలి వాళ్లని తెలిసో, తెలియకో ఎప్పుడూ ఏడిపించవద్దు. ఇందులో అమ్మాయి, అబ్బాయి అనేం తేడా లేదు.. ఎవరి ఏడుపు మంచిది కాదు. కాబట్టి ఎవరికీ అన్యాయం చేయకండి.. చేస్తే ఏదో ఒక రోజు కచ్చితంగా తిరిగి కొడుతుంది. మంచి చేయకపోయినా పర్లేదు కానీ, చెడు మాత్రం చేయకండి’’ అని శ్రీ సత్య కోరారు.

Also Read- Sri Satya Kissik Talks: ‘బీబీ జోడీ’లో సెల్ఫ్ ఎలిమినేషన్‌కు కారణమిదే!

Related News

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

Big Stories

Advertisement
×